»   » సైక్లాజికల్, మర్డర్ మిస్టరీ కథ చెప్పిన ('భేతాళుడు' రివ్యూ)

సైక్లాజికల్, మర్డర్ మిస్టరీ కథ చెప్పిన ('భేతాళుడు' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

పట్టువదలని సిని మార్కుడు ధియోటర్ వద్దకు తిరిగి వెళ్ళి, టిక్కెట్ తీసుకుని నుంచి ఎన్నో అంచనాలను, ఆసక్తులను దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా కూర్చున్నాడు ... అప్పుడు సినిమాలోని భేతాళుడు ...."రాజా, ఇలా అర్థరాత్రి, అపరాత్రి వేళల్లో ధియోటర్ల వెంట ఎంతకాలమని తిరుగుతావు? అంటూ ఓ కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను" అంటూ మనకు కథ చెప్పటం మొదలెట్టడం కామన్ అయ్యిపోయింది.

అలాగే మనం ఎన్నో హర్రర్ థ్రిల్లర్ సినిమాలు ఎన్నో చూసి ఉంటాం. అయితే ఎప్పటికప్పుడు మనల్ని ధ్రిల్ చేసి, భయపెట్టే సినిమా ఎప్పటికైనా రాబోతుందా అని ధియోటర్ కు పరుగెడతాం...కానీ చాలాసార్లు భేతాళుడు ఏదో ఒక కథ చెప్పి , చివరికి మన డిప్పమీద ఒకటిచ్చి మన మౌనాన్ని బ్రద్దలు కొట్టి, చెట్టుమీదకు ఎక్కేస్తూంటాడు. ఇప్పుడు మరోసారి భేతాళుడు కొత్త కథ అంటూ చెప్పాడు...మరి చివరకు మనకు మౌన భంగం చేసి చెట్టు ఎక్కాడా ?


'బిచ్చగాడు' చిత్రం రిలీజ్ అయ్యేవరకూ విజయ్ ఆంటోని గురించి తెలుగువారికి పెద్దగా తెలియదు. అయితే ఆ సినిమా ఘన విజయం సాధించటంతో ఇక్కడ కూడా స్టార్ అయ్యిపోయారు. దాంతో ఆయన చేసిన లేటెస్ట్ చిత్రం భేతాళుడుకు స్ట్రైయిట్ స్టార్ హీరో చిత్రానికి వచ్చినంత క్రేజ్ తెచ్చుకుని విడుదలైంది. మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం పెరిగిన అంచనాలను అందుకుందా లేదా అంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.


నిజానికి ఈ చిత్రం పై విజయ్ ఆంటోని ఎంత నమ్మకంగా ఉన్నారంటే..సినిమా విడుదలకు ముందే యూట్యూబ్‌లో తొలి 10 నిముషాలు వీడియో విడుదల చేసి సంచలనం సృష్టించాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి అమాంతం పెరిగిపోయింది.


వాయిస్ లతో..

వాయిస్ లతో..

భేతాళుడు (తమిళ సైతాన్) కథ గురించి చెప్పాలంటే... ఓ వ్యక్తి తనకు వినపడుతున్న వాయిస్ లతో ఓ సాల్వ్ కాకుండా మిగిలిపోయిన మర్డర్ కేసుని ఇన్విస్ట్ గేట్ చేస్తాడు. ఈ ప్లాట్ గురించి ఎక్కువ చెపితే...చూద్దామనుకునే వాళ్ల ఆసక్తి పాడు చేసినట్లు అవుతుంది.


జయలక్ష్మి ఎవరు..

జయలక్ష్మి ఎవరు..

ఈ కథ మొత్తం దినేష్ అనే సాప్ట్ వేర్ ఇంజినీర్ చుట్టూ తిరుగుతుంది. అతను Schizophrenia తో బాధపడుతూంటాడు. జయలక్ష్మి అనే అమ్మాయి అతినికి కనపడుతూంటుంది. అసలు ఆమె ఎవరో అర్దం కాదు. అసలు అమె ఎవరు..ఇతనికే ఎందుకు కనపడుతోంది అనే యాంగిల్ లో కథ నడుస్తుంది.


అదిరిపోయింది

అదిరిపోయింది

సినిమాలో ఏం బాగుంది అంటే...మనల్ని ఆశ్చర్యపరిచే ప్లాట్ ట్విస్ట్ లు. అవే సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. అదేమిటో రివీల్ చేయల్ చేస్తే చూసేవాళ్లుకు ఇబ్బంది.


ఆ సినిమానే..

ఆ సినిమానే..

ఈ సినిమా చూస్తూంటే మనకు The Girl with the Dragon Tattoo గుర్తు వస్తుంది. అలాగని కాపీ అనలేం. ప్రేరణ అని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే.. తమిళంలో సుజాత రాసిన ఆహ్ అనే పాపులర్ నవలను బేస్ చేసుకుని తీసారని చెప్తున్నారు.


డ్రాప్ అవుతూ..

డ్రాప్ అవుతూ..

సినిమా ఫస్టాఫ్ ఎంతో చక్కగా తీసుకు వెళ్లిన దర్శకుడు సెకండాఫ్ కు వచ్చేసరికి పట్టు వదిలేసాడు. ముఖ్యంగా లాస్ట్ పదిహేను నిముషాలు బాగా లాగ్ తో స్లో అయ్యిపోయింది. విజయ్ ఆంటోని తన నటనతో ఎంత కవర్ చేద్దామని ప్రయత్నించినా డ్రాప్ అవుతూ వచ్చింది. క్లైమాక్స్ అయినా పట్టుకున్నాడా అంటే అదీ వీక్ గా ఉంది.


అక్కడనుంచే మొదలు

అక్కడనుంచే మొదలు

ఈ సినిమా ప్లస్ పాయింట్ ఏమిటీ అంటే సినిమా ప్రారంభం నుంచి సోది లేకుండా స్ట్రైయిట్ గా కథలోకి వచ్చేయటం. ప్రారంభ సీన్స్ లోనే విజయ్ ఆంటోని మానసిక రుగ్మతను ఎస్టాబ్లిష్ చేసి ఆసక్తిరేపటం. అక్కడే మనల్ని కట్టిపారేస్తాడు దర్శకుడు.


అన్వేషణ బాగుంది

అన్వేషణ బాగుంది

అలాగే...విజయ్ ఆంటోనీ తన గత జన్మలోని జయలక్ష్మిని వెతుక్కుంటూ వెళుతూ ఆమెన గురించిన విషయాలను తెలుసుకునే సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. అవన్నీ ఓ మంచి సినిమా ని చూస్తున్నామనే ఫీల్ ని కలగచేస్తూ నడిచాయి.


గత జన్మలో..

గత జన్మలో..

అంతేకాకుండా... సెకండాఫ్ లో చెప్పిన విజయ్ ఆంటోనీ గత జన్మ తాలూకు కథ చాలా నాచురల్ గా, ఇంట్రెస్టింగా డిజైన్ చేసారు. ప్రస్తుత జన్మలోని దినేష్ పాత్రకు, గత జన్మలోని శర్మ పాత్రకు మధ్య ఆంటోనీ చూపిన వైవిధ్యం అతనిలోని నటుడిని మరోసారి వెలికి తీసింది.


ట్విస్ట్ రివీల్ అయ్యాక..

ట్విస్ట్ రివీల్ అయ్యాక..

అప్పటిదాకా టైట్ గా గ్రిప్పింగ్ నేరేషన్ తో సెకండాఫ్ ప్రారంభం బాగుందనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా సినిమాలో యాక్చువల్ ట్విస్ట్ రివీల్ అయ్యాక నీరు కారిపోయింది. అక్కడ నుంచి స్లో అయ్యి, బోర్ కొట్టడం మొదలైంది.


టిపికల్ క్లైమాక్స్ లో

టిపికల్ క్లైమాక్స్ లో

ముఖ్యంగా క్లైమాక్స్ కు వచ్చేసరికి అర్దాంతరంగా ముగించిన ఫీలింగ్ వచ్చింది. అలాగే...సినిమాటెక్ లిబర్టీస్ బాగా తీసుకుని డిజైన్ చేయటంతో ఆసక్తి పోయింది. డైరక్టర్ ఎక్కడికక్కడ తనువదిలిన ప్రశ్నలకు రీజన్స్ చెప్తున్నా... సినిమా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లు అసంతృప్తిగానే అనిపించాయి. ముఖ్యంగా ఫోర్స్ గా ... క్లైమాక్స్ లో ఓ ఫైట్ పెట్టడం, అన్ని ఎమోషన్స్ అక్కడే రివీల్ చేయటం ఇలా క్లైమాక్స్ నీరు గార్చేసింది. అలాగే డిఫెరెంట్ సినిమాకు టిపికల్ ఎండింగ్ ఆలోచిచంటం ఆశ్చర్యంగా ఉంటుంది.


మల్టిలేయర్ మిస్టరీస్

మల్టిలేయర్ మిస్టరీస్

అయితే కేవలం భేతాళుడు ట్విస్ట్ లను పేర్చుకుంటూ స్క్రిప్టు రాసుకున్నారు కానీ , ఎత్తుకున్న కథలో డెప్త్ కు వెళ్లలేదు. ఎగ్జిక్యూషన్ పార్ట్ లో తెలివి లేదనిపించింది. ముఖ్యంగా ఇలాంటి స్క్రిప్టులు కాంప్లికేటెడ్ గా లేకుండా ఉంటే బాగుంటుంది. కానీ మల్టిలేయర్ మిస్టరీస్ ని సినిమా డీల్ చేయటంతో అర్దం చేసుకుంటూ సినిమా చూడాల్సిన పరిస్దితి ఏర్పడింది.


ఈ క్రెడిట్ విజయ్ ఆంటోనిదే

ఈ క్రెడిట్ విజయ్ ఆంటోనిదే

టెక్కికల్ గా చెప్పుకోలంటే ఈ సినిమా మేకింగ్ చాలా బాగా చేసాడు దర్శకుడు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, వాయిస్ ఓవర్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఓ మూడ్ ని క్రియేట్ చేసారు. సాంగ్స్ అంత గొప్పగా లేవు. విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతను అంత బాగా నటించాడు.


సాంకేతికంగా చెప్పుకోలంటే

సాంకేతికంగా చెప్పుకోలంటే

ఈ సినిమాటోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్స్ విషయంలో చాలా శ్రద్ద తీసుకుని చేసారు. చాలా చోట్ల హాలీవుడ్ స్టాండర్డ్స్ లో భలే తీసార్రా అనిపిస్తుంది. ప్రదీప్ కళైపురయత్ సినిమాటోగ్రఫీ నీట్ గా బాగుంది. ఎడిటింగ్ కూడా ఎక్కడ కన్ఫూజ్ అవకుండా ఉంచటానికి పనికొచ్చింది. ఇక విజయ్ ఆంటోనీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.


టీమ్ ఇదే...

టీమ్ ఇదే...

బ్యానర్స్ : మానస్ రిషి ఎంటర్‌ప్రైజెస్‌, విన్ విన్ విన్ క్రియేషన్స్‌, ఆరా సినిమాస్ బ్యానర్స్‌
నటీనటులు : విజయ్ ఆంటోని, అరుంధతినాయర్, చారుహాసన్, మీరా కృష్ణన్, వైజి మహేంద్ర, సిద్దార్ద శంకర్, కమల్ కృష్ణ, ఆడుకాలమ్ మురగదాస్, విజయ్ సారధి, కిట్టీ తదితరులు
సినిమాటోగ్రఫి:ప్రదీప్ కళైపురయత్
ఎడిటర్: వీర్ సెంధిల్ రాజ్
దర్శకత్వం : ప్రదీప్ కృష్ణమూర్తి
సమర్పణ : మల్కాపురం శివకుమార్‌, ఫాతిమా విజయ్ ఆంటోని
నిర్మాత : కె.రోహిత్‌, ఎస్‌.వేణుగోపాల్
సంగీతం : విజయ్ ఆంటోని
విడుదల తేదీ: 1, డిసెంబర్ 2016పైనల్ గా ఈ చిత్రం కథ పునర్జన్మకు చెందిందా, సూపర్ నేచురల్ కాన్సెప్టా లేక డ్రగ్స్ మీదా అనే విషయం క్లారిటీ ఇస్తూ సరిగ్గా డీల్ చేసి ఉంటే బిచ్చగాడుని క్రాస్ చేసే బ్లాక్ బస్టర్ అయ్యేది. ఇప్పటికీ ఈ చిత్రం చెత్తేమి కాదు..ఓ విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి మంచి ఆప్షనే.

English summary
After Bicchagaadu, Vijay antony is coming with another film “Bhethaludu” (Saithan) .Arundathi Nair is playing the main female lead in the film. Vetaran Actor Chaaru haassan is playing a crucial role in the film. As per the speculations, the film is based on Sujatha’s novel ‘aaah’. The story of the film is totally fictional.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu