»   » నటనకు 'నాన్న'(రివ్యూ)

నటనకు 'నాన్న'(రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

-జోశ్యుల సూర్య ప్రకాష్
నటీనటులు: విక్రమ్, అనుష్క, నాజర్, సంతానం, అమలా పౌల్ తదితరులు
సంగీతం: జివి ప్రకాష్
ఛాయా గ్రహణం - నీరవ్ షా
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ ఎల్ విజయ్

సినిమా చూడాలా...సినిమాలో హీరో నటన చూడాలా అన్న సందేహం కమల్ హాసన్, విక్రమ్ సినిమాలకు కలగటం సర్వసాధారణమైపోయింది. తాజాగా వచ్చిన "నాన్న" చిత్రం కూడా విక్రమ్ అద్బుతమైన నటనతో ప్రేక్షకులను అదే డైలమోలో పడేస్తోంది. అయితే జనం కేవలం నటన కోసమే సినిమాకు రారు కదా అని అడిగితే సినిమాలో కథ కూడా బాగానే ఉంది. కాకపోతే అది కమర్షియల్ పరిధికి లొంగనిది. హాలీవుడ్ 'ఐయామ్ శామ్' ప్రేరణతో వచ్చిన ఈ చిత్రం ఆ సినిమాలోని సెంట్రల్ పాయింటుని తీసుకుని సొంత స్క్రీన్ ప్లే, సీన్లతో అల్లుకుని తయారు చేసారు. అయితే ఫస్టాఫ్ విక్రమ్ కి, సెకెండాఫ్ అనుష్కకి అన్నట్లు విభజన చేసి కథనం నడపటమే బాగోలేదు.

కృష్ణ(విక్రమ్)మానసికంగా ఐదేళ్ల వయస్సులోనే ఆగిపోయిన వ్యక్తి. ఊటిలో ఉండే అతనికి భార్య పురిటిలోనే చనిపోయి కూతురు వెన్నెల(సారా)మిగులుతుంది. అప్పటినుంచీ కూతురే లోకంగా బ్రతికిన అతనికి అనుకోని ట్విస్టు అతని మామగారి(సచిన్)నుంచి ఎదురువుతుంది. తన కూతురు ప్రేమించి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందనుకున్న ఆయనకి ఆమె ఓ కూతురుని కని మరణించిందని తెలిసి సీన్ లోకి వస్తాడు. మానసికంగా ఎదగని తన అల్లుడు దగ్గర తన మనవరాలు పెరగటం కష్టమని తీసుకుని వెళ్ళిపోతాడు.అక్కడనుంచి కృష్ణ లాయర్ అనూరాధ(అనుష్క)ని పట్టుకుని పోరాటం ప్రారంభిస్తాడు. అటు కోటీశ్వరుడు సంఘంలో పలుకుబడి గల మామ, ఇటు అప్పుడే ప్రాక్టీసు పెట్టిన లాయర్ ని పట్టుకుని కృష్ణ కోర్టు గుమ్మం ఎక్కుతారు.ఎవరు గెలుస్తారు. చివరకు తండ్రీ కూతుళ్ళ బంధం కోర్టు గుర్తించిందా అన్నది తెలియాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

నిజానికి పైన చెప్పుకున్న కథ మొత్తం 'ఐయామ్ సామ్' సినిమాలో ఉన్నదే.అయితే మరి ఈ డైరక్టర్ ఏమి చేసాడూ అంటే పాపకీ, ఆమె తండ్రికీ రిలేషన్ బాగా ఎస్టాబ్లిష్ చేసాడు. అయితే అందుకోసం ఫస్టాఫ్ మొత్తం వాడి కొంత లాగినట్లు అనిపించాడుకోండి. ఇక సెకెండాఫ్ లో అనుభవం లేని లాయిర్ అనుష్క ఎలా సీనియర్ లాయర్ నాజర్ పై కేసు గెలిచింది. ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేసిందన్న కథనంతో నడించింది. దాంతో సెకెంఢాప్ లో విక్రమ్ కీ, పాపకీ మధ్య సీన్స్ లేకుండా పోయాయి. ఎంతసేపూ కోర్టూ, ఎత్తుకు పై ఎత్తులు అన్నట్లే నడిచింది.

కథ ప్లో పరంగా అది కరక్టేనేమో గానీ చూసేవారికి మాత్రం విక్రమ్ ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తూ కూర్చోవటం కష్టమనిపిస్తుంది. అలాగే అన్నిటికన్నా ముఖ్యం మానసిక వికలాంగుడైన కృష్ణ తో ఓ అమ్మాయి ప్రేమలో పడి పాపని కందో అర్దం కాదు. అదే ఒరిజనల్ సినిమాలో..ఓ గర్బవతైన అమ్మాయి హీరో దగ్గరకి వచ్చి బిడ్డను కని చనిపోతుంది. తన రక్తం పంచుకుపుట్టిన కూతురు కాకపోయినా ఆ చిన్నారితో అనుబందం పెంచుకుని పోరాడతాడు. దాన్ని కావాలని మిస్ చేసారో..మరిదేనికో కాని పెద్ద లోపంలా అనిపిస్తుంది.

ఇక హైలెట్స్ లో విక్రమ్ మెయిన్ అనిచెప్పాలి. విక్రమ్ కేవలం తన నటనను చూపించుకోవటానకే ఈ పాత్రను చేసాడనిపిస్తుంది. అనుష్క కూడా గ్లామర్ కు దూరంగా నటించి శభాష్ అనిపించుకుంటుంది. కమిడెయిన్ సంతానం నవ్విస్తాడు..కొన్ని చోట్ల ఎమోషన్స్ రైజ్ చేస్తాడు. ఇక స్క్రిప్టులో అనుష్కకి ఆమె తండ్రికి సరైన రిలేషన్స్ ఉండవు. అతను తన కూతురు క్లైయింటైన విక్రమ్ కి, అతని చిన్నారి పాపకి మద్య రిలేషన్ చూసి రియలైజ్ అవటం మంచి ఎలెమెంట్. ఇక పాటల్లో చెప్పుకోదగినవి లేవు.ప్రోమోస్ లో వేస్తున్న విక్రమ్ కథ చెప్పే పాటలో గ్రాఫిక్స్ బాగున్నాయి.

దర్శకుడుగా ఇలాంటి చిత్రం డీల్ చేయటం కష్టమైనా విక్రమ్ వంటి నటుడు చేతిలో ఉన్నప్పుడు ఆలోచించేదేముందన్నట్లు చేసినట్లున్నాడు. పాప చేత చెప్పించిన డైలాగులు ఆకట్టుకున్నాయి. కెమారా వర్క్ చాలా బాగుంది. అలాగే ఎడిటింగ్ కూడా చాలా చోట్ల క్రిస్ప్ చేయించారు. సంగీతం నార్మల్ గా ఉంది.

ఇక విక్రమ్ నటనకోసమే తీసినట్లున్న ఈ చిత్రం కమర్షియల్ చిత్రం కాదని ఫిక్సై చూస్తే బాగుందనిపిస్తుంది. కేవలం విక్రమ్ నటన కోసమే వెళ్లి చూస్తే శభాష్ అనిపించబుద్దేస్తుంది. అలా కాకుండా మంచి మశాలా చిత్రం చూడాలనకుని వెళితే విరక్తి కలుగుతుంది. కాబట్టి మీరు ఎలాంటి సినిమా చూడాలనుకుంటున్నారో ముందే డిసైడ్ చేసుకుని ధియోటర్ కి వెళ్ళటం మేలు.

English summary
Nanna doesn't disappoint but for some slow-paced script at places. With engrossing performance by Vikram, backed by strong technical team.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu