twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓటర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Voter Movie Review And Rating || ఓటర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ || Filmibeat Telugu

    Rating:
    3.0/5
    Star Cast: మంచు విష్ణు, సురభి, సంపత్ రాజ్, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్
    Director: జీ కార్తీక్ రెడ్డి

    టాలీవుడ్‌లో మంచు విష్ణు హీరోగా రేసులో కాస్త వెనుకపడినట్టు కనిపిస్తున్నాడు. మళ్లీ తన సత్తాను నిరూపించుకొనేందుకు చేసిన ప్రయత్నం ఓటర్. సామాజిక అంశంతో రూపొందిన పొలిటికల్ సెటైర్ మూవీని దర్శకుడు జీ కార్తీక్ రెడ్డి రూపొందించగా, సుధీర్ పూదోట నిర్మించాడు. ఈ చిత్రాన్ని ప్రశాంత్ గౌడ్ సార్ధక్ బ్యానర్‌పై జూన్ 21 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. అయితే రిలీజ్‌కు ముందు ఓటర్ చిత్రం పలు వివాదాల్లో కూరుకుపోయింది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా మంచు విష్ణు‌ను మళ్లీ ట్రాక్‌లో పడేసిందా? నిర్మాతలకు లాభాలు పంచిందా అనే తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    ఓటర్ స్టోరీ

    ఓటర్ స్టోరీ

    దేశభక్తి, సామాజిక బాధ్యత తెలిసిన గౌతమ్ (మంచు విష్ణు) ఓ ఎన్నారై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇండియా వచ్చిన గౌతమ్ తొలిచూపులోనే భావన (సురభి) ప్రేమిస్తాడు. తన ప్రేమను గెలుచుకోవాలంటే సురభి కొన్ని షరతులు విధిస్తుంది. ఎమ్మెల్యే గొట్టం గోవిందం (పోసాని కృష్ణ మురళి) ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేస్తే ప్రేమిస్తానని చెబుతుంది. దాంతో గౌతమ్ రంగంలోకి దిగుతాడు. ఆ క్రమంలో పేదల భూమిని కబ్జా చేసిన మంత్రి శంకర్ ప్రసాద్‌ను రాజకీయంగా ఎదుర్కోవాల్సి వస్తుంది.

     ఓటర్ సినిమాలో మలుపులు

    ఓటర్ సినిమాలో మలుపులు

    ఎమ్మెల్యే గోవిందంతో హామీలు నెర్చేలా చేయడానికి గౌతమ్ ఎలాంటి పంథాను అనుసరించాడు. తన ప్రేయసి ప్రేమను గెలుచుకొన్నాడా? మంత్రి ఆక్రమించిన పేదల భూమితో గౌతమ్‌కు సంబంధమేమిటి? ఓటరుగా ప్రజల మద్దతును గౌతమ్ ఎలా కూడగట్టారు. మంత్రి శంకర్ ప్రసాద్‌ను ఎలా ఎదుర్కొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే ఓటర్ సినిమా కథ.

     ఫస్టాఫ్‌ అనాలిసిస్

    ఫస్టాఫ్‌ అనాలిసిస్

    ఎన్నారై హీరో మంచు విష్ణును కమర్షియల్ ఫార్మాట్‌లో పరిచయం చేయడం ద్వారా సినిమా సాదాసీదాగా మొదలవుతుంది. సురభితో ప్రేమలో పడిన తర్వాత సినిమా అసలు కథలోకి వెళ్తుంది. పొలిటికల్ టచ్, గ్లామర్‌ను బ్యాలెన్స్ చేస్తూ సినిమా సాగుతుంది. ఎమ్మెల్యేగా పోసాని వ్యవహారం కామెడీ టచ్‌తో సాగుతుంది. ఇక మంత్రిని ఎదురించడం ద్వారా స్టోరి సీరియస్ నోట్‌లోకి వెళ్తుంది. హీరో, విలన్ మధ్య సవాల్ ప్రతీ సవాల్‌తో తొలిభాగం ముగుస్తుంది. తొలి భాగంలో హీరో క్యారెక్టర్‌, ఇతర పాత్రలను ఎస్టాబ్లిష్‌ చేయడానికే ఎక్కువ సమయం తీసుకొన్నట్టు కనిపిస్తుంది. సురభి పెద్దగా గ్లామర్‌ను పండించలేదనే ఫీలింగ్ కలుగుతుంది.

     సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో

    ఓటర్ సినిమాకు సెకండాఫ్‌నే ప్రాణంగా నిలుస్తుంది. ప్రజాసేవ చేయని ఎమ్మెల్యే, ఎంపీలను వెనుకకు రప్పించే (రీకాల్) అంశాన్ని ఎత్తుకోవడం సినిమాకు ఆకర్షణగా మారుతుంది. సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని ప్రజలను చైతన్య పరిచే అంశం బాగా ఉంది. కాకపోతే రెగ్యులర్ ప్యాటర్న్‌లో దానిని చేయడం తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. కామన్ మ్యాన్, ఓటర్ మూడో కన్ను తెరిస్తే ఏమౌతుందో అనే అంశం సినిమాకు హైలెట్. రీకాల్ అంశాన్ని దర్శకుడు సూటిగా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు కానీ బలమైన సన్నివేశాలు రాసుకొంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశానికి ఛాన్స్ ఉండేది.

     మంచు విష్ణు, సురభి ఫెర్ఫార్మెన్స్

    మంచు విష్ణు, సురభి ఫెర్ఫార్మెన్స్

    మంచు విష్ణు నటనపరంగా గతంలో కంటే ప్రస్తుతం మెచ్యురిటీతో కనిపించాడు. డ్యాన్స్, ఫైట్స్ విషయంలో కొత్తగా చెప్పనక్కర్లేదు. సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్లలో ఆయన బాగా ఆకట్టుకొన్నాడు. గౌతమ్ పాత్రలో ఒదిగిపోయాడు. తన పాత్ర పరిధి మేరకు మరోసారి సత్తా చాటుకొనే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు. ఇక సురభి గ్లామర్ పాత్రకే పరిమితమైంది. కథలో సీరియస్ అంశాలు తెరపైకి రావడంతో గ్లామర్ పండించడానికి స్కోప్ లేకపోయింది.

     మిగితా క్యారెక్టర్లలో

    మిగితా క్యారెక్టర్లలో

    మిగితా క్యారెక్టర్లలో చెప్పుకోవాల్సింది పోసాని, సంపత్ రాజ్ క్యారెక్టర్లు. ఈ రెండు క్యారెక్టర్లు రొటీన్‌గానే కనిపిస్తాయి. కామెడీ టచ్‌ ఉన్న ఎమ్మెల్యేగా పోసాని తన పాత్రలో ఒదిగిపోయాడు. తన మార్కు హాస్యాన్ని బాగా పండించాడు. ఇక ప్రధానమైన విలన్ పాత్రలో సంపత్ రాజ్ కనిపించాడు. మంచు విష్ణుతో పోటాపోటీ సీన్లలో ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడని చెప్పవచ్చు. సుప్రిత్, టెంపర్ వంశీ తమ పాత్రల్లో ఫర్వాలేదనిపించారు.

     సాంకేతిక హంగులు

    సాంకేతిక హంగులు

    ఓటర్ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించారు. పాటలు అంతగా ఆకట్టుకొనేలా లేవు కానీ.. రీరికార్డింగ్ బాగుంది. రాజేష్ యాదవ్ అందించిన సినిమాటోగ్రఫి చాలా రిచ్‌గా ఉంది. విదేశాల్లో చిత్రీకరించిన పాటలు కనువిందు చేస్తాయి. ప్రవీణ్ కేల్ ఎడిటింగ్ ఫర్వాలేదు. చకచకా సీన్లు పరుగులు పెడుతాయి. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాల నిడివి పెరిగినట్టు అనిపిస్తుంది. వాటి గురించి కాస్త జాగ్రత్త తీసుకొంటే సినిమా వేగం పెరిగేందుకు అవకాశం ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    పొలిటికల్ సిస్టం మీద సెటైర్లతో రూపొందిన సినిమా ఓటర్. ప్రజా ప్రతినిధులను రీకాల్ చేయాలనే ప్రధానమైన పాయింట్‌ చుట్టు కమర్షియల్ హంగులను జోడిస్తూ తీసిన చిత్రమని చెప్పవచ్చు. ఇటీవల వచ్చిన రాజకీయపరమైన చిత్రాల్లో ఓటర్ మంచి పాయింట్‌తో రూపొందింది. కథ, కథనాలపై మరికాస్త దృష్టిపెట్టి ఉంటే మంచి చిత్రంగా నిలిచిపోయేది. బీ,సీ సెంటర్ల ప్రేక్షకులను ఆకర్షించే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించే ఛాన్స్ కూడా ఉంది.

    బలహీనతలు

    బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    మంచు విష్ణు
    కథ
    సినిమాటోగ్రఫి
    డైలాగ్స్

    మైనస్ పాయింట్స్
    సురభి
    మ్యూజిక్
    సెకండాఫ్‌లో నిడివి

     తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    మంచు విష్ణు, సురభి, సంపత్ రాజ్, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, శ్రవణ్, టెంపర్ వంశీ, నాజర్, ప్రగతి తదితరులు
    కథ, దర్శకత్వం: జీ కార్తీక్ రెడ్డి
    నిర్మాత: సుధీర్ కుమార్ పూదోట
    మ్యూజిక్: ఎస్ థమన్
    సినిమాటోగ్రఫి: అశ్విన్
    ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్
    రిలీజ్: 2019-06-21

    English summary
    Hero Manchu Vishnu landed fresh contraversy in Voter Movie rights. Director Karthik Reddy made serious allegations over Vishnu. He released a video in social media. He alleges that, Vishnu and His friend Vijay Kumar Reddy warned and made to sign on wrong agreement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X