twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాధారణ 'విలన్‌'

    By Staff
    |

    Villain
    -జలపతి గూడెల్లి
    చిత్రం: విలన్‌
    నటీనటులు: రాజశేఖర్‌, నేహాదూపియా, టులీప్‌ జోషి,
    శివకృష్ణ, నరేష్‌, తదితరులు
    సంగీతం: విద్యాసాగర్‌
    నిర్మాత: శింగనమల రమేష్‌
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: కె.ఎస్‌.రవికుమార్‌

    రాబిన్‌ హుడ్‌ తరహాలో ఘరానా వ్యక్తుల దగ్గర డబ్బు కొట్టేసి రాష్ట్రంలో ఉన్న వికలాంగుల సంక్షేమం కోసం ఖర్చుపెట్టే వ్యక్తి కథ ఇది. అంటే సమాజంలో ఉన్న చీడ పురుగులకు ఈ వ్యక్తి 'విలన్‌' అన్నమాట. ఈ పాయింట్‌ బాగానే ఉన్నా, చెప్పిన కథనంలో పెద్ద విశేషమేమీ లేదు. కేవలం హీరో అవటి వాడి పాత్రలో నటించి మార్కులు కొట్టేసేందుకు ఉపయోగపడేలా యోగీసేతు (ఇతను నటుడు కూడా) కథ రూపొందించాడు.

    తమిళ దర్శకుడు తన స్టైల్‌ లో కొద్దిగా మసాలాను జోడించి రూపొందించాడు. ప్రథమార్థం అంతా అతిగా అన్పిస్తుంది. కేవలం హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న పాయింట్‌ తెలిసేంతవరకు ఓ మోస్తారుగా సాగుతుంది ఈ చిత్రం. ఇక చివర్లో సినిమా ముగస్తుందనుకునే సమయంలో క్లైమాక్స్‌ లో సబ్‌ క్లైమాక్స్‌ పెట్టి సాగదీయడం మరీ అతి. రాజశేఖర్‌ వికలాంగుడి పాత్రలో బాగా చేశాడు అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ సినిమా ఉపయోగపడింది.

    శివ (రాజశేఖర్‌) ధనవంతుల వద్ద డబ్బు కొట్టేసి గాడ్‌ అనే ఒక సంస్థ ద్వారా అన్ని సేవా సంస్థలకు డబ్బు అందచేస్తుంటాడు. శివకు పవిత్ర(నేహ), నరేష్‌ తదితరులు సాయం చేస్తారు. మామూలు సమయంలో కండక్టర్‌ గా పనిచేసే శివ ప్రేమలో టులీప్‌ జోషి పడుతుంది. గాడ్‌ సంస్థ ఫాదర్‌ (రంగనాథ్‌)ను చంపేసి ఆ సంస్థకు వచ్చే విదేశీ నిధులను తీసుకోవాలని విలన్‌ (కొత్త నటుడు) ప్రయత్నిస్తాడు.

    ఇంతకీ ఈ విలన్‌ ఎవరో కాదు చిన్నప్పడు శివ సోదరుడు విష్ణు (రాజశేఖర్‌) ను అవిటి వాడిన చేసిన వ్యక్తే. ఈ విలన్‌ మరదలే టులీప్‌. సో..శివ తన అసలు కథ ఆమెకు చెప్తాడు. చివర్లో విలన్‌ అసలు స్వరూపం బయటపెట్టి తన సోదరుడిని ఎలా కాపాడుకుంటాడో క్లైమాక్స్‌.

    సెకాంఢాప్‌ లో చాలా సీన్లు తెలుగు సీరియల్స్‌ లో మాదిరిగా ఉంటాయి. విలన్‌ ను రాజశేఖర్‌ చిన్నప్పుడు రాయితో కొడుతాడు. అప్పుడు విలన్‌ వేసుకొన్న బ్యాండేజ్‌ సినిమా ఆసాంతం ఉంటుంది. అదీ మన మేకప్‌ వాళ్ళ ఘనత. ఇద్దరు హీరోయిన్లలో నేహా ధూపియా పాత్ర చిన్నది. ఆమె చీర కట్టుకుంటే చూడడం కష్టమే. మోడ్రన్‌ దుస్తుల్లోనే బాగుంది.

    టులీప్‌ జోషీ ఫర్వాలేదు. రాజశేఖర్‌ నటనలో చెప్పుకోదగ్గ విశేషమేమీ లేకున్నా అవిటి వాడి పాత్ర బాగా చేశాడు. హీరోయిన్‌ ను బెడ్‌ మీద కట్టేసి విలన్‌ రేప్‌ చేస్తుంటే వికలాంగుడైన హీరో చూస్తూ...చివర్లో కట్టలు తెంచుకొన్న ఆవేశంతో వచ్చి విలన్‌ ను చంపడం, వికలాంగుల మీద సానుభూతి చూపే సన్నివేశాల్లో వారిని చిత్రహింసలు పెట్టడం వంటివి ఏనాటికి మారవేమో! విద్యాసాగర్‌ సంగీతం ఫర్వాలేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X