»   » రజనీతో తొలి అడుగు...(విక్రమ సింహ రివ్యూ)

రజనీతో తొలి అడుగు...(విక్రమ సింహ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'విక్రమ సింహ' చిత్రం రానే వచ్చింది. తమిళంలో 'కొచ్చాడయాన్'గా తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులో విక్రమ సింహ పేరుతో అనువదించారు. రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన ఈచిత్రం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మోషన్ కాప్చర్ టెక్నాలజీ ఉపయోగించిన తెరకెక్కించిన తొలి చిత్రం. ఇది పూర్తి 3డి కాప్చర్డ్ యానిమేషన్ చిత్రం. ఈ సినిమా విశేషాలేమిటో చూద్దాం....

కథ విషయానికొస్తే...
కలింగపురం, కోట పట్టణం అనే రెండు రాజ్యాల మధ్య తరతరాలుగా శతృత్వం ఉంటుంది. కోట పట్టణం రాజ్యానికి రాజు ఉగ్ర సింహా(నాజర్), కలింగపురానికి రాజు రాజ మహేంద్రుడు(జాకీ ష్రాఫ్). కలింగపురానికి వీరుడు ధీరుడు అయిన రాణా అలియాస్ రణధీర(రజనీకాంత్) సర్వ సైన్యాధిపతి. రాణా నాయకత్వంలో కలింగపురం సేనలు శతృ దేశాలను ఓడిస్తాయి. కోట పట్టణంతో యుద్ధం సమయం వచ్చే సరికి ఉన్నట్టుండి రానా కలింగపురం నుండి కోటపట్టణం వైపుషిప్ట్ అవుతాడు. కోట పట్టణంలో సైన్యాధికారిగా నియమితుడవుతాడు. రాణా ఇక్కడికి వచ్చిందే కోటపట్టణం రాను ఉగ్రసింహను చంపడాని. రాణా ఇలా చేయడానికి కారణం అతని తండ్రి విక్రమ సింహ ఫ్లాష్ బ్యాక్......పూర్తి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మోషన్ కాప్చర్డ్ యానిమేషన్ చిత్రం కాబట్టి ఈ చిత్రంలో నటీనటుల నటనా ప్రదర్శన గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. యానిమేషన్ పాత్రలకు వాయిస్ బాగా ఇచ్చారు. ముఖ్యంగా రజినీకాంత్ పాత్రకు మనో వాయిస్ బాగా సెట్ అయింది. టెక్నాలజీ కొత్తదే కానీ....పాత్రల హావభావాలు సరిగా చూపించలేక పోయారు. హాలీవుడ్‌లో వచ్చిన అవతార్ లాంటి మోషన్ కాప్చర్డ్ యానిమేషన్ చిత్రాలతో పోలిస్తే మాత్రం చాలా నాసిరకంగా అనిపిస్తుంది.

టెక్నాలజీ అంశాలు

టెక్నాలజీ అంశాలు

టెక్నాలజీ విషయాలను, యనిమేషన్ అంశాలను పక్కన పెడితే....మొదటి భాగం స్టార్టింగులో కొంత భాగం తప్ప ఎక్కువ భాగం బోరింగ్‌గా నడుస్తుంది. రెండో భాగం కాస్త ఫర్వాలేదు.

రజనీ ఇంట్రడక్షన్

రజనీ ఇంట్రడక్షన్

రజనీకాంత్ ఇంట్రడక్షన్, యాక్షన్ సీన్లు బాగా చూపించారు. స్లోగా నడిచే సినిమాకు తోడు...మధ్యలో వచ్చే పాటలు కూడా విసుగు తెప్పిస్తాయి. డైలాగులు మాత్రం చాలా చోట్ల పేలాయి.

రెహమాన్ సంగీతం

రెహమాన్ సంగీతం

ఏఆర్ రెహమాన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగు ఇంకా బాగా చేస్తే బాగుండేది. రజనీకాంత్ ఇమేజ్‌కు తగిన విధంగా భారీ తారాగణాన్ని ఎంచుకున్నారు. భారీ తారాగణం, పరిచయమున్నయాక్టర్లు కాబట్టి సరికొత్త ఫీల్ వచ్చింది.

ఓవరాల్‌గా చెప్పాలంటే....

ఓవరాల్‌గా చెప్పాలంటే....

మన భారత దేశంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీ పరంగా చూస్తే.....120 కోట్లకు పైగా ఖర్చు చేసి ఇంత పెద్ద బడ్జెట్ తీయడం గొప్ప విషయమే. మన దేశంలో ఇలాంటి టెక్నాలజీకి ఇప్పటికైనా నాంది పడటం ఆహ్వానించదగిన విషయమే.

అంచనాలు లేకుండా వెళ్లండి

అంచనాలు లేకుండా వెళ్లండి

ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళితే ఫర్వాలేదనిపిస్తుంది. ఇలాంటి టెక్నాలజీని ప్రోత్సహించడానికైనా ఈ సినిమాకు వెళ్లొచ్చు. ఇది తొలి అడుగు కాబట్టి భవిష్యత్తులో టెక్నాలజీ పరంగా మరింత మార్పులు జరుగుతాయని ఆశించవచ్చు.

అదీ సంగతి

అదీ సంగతి

హాలీవుడ్లో ఇలాంటి టెక్నాలజీ మొదలైన పాతికేళ్లకు ‘అవతార్' లాంటి అద్భుతం వచ్చింది. హాలీవుడ్లో వచ్చిన తొలి మోషన్ కాప్చర్ సినిమాతో పోలిస్తే ‘విక్రమ సింహ' గొప్పగా తీసారనే చెప్పొచ్చు.

English summary
Four years after the release of his 2014 film Robo, Superstar Rajinikanth has made a grand comeback with his latest outing Vikramasimha, which is the dubbed version of his much-talked about film Kochadaiyaan. KS Ravikumar has written the story, while Rajini's daughter Soundarya directed the film, which has been produced by Eros International with a whopping budget of Rs 125 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu