»   » భావోద్వేగం... 'దృశ్యం‌' (రివ్యూ)

భావోద్వేగం... 'దృశ్యం‌' (రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Rating:
  3.0/5

  ----సూర్య ప్రకాష్ జోశ్యుల

  సినిమావాళ్లు చాలా సార్లు స్టేజిలపై ... మా సినిమాలో కథే హీరో అంటూంటారు ...అది నిజమని నమ్మి మనం థియోటర్ లోకి వెళితే అక్కడ కథ తప్ప అన్నీ హైలెట్ లుగా కనపడుతూంటాయి. అయితే ఈ సారి కథనమే హీరోగా వచ్చింది. సాధారణమైన కథకు భావోద్వేగపూరితమైన కథనం సమకూర్చిన 'దృశ్యం‌'...మళయాళి రీమేక్ అయినా యూనివర్శిల్ అప్పీల్ ఉన్న కథ కావటంతో ఇక్కడ ప్రేక్షకులను కట్టిపారేసింది. సరిగ్గా ఓపినింగ్స్ తెచ్చుకోలేకపోయిన ఈ చిత్రం...మౌత్ టాక్ తో మంచి విజయం సాధించే అవకాసం కనపడుతోంది. తన వయస్సుని గుర్తు చేసుకుని ఇలాంటి ఇద్దరు పిల్లల తండ్రి కథను ఒప్పుకున్నందుకు వెంకటేష్ ని ముందుగా అభినందించాలి.
  మోహన్ లాల్ తో పోల్చలేం కానీ వెంకటేష్ బాగానే చేసారు. అలాగే ఈ చిత్రాన్ని దర్శకురాలు...తన సొంత క్రియేటివిటీని ప్రదర్శరించకుండా ఒరిజనల్ సినిమాలో వాడిన కారు కలర్స్ తో సహితం మక్కికి మక్కి దించే ప్రయత్నం చేసింది. చిన్న బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలకు పెద్ద లాభాలే తెచ్చి పెడుతుందనిపిస్తోంది.

  తన ఊళ్లో కేబుల్ నడుపుకుంటున్న రాంబాబు(వెంకటేష్) కి తను చూసే సినిమాలు, తన భార్య(మీనా) పిల్లలే లోకం. తన జీవితంలో వచ్చే సమస్యలకు తను చూసిన సినిమాల్లోంచే పరిష్కారాలు వెతుక్కునే అతను ఊహించని సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. అతని కుమార్తె అంజు బట్టలు మార్చుకునేటప్పడు...సెల్ లో వీడియో తీసి వరుణ్ అనే కుర్రాడు బ్లాక్ మెయిల్ చేస్తూంటాడు. దాన్ని నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో వాడు..అంజు చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. వరుణ్ ... ..పోలీస్ ఐజీ గీతా ప్రభాకర్ (నదియా) కొడుకు. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు ఏం చేసాడు. ఏ విధంగా ప్లాన్ లు వేసి , తన కుటుంబాన్ని వేటాడటానికి సిద్దమైన పోలీస్ డిపార్టమెంట్ నుంచి కాపాడుకున్నాడు అనేది ఉత్కంట కలిగించే కథనం.

  దైవం చెప్పిన మార్గం ప్రవచనాలు అంటూ ఇందులో సినిమా మొత్తం ఓ వాక్యం అందరి నోటమ్మట వినపడుతూ ఉంటుంది. సినిమాకు కీలకంగా నిలిచే ఆ వాక్యం ...ఎందుకింత విచిత్రంగా, ఉంది అంటే...మళయాళంని ఉన్నది ఉన్నట్లు ఇక్కడ నేటివైజ్ చేయాలనే తాపత్రయం. ఇలాంటివి పంటిక్రింద రాయిలా తగులుతూ ఉంటాయి రీమేక్ ని మక్కికి మక్కీ దించారు అనే విషయం కన్నా.... సినిమాలో టెంపో ఎక్కడా సడలకుండా రూపొందించిన సన్నివేశాల మధ్యలో కమర్షియల్ అంశాల పేరిట కామెడీ, ఐటం సాంగ్ వంటివి కలపకపోవటం ఈ దర్శకురాలు చేసిన పెద్ద తెలివైన పని. ఇలాంటి థ్రిల్లర్ జానర్ లో ఓపెన్ స్క్రీన్ ప్లే తో వచ్చే సినిమాలు మన తెలుగులో చాలా అరుదు అనే చెప్పాలి. మళయాళంలో ఘన విజయం సాధించటం, తక్కువ బడ్జెట్ లో రూపొందించబడటం, యూనివర్శిల్ అప్పీల్ ఉన్న కథ,కథనం అనే అంశాలు ఈ రీమేక్ ను తెలుగుకు వచ్చేలా చేసాయి. తెలుగులో వరస రీమేక్ లు...ముఖ్యంగా ఫ్యామిలీ కథలు చేసే వెంకటేష్ ఈ ప్రాజెక్టులోకి రావటంతో సగం సక్సెస్ సినిమా రిలీజ్ కు ముందు ఖరారైంది. ఆల్రెడీ ప్రూవైన ...రీమేక్ చిత్రం కాబట్టి కథనంపై విష్లేషణ ప్రత్యేకంగా అనవసరం.

  దర్శకత్వం కాదు...రీమేకత్వం

  దర్శకత్వం కాదు...రీమేకత్వం

  2008 లో వచ్చిన జపనీస్ చిత్రం Suspect X ని ఎంతో సమర్ధవంతగా ఇండియన్ నేటివిటికి మార్చి దర్శకుడు జీతు జోసెఫ్ మళయాళంలో అందిస్తే...దాన్ని మక్కికి మక్కి అక్షరం కూడా(డైలుగుల్లో కూడా) పొల్లు పోకుండా...నటన తో సైతం దించే ప్రయత్నం చేసింది దర్శకురాలు. వెంకటేష్, మీనా, నదియా, నరేష్ వంటి సీనియర్ నటులు తమ నటనతో దాన్ని దాటారు కాబట్టి ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు కానీ లేకపోతే చాలా తేడా చిత్రంగా మిగిలేది.

  స్క్రీన్ ప్లే, సంగీతం

  స్క్రీన్ ప్లే, సంగీతం

  ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఈ చిత్రం పండటానికి కారణం బిగిసడలకుండా రాసుకున్న స్క్రీన్ ప్లేనే. సినిమా ఫస్టాఫ్ సో సోగా సమస్య సెటప్ కే సమయం తీసుకున్నా సెకండాఫ్ మాత్రం పరుగెత్తించారు. అలాగే ఇలాంటి సినిమాలుకు రీరికార్డింగ్ ప్రాణం. పాటలు బాగోలేకపోయినా రీ రికార్డింగ్ ని శ్రద్దగా చేసారు.

  వెంకటేష్

  వెంకటేష్

  హీరోగా వెంకటేష్ ..రీమేక్ ల రాజా అనే విషయం తెలిసిందే. అయితే వయస్సు మీద పడిందనే విషయం ఈ సినిమాలో స్పష్టంగా కనపడింది. అయితే మధ్య తరగతి, ఇద్దరు పిల్లల తండ్రి పాత్రకు సరిగ్గా సరిపోయాడు. అలాంటి పాత్రను తన సమకాలీన హీరోలు చేయటానికి జంకుతున్న సమయంలో చేసి శభాష్ అనిపించుకున్నాడు.

  మీనా, పిల్లలు

  మీనా, పిల్లలు

  వెంకటేష్ , మీనా కాంబినేషన్ లో గతంలో అనేక సూపర్ హిట్స్ వచ్చాయి. అయితే అవన్నీ వారిద్దరూ వయిస్సులో ఉన్నప్పటివి. ఇప్పుడు నడివయస్సులోనూ మీనా తన హోమ్లీ లుక్ తో, నటనతో సినిమాకు ప్రాణం పోసింది. అయితే మేకప్ కొంచెం ఓవర్ గా అనిపించింది. పిల్లలలో మళయాళంలో చేసిన చిన్న పిల్లే ఇక్కడ కూడా చేసింది. ఆ పిల్ల నటన సినిమా హైలెట్స్ లో ఒకటి

  నదియా

  నదియా

  చిత్రంలో మరో కీలకమైన ఐజీ పాత్ర చేసిన నదియా... ఎందుకనో అత్తారింటికి దారేది చిత్రంలో ఉన్న ఛార్మ్ కోల్పోయినట్లు అనిపించింది. అయితే నటనతో దాన్ని అథిగమించే ప్రయత్నం చేసింది. అయితే మళయాళంలో చేసినామెతో పోలిస్తే అంత గొప్పగా చెయ్యలేదనే చెప్పాలి.

  టెక్నికల్ గా

  టెక్నికల్ గా

  కెమెరా వర్క్ రిచ్ గా లేదు. దాంతో చాలా సీన్లు విజువల్ గా పూర్ గా అనిపించాయి. దృశ్యం అని టైటిల్ పెట్టినందుకైనా విజువల్స్ పై కాస్త శ్రధ్ద పెట్టి ఉంటే బాగుండేది. అలా చేయకపోవటం వల్ల ఎమోషన్ సన్నివేశాల్లో టీవి సీరియల్ లుక్ వచ్చింది. ఎడిటింగ్...పరంగా ఫస్టాఫ్ మరింత ట్రిమ్ చేయాలి.

  మైనస్

  మైనస్

  ఈ సినిమాకు ఉన్న మైనస్ లలో రన్ టైం ఒకటి. థ్రిల్లర్ కథాంశాలు ఎంత టైట్ స్క్రీన్ ప్లే తో ఉంటే అంత బాగుంటాయి. అలాంటిది నిడివి పెంచారు. మళయాళంలో ఉన్నది ఉన్నట్లు దింపాలనే తాపత్రయంలో రన్ టైం ని మర్చిపోయారు. కొన్ని సీన్స్ ఫస్టాఫ్ లో తొలిగించినా కథనానికి వచ్చే నష్టమేమీ లేదు. అలాగే ఈ సినిమాకు ఉన్న మరో మైనస్...డైలాగులు. అనువదించిన డైలాగులు లాగ ఉన్నాయి కానీ ఎక్కడా నేటివిటీ కనపడలేదు. కొన్ని చోట్ల పుస్తకాల్లో వాడే లాంగ్వేజిని కూడా వాడారు.

  క్రైమాక్స్

  క్రైమాక్స్

  ఈ సినిమాకు ఉన్న పెద్ద హైలెట్ లలో చివరి ఇరవై నిముషాలు. థియోటర్ వదిలే ముందు వచ్చే ఈ ఇరవై నిముషాలు సినిమాకు ఆయువు పట్టులా నిలిచాయి. అలాగే ఫైనల్ పంచ్ సైతం సినిమాను ఎక్కడితో తీసుకు వెళ్లింది.

  నిర్మాణ విలువలు

  నిర్మాణ విలువలు

  చాలా తక్కువలో ఈ చిత్రాన్ని చుట్టేసినట్లు అనిపిస్తుంది. అయితే సీన్స్ లో బిగి ఉండటంతో ఆ తేడా పెద్దగా కనపడదు. మరింత ఖర్చు పెట్టి ఉంటే ఖచ్చితంగా మరింత బాగుండేది.

  ఎవరెవరు

  ఎవరెవరు

  చిత్రం: దృశ్యం
  బ్యానర్: రాజ్‌కుమార్‌ థియేటర్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌, వైడ్‌ యాంగిల్‌ క్రియేషన్స్‌
  నటీనటులు: వెంకటేష్, మీనా, నదియా, పరుచూరి వెంకటేశ్వరరావు, చలపతిరావు, సమీర్, రవి కాలె, సప్తగిరి నాయుడు, గోపి, రోషన్ బషీర్, ఉత్తేజ్, కాదంబరి కిరణ్, కాశీ విశ్వనాధ్, జోగినాయుడు, చిత్రం శ్రీను, చైతన్యకృష్ణ, బెనర్జీ, ప్రభు, ప్రసన్నకుమార్, అన్నపూర్ణమ్మ, సంధ్యాజనక్ తదితరులు.
  కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి,
  సంగీతం: శరత్,
  కథ: జీతూ జోసెఫ్,
  ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్,
  రచన: పరుచూరి బ్రదర్స్, మాటలు: స్వామి,
  నిర్మాత: డి.సురేష్‌బాబు, రాజ్‌కుమార్ సేతుపతి,
  సమర్పణ: డి రామానాయుడు
  దర్శకత్వం:శ్రీ ప్రియ

  ఫైనల్ గా ఇలాంటి కథ,కథనాలు తెలుగు స్ట్రైయిట్ చిత్రాలలోనూ రావాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే ఇప్పటికే మళయాళ వెర్షన్ చూసిన వారు ఈ సినిమాని చూస్తే పెద్ద ఆసక్తిగా ఉండదు సరికదా ఏంటిలా కొద్దిగా కూడా మార్చకుండా తీసేసారు అనే ఆశ్చర్యం,నిరాశ కలుగుతుంది. కాబట్టి వారు దూరంగా ఉండటం మేలు. ఇప్పటికే చూడనివారికి ఈ సినిమా ఓ మంచి సినిమా చూసిన ఫీల్ కలుగ చేస్తుంది. దాదాపు ఇప్పుడు అన్ని కుటుంబాల్లో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ఇందులో ప్రస్తావించారు కాబట్టి ఈ చిత్రం ఫ్యామిలీలకు కూడా బాగా నచ్చుతుంది.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Drushyam is an eponymous remake of Malayalam blockbuster released today with positive talk. Drushyam directed by Sripriya has Venkatesh and Meena playing the lead roles. Nadhiya is donning the role done by Asha Sarath in the original. Music for the movie is composed by Sharreth whereas S. Gopal Reddy has handled cinematography and Marthand K. Venkatesh editing.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more