»   »  సో...సో గా... ( 'దూసుకెళ్తా' రివ్యూ)

సో...సో గా... ( 'దూసుకెళ్తా' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Rating:
  2.0/5
  ---సూర్య ప్రకాష్ జోశ్యుల

  గతంలో బ్రహ్మానందం, మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన ఢీ మంచి హిట్ . కాబట్టి మళ్లీ వాళ్లద్దరని పెట్టి సినిమా తీసాం అదే రేంజిలో విజయం సాధిస్తుంది అనే నమ్మకం కలిగిస్తూ వచ్చిన చిత్రం 'దూసుకెళ్తా' . ప్రోమోలతో మంచి ఎక్సపెక్టేషన్స్ రేపుతూ వచ్చిన ఈ చిత్రం ఆ రేంజిలో లేదనే చెప్పాలి. సూపర్ హిట్ చిత్రం రెడీ, ఇదే దర్శకుడు తీసిన బిందాస్ తరహాలో హీరో.... విలన్స్ ఫ్యామిలీలో మార్పు తేవటం అనే కథని...దాదాపు అదే సీన్స్ తో మళ్ళీ చెప్తూ ఈ చిత్రం వచ్చింది. కథ పాతదయినా, కథనం కొత్తగా ...టైట్ స్క్రీన్ ప్లే తో చెప్పి ఉంటే మరింత బాగుండేది. అప్పటికీ మంచు విష్ణు ప్రతీ ప్రేమ్ లోనూ మంచి ఎనర్జీతో దూసుకెళ్ళే ప్రయత్నం చేసాడు. స్క్రిప్టు సహకరించి ఉంటే నిజంగానే టైటిల్ జస్టిఫికేషన్ జరిగేది. బ్రహ్మానందం,వెన్నెల కిషోర్ కూడా నవ్వించి సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసారు.

  రవితేజ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ఈ చిత్రం లో చిన్నా(మంచు విష్ణు) ఓ టీవీ ఛానెల్ లో జర్నలిస్ట్ గా పనిచేస్తూంటాడు. మినిస్టర్ పై ఓ స్టింగ్ ఆపరేషన్ చేసి వస్తూంటే అతన్ని గూండాలు వెంటబడి కొట్టి పోతారు. అలా పడిపోయిన అతన్ని డాక్టర్ అలేఖ్య(లావణ్య త్రిపాఠి) రక్షించి హాస్పటల్ లో ట్రీట్ మెంట్ చేయిస్తుంది. ఏ చిన్న హెల్ప్ చేసినా చిన్నా మర్పిపోడు అనే క్యారెక్టరైజేషన్ తో ఉన్న చిన్నా ఆమెతో తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. అంతేకాదు...తనకు సాయిం చేసిన ఆమెకు ఏదైనా సాయిం చేయాలనుకుంటాడు. ఈ లోగా ఆమెను కొంతమంది చంపటానికి వెంటాడుతున్నారని తెలుస్తుంది. వారి నుంచి ఆమెను రక్షించే ప్రాసెస్ లో అతనికి మరిన్ని నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలేంటి...ఆమెను ఎవరు...ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది మిగతా కథ.

  ప్రస్తుతం బ్రహ్మానందం ఉంటే సినిమాలు హిట్ అన్నది భాక్సాఫీస్ ఫార్ములా ప్రస్తుతం నడుస్తోంది. దాంతో కథలో కలిసినా, కలవకపోయినా పనిగట్టుకుని మరీ బ్రహ్మానందం ని ఇరికిస్తున్నారు. ఇప్పుడు చాలా తెలుగు సినిమాలు అదే పరిస్దితిని ఎదుర్కొంటున్నాయి. తెలుగు సినిమాకు హిట్ ఫార్మలాగా ఇంకా చెప్పాలంటే సెకండ్ హీరోలా మారిన బ్రహ్మానందం ని అడ్డం పెట్టుకుని కథని చెప్పి, గెలవాలనుకుంటున్నారు. అదే పరిస్ధితి 'దూసుకెళ్తా' లోనూ కనిపిస్తోంది.

  సూపర్ హిట్ చిత్రం రెడీ తరహా కనువిప్పు కథని...మరో సారి దర్శకుడు చెప్పాలని ప్రయత్నం చేసారు. అయితే కథని సెటప్ చేయటానికే ఫస్టాఫ్ మొత్తం సమయం తీసుకుని, కథలోకి వెళ్లటమే దాదాపు సెకండాఫ్ సంగంలోకి కానీ వెళ్లకుండా బాగా లేట్ చేసారు. దాంతో అనవసరమైన సీన్స్ పెరిగిపోయి, లెంగ్త్ ఎక్కువైపోయి...ఉన్న విషయం కూడా పెద్దగా హైలెట్ కానీ పరిస్ధితి ఏర్పడింది. దానికి తోడు కథకి సంభందం ఉన్నా లేకపోయినా కామెడీ కోసం అని పాత్రలను తీసుకు వచ్చి కలుపుకుంటూ వెళ్లిపోయాడు. అయితే కలిసినా,కలవకపోయినా బ్రహ్మానందం ,వెన్నెల కిషోర్ సీన్స్ మాత్రమే సినిమాకు సేవింగ్ ఎలిమెంట్ అని చెప్పాలి.

  మిగతా రివ్యూ స్లైడ్ షోలో....

  మంచు విష్ణు ....

  మంచు విష్ణు ....

  జర్నలిస్టు గా మంచు విష్ణు పాత్రని ఎస్టాబ్లిష్ చేయటం కేవలం హీరో ఇంట్రడక్షన్ సీన్ (ఢీ సినిమా ఇంట్రడక్షన్ సీన్ ని గుర్తుకు తెస్తుంది) లో వచ్చే ఫైట్స్ కోసం, ఎలాగో జర్నలిస్టు గా పెట్టాం కాబట్టి విలన్స్ తో లింక్ కోసమే అన్నట్లు సాగింది తప్ప ఆ పాత్ర కథని కొంచెం కూడా కదల్చలేకపోయింది. అయితే మంచు విష్ణు మాత్రం స్టైలిష్ గా ఉన్నాడు. కామెడీ టైమింగ్ కూడా బాగుంది.

  లావణ్య త్రిపాఠి

  లావణ్య త్రిపాఠి

  అందాల రాక్షసి చిత్రంతో పరిచయమైన లావణ్య ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. అయితే కమర్షియల్ తెలుగు సినిమా హీరోయిన్ గా మాత్రం ఆమె అలరించలేకపోయి..తేలిపోయింది. డాక్టర్ గా ఆమె బాగా నటించినా హీరోయిన్ గా ఆమె లో ఎక్కడా ఆ పాత్రకు తగ్గ జోష్ కనపించదు.

  కామెడీ టీమ్

  కామెడీ టీమ్

  మొదటే చెప్పుకున్నట్లు ఈ సినిమాకు బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ కామెడీలే వెన్నుముక. దర్శకుడు ఈ విషయం గమనించే వీరిద్దరి పైనే బాగా కాన్సర్టేట్ చేసారు. అయితే బ్రహ్మానందం కామెడి ఫరవాలేదనిపించినా, వెన్నెల కిషోర్ మాత్రం ఉన్నది కాస్సేపయినా బాగా చేసారు... అలీ మాత్రం పెద్దగా కామెడీ వర్కవుట్ కాలేదు. సినిమాకు ఆ పాత్ర పెద్దగా పట్టించుకునేలా ఉండదు.

  మంచు లక్ష్మి ప్రసన్న

  మంచు లక్ష్మి ప్రసన్న

  గెస్ట్ అప్పీరియన్స్ అంటూ మంచు లక్ష్మి అంటూ ఈ చిత్రంలో కనిపించే ది కొద్ది క్షణాలే. అదీ హీరో పాత్ర పాటకు లీడ్ తీసుకోవటానికి మాత్రమే ఆమెను ఉపయోగించుకున్నారు...తప్ప ఆమెకు ఈ సినిమా కథలో ఏ విధమైన ప్రాధాన్యత లేదు.

  ఫైట్స్,పాటలు

  ఫైట్స్,పాటలు

  సినిమాలో ఫైట్స్,పాటలుకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ టెక్నీషియన్స్ కూడా మంచి అవుట్ పుట్ ఇచ్చారు. పాటల్లో మంచు విష్ణు తన తోటి హీరోలతో సమానంగా నర్తించారు. ఫైట్స్ కూడా మాస్ కు నచ్చేలా చేసారు. ప్రేమ రక్షిత్,గణేష్ ఆచార్య సమకూర్చిన డాన్స్ మూవ్ మెంట్స్ కూడా బాగున్నాయి.


  6

  పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్

  పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్

  మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలో రెండు పాటలు బాగున్నాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ చాలా బాగుంది. అలాగే ఆయన ఎప్పటిలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టారు.

  యాక్షన్ సీక్వెన్స్....

  యాక్షన్ సీక్వెన్స్....

  ధాయల్యాండ్ యాక్షన్ డైరక్టర్ కిచ్చా అందించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాలో బాగా వచ్చాయి. క్లైమాక్స్ లోనూ, ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఫైట్ సీన్, ఇంట్రడక్షన్ సీన్ శ్రద్ద పెట్టి చేసారు.

  ఛాయాగ్రహణం....

  ఛాయాగ్రహణం....

  సర్వేష్ మురారి ఛాయాగ్రహణం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అని చెప్పాలి. హీరోని చాలా గ్లామర్ గా చూపెట్టడం, లొకేషన్స్ ని బాగా ఎలివేట్ చేసి,అందంగా చూపించి ప్రతీ ఫ్రేమ్ రిచ్ గా ఉండేలా చూపించారు.

   టెక్నికల్ గా..

  టెక్నికల్ గా..

  ఎడిటింగ్ మాత్రం మరింత షార్ప్ గా చెయ్యాల్సింది. మరీ లెంగ్త్ ఎక్కువై,చాలా చోట్ల సాగుతున్న ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్ లో బాగా స్పీడ్ తగ్గింది. కథకి సంభందించిన సీన్స్ కు మాత్రమే ప్రయారిటీ ఇచ్చేలా ఎడిటింగ్ చెయ్యాల్సింది.

  రచయితగా, దర్శకుడుగా....

  రచయితగా, దర్శకుడుగా....

  రచయితగా సూపర్ హిట్స్ అందించిన వీరుపోట్ల ఎందుకనో తన చిత్రాలకు మాత్రం ఆ రేంజి కథ,స్క్రీన్ ప్లే లను తయారుచేసుకోలేకపోతున్నారు. ఈ సినిమా డ్రాబ్యాక్స్ లో స్క్రిప్టు మొదటి వరసలో ఉంటుంది. అయితే డైలాగ్స్ మాత్రం బాగా పండాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ ట్రాక్ మాత్రం చాలా బాగా చేసారు. దర్శకుడుగా అద్బుతం కాదుకానీ ఓకే అనిపించుకున్నారు. రగడలో ఉన్న డైరక్షన్ స్కిల్స్ ఈ చిత్రంలో కనపడలేదు.

  ఎవరెవరు...

  ఎవరెవరు...

  బ్యానర్‌: 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ
  నటీనటులు:మంచు విష్ణు వర్ధన్, లావణ్య త్రిపాఠి, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, పంకజ్ త్రిపాఠి, పోసాని, రఘుబాబు, భరత్, అన్నపూర్ణమ్మ, రజిత, సురేఖావాణి, హేమ తదితరులు
  ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి,
  కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌,
  సమర్పణ: ఆరియానా, వివియానా.
  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:ఆర్.విజయకుమార్
  నిర్మాత : మంచు మోహన్‌బాబు
  కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వీరూ పోట్ల


  ఫైనల్ గా ఈ చిత్రం బ్రహ్మానందం,వెన్నెల కిషోర్ కామెడీ కోసం చూడాలి. ట్రైలర్స్ చూసి ఏదో కొత్త కథో లేక హిలేరియస్ ఎంటర్టైనర్ చూడబోతున్నాం అని ఫిక్సవకుండా వెళితే ఓకే అనిపిస్తుంది.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Following the huge success of the comedy entertainer Denikaina Ready, Telugu actor Vishnu Manchu has once again chosen same genre for his next outing Doosukeltha, which has hit the screens today. Veeru Potla has chosen a tried and test story for Doosukeltha, but has laced it with all commercial ingredients.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more