twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేక్షకులు (శ్రీ) హరీ!

    By Staff
    |

    Vijayaramaraju
    చిత్రం: విజయరామరాజు
    నటీనటులు: శ్రీహరి, ఊర్వశి, రంగనాథ్‌, జయప్రకాష్‌ రెడ్డి
    సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌
    దర్శకత్వం: వీర్‌ శంకర్‌

    విలన్‌ నుంచి హీరోకి ఎదిగిన శ్రీహరిలో ఇంకా ఆ ఛాయలు అలానే మిగిలాయనిపిస్తుంది- విజయరామరాజు చిత్రం చూస్తే. గుక్కతిప్పకుండా వల్లించే భారీ డైలాగులు, మేనరిజమ్స్‌ అన్నీ విలన్‌ పాత్రను పోషిస్తున్నట్లుగానే ఉన్నాయి.పోలీసాఫీసర్‌ పాత్రకు, గుండా పాత్రకు తేడా లేకుండా నటించే శ్రీహరి 'యాక్షన్‌' మాస్‌ ప్రేక్షకులకు నచ్చుతుండొచ్చు. దేశం కోసం ప్రాణమిచ్చే ఒక పోలీసు ఆఫీసర్‌....పాకిస్థాన్‌ ఏజెంట్లు.....మధ్యలో అవరోధాలు...ఇలాంటి కథలు మనం ఎన్నోసార్లు చూశాం. అలాంటి కథనే తీసుకొని తీసిన ఈ చిత్రం ఇది.

    మాతృభూమి కోసం తన ప్రాణాలనర్పిస్తానని ప్రతిజ్ఞ చేసిన పోలీస్‌ ఆఫీసర్‌ దుండుగుల, అరాచక శక్తల ఆటలు కట్టిస్తాడు. భరతమాతకు హాని కల్గిస్తున్న వారిని ఏరిపారేస్తుంటాడు. ఈ మహా యజ్ఞంలో భార్యను, పిల్లలను సైతం కోల్పోతాడు. అయినా చలించని శ్రీహరి తన ప్రాణాన్ని దేశానికి అంకితం ఇస్తూ పోరాడుతుంటాడు. కానీ విధి వక్రించి శ్రీహరి నమ్మక ద్రోహం కేసులో జైలు పాలవుతాడు. జైల్లో ఉన్నంత మాత్రానా దేశం కోసం పోరాడుకుండా ఖాళీగా కూర్చోవడం ఎందుకని అక్కడ కూడా జైల్లో ఉన్న పాకిస్థాన్‌ ఏజెంట్ల భరతం పడుతుంటాడు.

    ఇదే సమయంలో కొంతమంది పాక్‌ ఏజెంట్‌ లు ఓ ట్రెయిన్‌ ను హైజాక్‌ చేస్తారు. ఐఎస్‌ఐ నాయకుణ్ణి విడిపించాలని హైజాకర్లు షరతు విధిస్తారు. హైజాకర్లును మట్టుపట్టి, బందీలను విడిపిస్తానని, కాబట్టి తనను విడిపించమని జైల్లో ఉన్న శ్రీహరి కోరుతాడు. భారీ ఫైట్లు చేసి బందీలను విడిపిస్తాడు. ఈ ఘటనలో అతని కాళ్ళు పోతాయి. ఆ తర్వాత భారత ప్రభుత్వం అతని సేవలకు గాను భారత రత్నను ప్రదానం చేస్తుంది.

    భారీ డైలాగ్స్‌ అంతా తానై నటించిన శ్రీహరి నటన గురించి చెప్పడం అనవసరం. ఇక మిగతా నటీనటుల పాత్ర స్వల్పం. పోసాని కృష్ణమురళి 'విశ్వరూపం' ప్రదర్శించాడు. వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతం ఎవరికీ అర్థం కానీ రీతిలో సాగింది. ఇక డైరక్టర్‌ వీర్‌ శంకర్‌ ప్రతిభ ఎక్కడా కనపడదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X