For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  థ్రిల్లరే కానీ... ('వేటాడు వెంటాడు' రివ్యూ)

  By Srikanya
  |

  పందెం కోడి, భరణి వంటి చిత్రాలతో తెలుగులోనూ తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న తాజాగా 'వేటాడు వెంటాడు' అని ధియోటర్స్ లోకి దూకాడు. ఇటీవల తమిళంలో విడుదలైన 'సమర్' చిత్రానికి ఇది అనువాదం. క్రైం థ్రిల్లర్‌గా తమిళ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వసూళ్ల వేట సాగించిన చిత్రమిది. విశాల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం థ్రిల్లర్ గా, కమర్షియల్ ఎలిమెంట్స్ తో అలరిస్తుంది. అయితే ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండటం తో ఎక్కువ యాక్షన్ చిత్రాలు నచ్చే ప్రేక్షకులకు నచ్చే అవాకాసం ఉంది. అయితే ఈ చిత్రానికి తగినంత పబ్లిసిటీ కూడా ఇవ్వకపోవటం మైనస్ గా మారిందనే చెప్పాలి.

  శంకర్‌ (విశాల్) పారెస్ట్ ట్రెక్ గైడ్ గా ఊటీలో పనిచేస్తూంటాడు. ఆ సమయంలో రూప(సునయన)తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్యా మనస్పర్దలు వచ్చి బ్యాంకాక్ వెళ్లిపోతుంది. బ్యాంకాక్ వెళ్లిన ఆమె అపాలజీ లెటర్ పంపుతూ... బ్యాంకాక్ కి టిక్కెట్ పంపుతుంది. మొదటి సారిగా ఫారిన్ వెళ్ళుతూండటంతో తన కో పాసింజర్ మాయ(త్రిష) సహాయం తీసుకుంటాడు. మెల్లిగా వారిద్దరూ ప్రెండ్స్ అవుతారు. శంకర్ తన ప్రేమ గురించి ఆమె కు చెప్తాడు.

  బ్యానర్: ఎం.కె. ఎంటర్‌ప్రైస్, 5 కలర్స్ మల్టీమీడియా
  నటీనటులు: విశాల్, త్రిష, సునయన తదితరులు
  మాటలు: శశాంక్ వెన్నెలకంటి,
  సంగీతం: యువన్‌శంకర్‌ రాజా
  ఛాయాగ్రహణం: రిచ్చర్డ్. ఎమ్.నాధన్
  కథ, కథనం, దర్శకత్వం: తిరు.
  నిర్మాత: శ్రీనివాస్‌ దామెర
  విడుదల తేదీ: జనవరి 24, 2013

  బ్యాంకాక్ కి వెళ్లిన శంకర్ కి తాను చిక్కుల్లో ఇరుక్కున్నానని అర్దమవుతుంది. జాన్(జెడి చక్రవర్తి), అరుణాచలం(మనోజ్ బాజిపాయ్)ల వల్ల తన జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. ఆ ఒక్క దెబ్బ అతని జీవితాన్ని ఊబిలోకి నెట్టివేసింది. అందులో నుంచి అతను ఎలా బయటపడ్డాడు? ఆ కుట్ర వెనక ఉన్నది ఎవరు? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.

  దర్శకుడు తిరు.. స్క్రీన్ ప్లే... ఈ సినిమాకు ప్రాణం. ఎన్నో మలుపులతో ఊహించని విధంగా సాగుతూ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. ఫస్టాఫ్ మొత్తం బ్రిలియంట్ గా ఉంటే... సెకండాఫ్... కూడా చాలా తెలివిగా నేరేట్ చేసారు. కథలో ఎన్నో మలుపులు ఉన్నా ఆడియన్స్ ని ఏ విధంగానూ కన్ఫూజ్ చేయకుండా దర్శకుడు సినిమాని ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా రన్ చేసాడు.

  విశాల్ ఈ చిత్రంలో చాలా మెచ్యూర్డ్ ఫెరఫార్మన్స్ ని ఇచ్చాడు. అతని బాడి లాంగ్వేజ్, అతని ఎక్సప్రెషన్స్, ఫైట్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. త్రిషతో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.

  ఈ సినిమా త్రిషకు మళ్లీ బ్రేక్ ఇస్తుందనే చెప్పాలి. సునయన తన పాత్రకు తగినట్లుగా చక్కగా చేసుకుంటూ పోయింది.

  జెడీ చక్రవర్తి, మనోజ్ వాజపేయ్ ఇద్దరూ కూడా ఎప్పటిలాగే సినిమాకు కీలకమై నిలచారు.

  రిచ్చర్డ్. ఎమ్.నాధన్ కెమెరా వర్క్ ఈ చిత్రంలో హైలెట్.. ఫారెస్ట్ సీన్స్ చాలా నీట్ గా కెమెరాలో బంధించాడు. డైలాగులు చాలా బాగున్నాయి.

  యవన్ శంకర్ రాజా ట్యూన్స్ సినిమాకు ప్లస్ గా నిలిచాయి. ధరిణి కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో ఇంటెన్సిటీ పెంచటానికి ఉపకరించింది.

  ఏదైమైనా వేటాడు వెంటాడు చిత్రం పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పాలి.. యాక్షన్ చిత్రాభిమానులు ఈ చిత్రం బాగా నచ్చుతుంది.

  English summary
  Vetadu Ventadu, which is the dubbed version of Vishal-Trisha starrer Tamil movie Samar, has hit the marquee today. With intelligently structured plot, director Thiru brings in a brand new experience for Telugu viewers. Vishal and Trisha will rock you with their action and glamour.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X