For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యమన్ రివ్యూ

  By Rajababu
  |

  Rating:
  2.0/5
  Star Cast: విజయ్ ఆంటోని, మియా జార్జ్, త్యాగరాజన్
  Director: జీవా శంకర్

  మూస చిత్రాలతో కాకుండా, జయాపజయాలకు సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్తదనం అందించాలన్న తపన ఉన్న నటుల్లో విజయ్ ఆంటోని ఒకరు. నకిలీ, సలీం, బిచ్చగాడు, బేతాళుడు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో తమిళ, తెలుగు ప్రేక్షకుల ఆదరణ చూడగొన్నారు. బిచ్చగాడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత వచ్చిన బేతాళుడు సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతగా కొత్త అవతారం ఎత్తిన విజయ్ ఆంటోని ద్విపాత్రాభినయం చేస్తూ తాజాగా యమన్ చిత్రంతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఓ మాములు వ్యక్తి తనకు ఎదురైన పరిస్థితులను అధిగమించి మంత్రిగా ఎలా ఎదిగాడన్నది ఈ చిత్ర కథ. యమన్ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను అలరించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  యమన్ చిత్ర కథ ఏమిటంటే..

  యమన్ చిత్ర కథ ఏమిటంటే..

  అశోక చక్రవర్తి ( విజయ్ ఆంటోని) ఓ మామూలు వ్యక్తి. క్యాన్సర్ వ్యాధిన పడిన తన బామ్మ చికిత్స కోసం మూడు లక్షల రూపాయాలు అవసరం ఏర్పడుతుంది. డబ్బు కోసం ఓ యాక్సిడెంట్ కేసును మీద వేసుకొని జైలు కెళ్తాడు. జైలులో అశోక్ చక్రవర్తి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. రెండు రాజకీయ వర్గాల మధ్య జరిగిన ఫ్యాక్షన్ గొడవల్లో ఇరుక్కుపోతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఓ గ్రూపులో చేరుతాడు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కరుణాకరన్ ( త్యాగరాజన్)కు చేరువ అవుతాడు. అలా ఫ్యాక్షన్ గ్రూప్‌లో అంచెలంచెలుగా ఎదిగి మంత్రి పాండుకు ప్రధాన ప్రత్యర్థిగా మారతాడు. తాను హత్య చేసిన దేవరకొండ గాంధీ (విజయ్ ఆంటోని) కుమారుడే అశోక్ చక్రవర్తి అని మంత్రి పాండు తెలుస్తుంది. దాంతో ఓ దశలో అశోక్ చక్రవర్తిని మంత్రి పాండు, మాజీ ఎమ్మెల్యే కరుణాకరన్ హత్య చేయాలని కుట్ర పన్నుతారు. వారి కుట్రలను ఎదురించి ఎన్నికల్లో ఎలా గెలుపొందాడు? దేవరకొండ గాంధీని పాండు ఎందుకు చంపాడు? గాంధీ కుట్రలకు అశోక్ చక్రవర్తి కుటుంబం ఎలా అన్యాయానికి గురైంది? రాజకీయ ప్రత్యర్థులపై అశోక్ ఎలా పగ తీర్చుకున్నాడు. చివరకు ఆయన మంత్రిగా ఎలా మారాడన్నది ఈ సినిమా కథ.

  రెండు విభిన్నమైన పాత్రల్లో

  రెండు విభిన్నమైన పాత్రల్లో

  దేవరకొండ గాంధీగా, అశోక్ చక్రవర్తిగా విజయ్ ఆంటోని రెండు విభిన్న పాత్రలను తనదైన శైలిలో పోషించాడు. మూస పాత్రలకు పరిమితం కాకుండా డిఫరెంట్ పాత్రలను ఎంపిక చేసుకోవడంలో విజయ్ ఆంటోని స్టైల్ బాగుంది. మామూలు యువకుడిగా, రౌడీగా, వ్యాపారిగా, రాజకీయ నేతగా పలు షేడ్లు ఉన్న పాత్రను ఆయన పోషించి ఆకట్టుకున్నారు. తొలి చిత్రంతో పోల్చుకుంటే యమన్‌గా విజయ్ ఆంటోని రాటుదేలాడు. సక్సెస్, ఫెయిల్యూర్‌ను పక్కన పెడితే యమన్ చిత్రంలో ఆంటోని చక్కని నటన ప్రతిభను కనబరిచాడు. ఫైట్స్, డ్యాన్స్‌ల్లోనూ ఆకట్టుకొన్నాడు.

  సినీ నటిగా గ్లామరస్‌గా మియా జార్జ్

  సినీ నటిగా గ్లామరస్‌గా మియా జార్జ్

  విజయ్ ఆంటోని (అశోక్ చక్రవర్తి)కి జంటగా మియా జార్జ్ నటించింది. ఈ చిత్రంలో మియా సినీ నటిగా కనిపిస్తుంది. ఆమె నటించిన కొన్ని సన్నివేశాలు కథకు బలాన్ని చేకూరుస్తాయి. తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించింది. గ్లామర్‌తో ఆకట్టుకొన్నది.

  సాఫ్ట్ విలన్‌గా మరోసారి త్యాగరాజన్

  సాఫ్ట్ విలన్‌గా మరోసారి త్యాగరాజన్

  సీనియర్ నటుడు త్యాగరాజన్ చాలా రోజుల తర్వాత విలన్ ఛాయలు ఉన్న మాజీ ఎమ్మెల్యే కరుణాకరన్ పాత్రలో కనిపించారు. ఆయనకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. చాలా కాలంగా వెండితెరకు దూరమైన ఆయనకు సాఫ్ట్ విలన్ పాత్ర మంచి గుర్తింపు తెస్తుంది.

  దర్శకుడు జీవ శంకర్ పనితీరు..

  దర్శకుడు జీవ శంకర్ పనితీరు..

  దర్శకుడు జీవా శంకర్ స్టోరి లైన్ బాగున్నది. కానీ స్టోరికి తగినట్టుగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, భావోద్వేగ సన్నివేశాల కొరత కనిపిస్తుంటుంది. స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగడం వల్ల చిత్రంపై ప్రేక్షకుడి పట్టు కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. మాటలు అక్కడక్కడ పేలాయి. తమిళనాడులో రాజకీయ పరిస్థితులు చాలా వేడి మీద ఉన్న సమయంలో ఈ సినిమాను దర్శకుడు రూపొందించడం సమోచితంగా కనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా అసందర్భోచితంగానే అనిపిస్తుంది.

  యమన్ ఎలా ఉందంటే..

  యమన్ ఎలా ఉందంటే..

  సినిమా మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉంటుంది. చాలా సీరియస్‌గా సాగుతుంది. త్యాగరాజన్ తప్ప మిగితా పాత్రల్లో నటించిన వారెవరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోవడంతో సినిమాపై కొంత ఆసక్తి తగ్గుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ లేకుండా సినిమా మొత్తం చాలా సీరియస్‌గా సాగడం యమన్‌కు ఉన్న నెగిటివ్ పాయింట్లలో ఒకటి. పాటలు సందర్భోచితంగా ఉన్నప్పటికి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, తెలుగు నేటివిటికి దగ్గరగా లేకపోవడం ప్రతికూల అంశాలు. ఈ చిత్రానికి మరో ప్రతికూలత ఏమిటంటే నిడివి. సెకండాఫ్‌లో నిడివి పెరిగిపోవడం ప్రేక్షకుడికి కొంత చిరాకు పుట్టించే విధంగా ఉంటుంది. వినోదభరిత చిత్రాలను, ఫ్యామిలీ కథ చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. విజయ్ ఆంటోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. కెమెరా పనితీరు బాగున్నది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

  చివరి మాట.

  చివరి మాట.

  మహాశివరాత్రి, లాంగ్ వీకెండ్ ఉన్న నేపథ్యంలో అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ భారీ చిత్రాలు లేని సమయంలో యమన్ విడుదల కావడంతో సానుకూల అంశం. బిచ్చగాడు చిత్ర ప్రభావంతో రెగ్యులర్ ఆడియెన్స్ చూడటానికి అవకాశం ఉంది. బిచ్చగాడు చిత్రం మాదిరిగా ఈ సినిమా అన్నివర్గాలను ఆకట్టుకోవడం చాలా కష్టమే.

  ప్లస్‌ పాయింట్స్‌:
  - ఫస్టాఫ్
  - క్లైమాక్స్‌

  మైనస్‌ పాయింట్స్‌:
  - స్క్రీన్ ప్లే
  - పాటలు

  బ్యానర్: ద్వారకా క్రియేషన్స్, లైకా ప్రొడక్షన్
  నటీనటులు: విజయ్ ఆంటోని, మియా జార్జ్, త్యాగరాజన్ తదితరులు
  ఎడిటింగ్: వీర సెంథిల్ రాజ్
  మాటలు: భాష్యశ్రీ
  నిర్మాతలు: మిర్యాల రవీందర్ రెడ్డి, లైకా ప్రొడక్షన్స్
  కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జీవా శంకర్

  English summary
  Vijay Antony's latest movie Yaman. This movie released on February 24th on Occassion of Mahashivaratri. This cinema is tailor made one in the political thriller ‘Yaman’ directed by Jeeva Shankar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X