twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెన్నెల కాదు... అమావాస్య! (వెన్నెల 1 1/2 రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    1.5/5
    'వెన్నెల' చిత్రం ద్వారా కమెడియన్‌గా పరిచయం అయిన కిషోర్ ఆచిత్రం హిట్ కావడంతో అదే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఇంత కాలం కామెడీ పాత్రలతో రాణించిన వెన్నెల కిషోర్ ఈ సారి తనలోని దర్శకుడిని చూపించడానికి ట్రై చేస్తూ 'వెన్నెల 1 1/2' చిత్రాన్ని రూపొందించారు.

    బ్యానర్: వింటేజ్ క్రియేషన్స్
    దర్శకత్వం: వెన్నెల కిషోర్
    నిర్మాతలు: వాసు, వర్మ
    మ్యూజిక్: సునీల్ కశ్యప్
    తారాగణం: చైతన్య, మోనాల్ గజ్జర్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రఘబాబు, తాగుబోతు రమేష్, మాస్టర్ భరత్ తదితరలు....

    కథేమిటంటే...
    కృష్ణ(చైతన్య) జాలీగా తిరిగే కుర్రాడు. ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిపోయిన వెన్నెల(మోనాల్ గజ్జర్)ని ప్రేమిస్తాడు. మొత్తానికి వెన్నెల కూడా చైతన్యను ప్రేమిస్తుంది. కానీ అతడో మోసగాడు అని తెలుసుకుని రియలైజ్ అయి అతని నుంచి దూరంగా వెలుతుంది. మరి చైతన్య ఏం చేసాడు? అనేది తర్వాతి కథ.

    పెర్ఫార్మెన్స్: చైతన్య నటన విషయంలో ఫర్వాలేదనిపించాడు. డాన్సులు గట్రాఓకే. మోనాల్ గజ్జర్‌కు అందం ఉందే తప్ప పెర్ఫార్మెన్స్ రాదని తేలిపోయింది. బ్రహ్మానందం క్యారెక్టర్ నవ్వించలేక పోయింది అనేకంటే ఆయన్ను సరిగా వాడుకోలేక పోయారు అనటం మేలు. వెన్నెల కిషోర్ తనకు వచ్చిన కామెడీ చేసాడు. తాగు బోతు రమేష్ ఫర్వాలేదనిపించాడు. ఇతరుల గురించి చెప్పుకుని దండగ.

    టెక్నికల్ అంశాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, స్క్రీనే ప్లే... అన్నీచెత్తగానే ఉన్నాయి. వెన్నెల కిషోర్ దర్శకుడిగానే కాదు, స్క్రిప్టు విషయంలో కూడా పూర్తి గా ఫెయిల్ అయ్యాడు. సినిమా మొత్తం గందరగోళంగా తయారైంది.

    వెన్నెల సినిమా చూసిన వారు అదే తరహాలో సినిమా కామెడీగా, రొమాంటిక్‌గా ఉంటుందని వెళితే మీ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లే. వెన్నెల 1 1/2 ఒక రొటీన్ కథ. చెత్త కథనం. టైటిల్ కి అసలు జస్టిఫికేషనే లేదు. చీఫ్ కామెడీ‌ని చూసి నవ్వడం మాట అటుంచితే అసహ్యం వేయడం మాత్రం ఖాయం. థియేటర్లో కూర్చోబెట్టి టార్చర్ పెట్టడం ఎలా ఉంటుందే ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది.

    English summary
    ‘Vennela’ was a movie which scored well when it released many years back, launching the careers of Vennela Kishore. Now Kishore has come up with a sequel to that movie and it has been titled ‘Vennela 1 1/2′. The movie is releasing today across the world. As a director Kishore failed to extract good output from any of his technicians. Quiet understandable! Because he himself failed utterly as a writer and director. Vennela 1 1/2 is cheap and horrible and painful.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X