For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vitamin She మూవీ రివ్యూ

  |

  నటీనటులు: శ్రీకాంత్ గుర్రం, ప్రాచీ టక్కర్, రంజిత్ రెడ్డి, వికాస్ పొన్నూరు తదితరులు
  సినిమాటోగ్రఫి: శివ శంకర వర ప్రసాద్
  ఎడిటింగ్: నాని లుక్క
  మ్యూజిక్: పీవీఆర్ రాజా
  నిర్మాత: రవి పొలిశెట్టి
  రచన, దర్వకత్వం: జయశంకర్
  రిలీజ్: MX Player
  రిలీజ్ డేట్: 2020-12-12

   విటమిన్ షి కథ

  విటమిన్ షి కథ

  లియో అలియాస్ లింగబాబు యోగానంద (శ్రీకాంత్ గుర్రం) సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్. ఓ చేతిలో ఫోన్.. మరో చేతిలో కాఫీ కప్పు తప్ప కెరీర్ అంటే ఏ మాత్రం పట్టని యువకుడు. మొబైల్ ప్రపంచంలోనే బతికే లియోకు కొన్ని పరిస్థితుల్లో విటమిన్ షి అనే అల్ట్రా మోడరన్ ఫోన్ చేతికి వస్తుంది. ఈ క్రమంలో తన ఆఫీస్‌లో సహ ఉద్యోగి వైదేహీ (ప్రాచీ టక్కర్)పై మనసు పారేసుకొంటారు. వైదేహీ జీవితంలో చోటుచేసుకొన్న ఓ షాకింగ్ సంఘటన లియోను ఆవేదనకు గురిచేస్తుంది.

   విటమిన్ షీ కథలో ట్విస్టులు

  విటమిన్ షీ కథలో ట్విస్టులు

  విటమిన్ షి అనే మొబైల్ వల్ల లియో జీవితం ఎలాంటి ఒడిదుడుకులకు గురైంది? ఆధునిక జీవితంలో లియోను ఎలా ముప్పు తిప్పలు పెట్టింది? మొబైల్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ మనిషి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? తాను ప్రేమించిన వైదేహీ జీవితంలో చోటు చేసుకొన్న సంఘటన ఏమిటి? వైదేహీతో ప్రేమ వ్యవహారం చివరకు ఎలాంటి క్లైమాక్స్‌ దారి తీసింది? వైదేహీతో ప్రేమను పెళ్లిగా మార్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే విటమిన్ షి మూవీ కథ.

  దర్శకుడు జయశంకర్ ప్రతిభ

  దర్శకుడు జయశంకర్ ప్రతిభ

  సంపత్ నంది నిర్మాతగా రూపొందిన పేపర్ బాయ్ చిత్ర దర్శకుడు జయశంకర్ విటమిన్ షి మూవీని తెరకెక్కించారు. లాక్‌డౌన్‌లో తన స్నేహితులను, రచయితలను ఆదుకొనే క్రమంలో సినిమాను మొదలుపెట్టారు. పరిమితమైన బడ్జెట్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజిన్స్‌కు మానవ భావోద్వేగాలు జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సున్నితమైన ప్రేమ కథకు టెక్నాలజీని జోడించిన తీరు ప్రశంసనీయం. కరోనావైరస్ చేతుల వరకు ఉంటే శానిటైజర్స్‌తో కడుక్కోవచ్చు. గొంతులోకి దిగితేనే కష్టం. ప్రేమ కూడా గుండెలోకి దిగనంత వరకు ఓకే అంటూ జయశంకర్ రాసిన డైలాగ్స్ ఆకట్టుకొంటాయి. కథ, కథనాలు కూడా ఫీల్‌గుడ్‌గా సాగుతాయి. కథ, కథనాల్లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. తన టేకింగ్‌తో కప్పిపుచ్చుకొన్నాడని చెప్పవచ్చు.

   నటీనటులు పెర్ఫార్మెన్స్

  నటీనటులు పెర్ఫార్మెన్స్

  ఇక లియోగా శ్రీకాంత్, వైదేహీగా ప్రాచీ టక్కర్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎక్కువగా సన్నివేశాలు శ్రీకాంత్‌పైనే ఉంటాయి. సినిమా భారాన్ని శ్రీకాంత్ చక్కగా తన భుజాలపై మోశాడని చెప్పవచ్చు. సినీ రంగానికి కొత్తవాడైనా చక్కటి పరిణతితో శ్రీకాంత్ ఆకట్టుకొన్నారు. ఇక ప్రాచీ టక్కర్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి రూపొందించిన పటాస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. విటమిన్ షి చిత్రంలో మ్యారేజ్ బ్రేకప్ అయిన యువతిగా పాత్ర వైదేహిగా చక్కగా నటించారు. సున్నిమైన సన్నివేశాల్లో మంచి ఎమోషన్స్ పలికించారు.

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు

  టెక్నికల్ విభాగాల విషయానికి వస్తే.. శివశంకర వరప్రసాద్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. పరిమితమైన లోకేషన్లలో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. లైటింగ్ బాగుంది. నాని లుక్కా ఎడిటింగ్ బాగుంది. కొన్ని సన్నివేశాల నిడివి తగ్గిస్తే బాగుండేదనిపిస్తుంది. పీవీఆర్ రాజా మ్యూజిక్ మరో స్పెషల్ ఎట్రాక్షన్‌గా చెప్పుకోవచ్చు. నిర్మాత రవి పొలిశెట్టికి సినిమాపై ఉన్న అభిరుచికి విటమిన్ షి సాక్ష్యంగా నిలిచిందని చెప్పవచ్చు. టెక్నాలజీ ఆధారిత సినిమాలు, సెన్సిబుల్ రొమాంటిక్ కామెడీ చిత్రాలను ఆదరించే వారికి విటమిన్ తప్పకుండా నచ్చుతుంది.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  మొబైల్ టెక్నాలజీలో వాయిస్ అసిస్టెంట్ల వల్ల కలిగే లాభాలు, కష్టాలు, నష్టాలు గురించి చెప్పే చిత్రం విటమిన్ షి. కరోనా కాలంలో మొబైల్ వాడకం 10 వేల రెట్లు పెరిగిందనే సర్వే ఫలితాల ఆధారంగా ఈచిత్రం రూపొందింది. కరోనావైరస్ అనేది ఓ కుట్ర.. పలు మల్టీ నేషనల్ కంపెనీలు తమ టెక్నాలజీ ఉత్పత్తులకు వినియోగదారులు చేరువ అయ్యే విధంగా కుట్ర పన్నారనే ఓ పరిశోధకుడి వ్యాసం ఆధారంగా చేసుకొని దర్శకుడు జయశంకర్ ఈ చిత్రాన్ని సున్నిత విమర్శలతో ప్రేక్షకుడికి అందించిన తీరు బాగుంది.

  English summary
  Vitamin She movie review: Paper Boy director Jayashankarr's latest movie is Vitamin She. Srikanth Gurram, Prachi Thaker in lead roles. Ravi Polishetty is producer for the movie. This movie released on MX player on 25th december.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X