For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఉన్నది ఒకటే జిందగీ మూవీ రివ్యూ: ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ

  By Rajababu
  |

  Rating:
  3.0/5
  Star Cast: రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి, శ్రీ విష్ణు, ప్రియదర్శి
  Director: కిషోర్ తిరుమల

  "Unnadi Okate Zindagi" Public Talk సినిమా చూసి అమ్మాయిల రచ్చ..

  టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు సంపాదించుకొన్న రామ్ పోతినేని నటించిన చిత్రం ఉన్నది ఒకటే జిందగీ. నేను శైలజ, హైపర్ చిత్రాల తర్వాత వస్తున్న చిత్రమిది. మరో హిట్‌ను కెరీర్‌లో జమ చేసుకొనేందుకు రామ్ మళ్లీ నైను శైలజ దర్శకుడు కిషోర్ తిరుమలతో జతకట్టాడు. ఫ్రెండ్స్ షిప్ అంశాన్ని ప్రధానంగా చేసుకొని రూపొందించిన ప్రేమ కథా చిత్రం ఉన్నది ఒకటే జిందగీ. హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠితోపాటు యువ హీరో శ్రీ విష్ణు కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  ఓ జిందగీ కథ ఇలా..

  ఓ జిందగీ కథ ఇలా..

  అభిరామ్ (రామ్) చిన్నతనంలోనే తల్లిని కోల్పోతాడు. తల్లి లేదనే బాధతో అనుక్షణం బాధపడుతుంటాడు. అలాంటి పరిస్థితుల్లో అభిరామ్‌కు స్కూల్ మేట్ వాసు (శ్రీవిష్ణు) అండగా నిలుస్తాడు. అమ్మలేని బాధను మరిపిస్తాడు వాసు. అలా వారి విడదీయలేని స్నేహం ఏర్పడుతుంది. కాలేజీ‌ లైఫ్‌లో అభిరామ్ ర్యాక్ బ్యాండ్ ఏర్పాటు చేసుకొని, వాసు ఎడ్యుకేషన్‌పై దృష్టి పెట్టి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు.

  జీవితంలో ఎదురైన సమస్యలకు..

  జీవితంలో ఎదురైన సమస్యలకు..

  ఇలా ప్రాణస్నేహితుల జీవితాల్లోకి మహా (అనుపమ పరమేశ్వరన్) ఓ డాక్టర్ ప్రవేశిస్తుంది. మహా కారణంగా అభిరామ్, వాసు విడిపోవాల్సి వస్తుంది. ఒకరికి మరొకరు అంటే ప్రాణం అనుకొనే స్నేహితులు మహా కారణంగా విడిపోతారు. వారి మధ్య విభేదాలకు మహా ఎలా కారణమైంది. మహా క్యారెక్టర్ ఏమైపోయింది. విడిపోయిన తర్వాత మళ్లీ అభిరామ్, వాసు కలుసుకొన్నారా? ఈ కథలో లావణ్య త్రిపాఠి పాత్ర ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే ఉన్నది ఒకటే జిందగీ.

  చిత్ర కథ తొలిభాగంలో..

  చిత్ర కథ తొలిభాగంలో..

  ఉన్నది ఒకటే జిందగీలో మూడు రకాల జీవిత ప్రయాణం కనిపిస్తుంది. బాల్యం, కాలేజీ లైఫ్, కాలేజ్ లైఫ్ తర్వాత అనే అంశాలపై కథ కొనసాగుతుంది. చిత్ర ఆరంభంలో అభిరామ్, వాసు మధ్య స్నేహం ఎలా ఏర్పడింది. వారు ప్రాణ స్నేహితులుగా ఎలా మారారు. తొలిభాగంలో మహాపై అభిరామ్, వాసుకు ఏర్పడిన ప్రేమ అనేవి కీలక అంశాలు. ఇంటర్వెల్‌కు ముందు ఊహించని ట్విస్ట్‌తో కథను మరో మలుపు తిరగడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది.

  రెండో భాగంలో ఇలా..

  రెండో భాగంలో ఇలా..

  ఇక రెండో భాగంలో తన స్నేహితుడి వివాహం కోసం ఊటికి వచ్చిన అభిరామ్, వాసు మధ్య జరిగిన సన్నివేశాలు, పెళ్లిలో కామెడీ అంశాలతో ప్రీ క్లైమాక్స్ వరకు కథను లాక్కొచ్చినట్టు కనిపిస్తుంది. సెకండాఫ్‌లో లావణ్య పాత్ర చుట్టు తిరిగే పాత్రలు, క్లైమాక్స్‌ చాలా రొటీన్‌గా ముగుస్తుంది. అయితే ఓవరాల్‌గా కథా పరంగా చూస్తే బోలెడు ప్రేమ కథ సినిమాలు గుర్తుకొస్తాయి. అయితే పాత కథే అయినప్పటికీ ట్రీట్‌మెంట్ పక్కగా ఉండటంతో ఓ ఫీల్ గుడ్ చిత్రమని అనిపిస్తుంది. అయితే చాలా సన్నివేశాలు సహజత్వానికి దూరంగా ఉండటం ఈ చిత్రంలో ఓ ప్రధాన లోపమని చెప్పవచ్చు.

   దర్శకుడి ప్రతిభకు

  దర్శకుడి ప్రతిభకు

  ఫ్రెండ్‌షిప్, లవ్ అనే రెగ్యులర్ పాయింట్లను ఆధారంగా చేసుకొని ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమాను రూపొందించడమే దర్శకుడు కిషోర్ తిరుమల చేసిన సాహసం అని చెప్పవచ్చు. రొటీన్ కథలో పాత్రలను డిజైన్ చేసుకొన్న తీరు ఈ సినిమాకు ప్లస్ అయింది. అంతేకాకుండా దర్శకుడి ప్రతిభకు అద్ధంపట్టింది. లవ్, మదర్ సెంటిమెంట్ ఈ చిత్ర కథలో ఫీల్‌గుడ్ అంశాలుగా మారి ప్రేక్షకుడిని రెండు గంటలపాటు ఎంగేజ్ చేసేందుకు తోడ్పాడ్డాయి. కథగా చూసుకొంటే గొప్పగా అనిపించకపోయినా సీన్లుగా చూస్తే ఈ సినిమా అందరి మనసుకు చేరువవుతుంది.

   రామ్ మరోసారి ఎనర్జిటిక్‌గా

  రామ్ మరోసారి ఎనర్జిటిక్‌గా

  ఉన్నది ఒకటే జిందగీ చిత్రంలో రామ్ మరోసారి ఎనర్జిట్ ఫెర్మార్మెన్స్‌ను అందించాడు. పాటలు, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్‌లో చక్కగా రాణించాడు. గత చిత్రాల కంటే భిన్నంగా కనిపించడమే కాకుండా పరిణితిని కూడా ప్రదర్శించాడు. ఈ సినిమాలో రెండు రకాల గెటప్స్‌లో అలరించాడు. కీలక సన్నివేశాల్లో రామ్ పలికించిన హావభావాలు ఆకట్టుకొంటాయి.

  శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్..

  శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్..

  ఇక రామ్ ఫ్రెండ్‌గా వాసు పాత్రలో నటించిన శ్రీ విష్ణుది అల్టిమెట్ ఫెర్ఫార్మెన్స్. అప్పట్లో ఒకడుండే వాడు తర్వాత శ్రీ విష్ణు మరోసారి అందరికీ గుర్తుండిపోయే పాత్రలో కనిపించాడు. హీరోకు సమానంగా ఉండే పాత్రను శ్రీ విష్ణు ఇరుగదీసాడని చెప్పవచ్చు. ముఖంలో ఉండే అమాయకత్వం, సున్నితత్వం పాత్రపై జాలి కలిగేలా చేయడంలో శ్రీ విష్ణు తన వంతు పాత్రను పూర్తిగా నిర్వహించాడు.

   మహాగా అనుపమ

  మహాగా అనుపమ

  మహా పాత్రలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ కనిపించింది. తనకు లభించిన పాత్రను ఎలాంటి తడబాటు లేకుండా నటించి సినిమాను ముందుకు తీసుకెళ్లేలా చేసింది. భావోద్వేగాల మధ్య సాగే పాత్రలో చక్కగా ఒదిగిపోయింది.

   వెడ్డింగ్ ప్లానర్‌గా లావణ్య

  వెడ్డింగ్ ప్లానర్‌గా లావణ్య

  ఇక రెండో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి కనిపించింది. ఆమె వెడ్డింగ్ ప్లానర్‌ పాత్రను పోషించింది. ఈ చిత్ర కథలో ఆమె పాత్ర సహజంగా అనిపించకపోగా ఏదో అతికించిన విధంగా అనిపిస్తుంది. లావణ్య త్రిపాఠి పాత్రలో ఎలాంటి ఎమోషన్స్‌కు చోటు లేకపోవడం వల్ల పెద్దగా ప్రేక్షకులు గుర్తుంచుకొని అవకాశం లేదు.

  ఆకట్టుకున్న ప్రియదర్శి

  ఆకట్టుకున్న ప్రియదర్శి

  అభిరామ్, వాసు ఫ్రెండ్స్ బ్యాచ్‌లో సతీష్‌గా ప్రియదర్శి, కీర్తి దామరాజు పాత్రలు హైలెట్‌గా ఉన్నాయి. ప్రియదర్శి తనదైన శైలిలో పలికించిన కామెడీ చక్కగా ఆకట్టుకుంది. భావోద్వేగ సన్నివేశాల మధ్య ప్రియదర్శి కామెడీ థియేటర్లలో నవ్వులు పూయించింది. తన యాంగిల్‌‌లో నడిచే కథకు కీర్తి దామరాజు తన నటనతో న్యాయం చేశాడు. కథలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్‌ను కీర్తి దామరాజు ఎలాంటి తడబాటు లేకుండా నటించాడు.

   అనీషా అంబ్రోస్ గెస్ట్ ఎంట్రీ

  అనీషా అంబ్రోస్ గెస్ట్ ఎంట్రీ

  ఈ చిత్రంలో అనుకొని అతిథి పాత్ర ఎంట్రీ ఇస్తుంది. రామ్‌తో ప్రేమలో పడిన యువతిగా అనిషా అంబ్రోస్ కనిపించింది. కథలో అనీషా పాత్రకు పెద్దగా లేకపోవడంతో గెస్ట్‌గానే మారిపోయింది.

  మ్యూజిక్‌తో దేవీ మ్యాజిక్

  మ్యూజిక్‌తో దేవీ మ్యాజిక్

  సాధారణంగా ఫీల్ గుడ్ ప్రేమ కథలకు సంగీతం ప్రాణం. ఉన్నది ఒకటే జిందగీ సినిమాకు ఆ ప్రాణం పోసే బాధ్యతను సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ పూర్తిగా నెరవేర్చాడు. ఎమోషనల్ సీన్లలో వచ్చే ట్రెండ్ మారిన సాంగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియెన్స్‌కు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు. ఉన్నది ఒకటే జిందగీ, లైఫ్ ఈజ్ ఏ రెయిన్‌బో అనే పాటలు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఉన్నది ఒకటే జిందగీ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఓ అసెట్.

  సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ..

  సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ..

  ఉన్నది ఒకటే జిందగీ చిత్రానికి సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ. ఊటి, ఇటలీలోని అందాలను అద్భుతంగా తెరకెక్కించాడు. లవ్ స్టోరీకి కావాల్సిన ఫీల్‌ను కలిగించడంలో సమీర్ తన వంతు పనిని కానిచ్చేశాడు. ఎడిటింగ్ విషయానికి వస్తే సినిమా రెండో భాగంలో కొన్ని సన్నివేశాలపై శ్రీకర్ ప్రసాద్ కత్తెర పడాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది.

  ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్

  ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్

  స్రవంతి సినిమాటిక్స్, పీఆర్ మూవీస్ బ్యానర్‌పై ఉన్నది ఒకటే జిందగీ చిత్రం రూపొందింది. స్రవంతి రవికిశోర్, కృష్ణ చైతన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎప్పటిలానే స్టోరికి తగినట్టుగా నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి. కథ కోసం రిచ్ లోకేషన్లను ఎంచుకోవడం వారి అభిరుచికి అద్దం పట్టింది.

   ఫైనల్ జడ్జిమెంట్..

  ఫైనల్ జడ్జిమెంట్..

  ప్రేమ కథల్లో పెద్దగా చెప్పుకోవడానికి కొత్త అంశాలు ఏమీ ఉండవు. పాత సీసాలో కొత్త సారా పోసినట్టు ఉంటాయి. కాకపోతే కథ, కథనమే కీలక అంశాలు. అలాంటి అంశాలను సినిమా ఆరంభం నుంచి చివరి వరకు నడిపించే తీరుపైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. రామ్, శ్రీవిష్ణు, అనుపమ పరమేశ్వరన్, ప్రియదర్శి పాత్రలను దర్శకుడు బలంగా మలుచుకొన్నారు. ఉన్నది ఒకటే జిందగీ చిత్రాన్ని ఫీల్‌గుడ్ చిత్రంగా మలచడంలో దర్శకుడు కిషోర్ తిరుమల నూరు పాళ్లు సక్సెస్ అయ్యాడు. అంచనాలు లేకుండా కుటుంబంతో ఎంజాయ్ చేయాలనుకొన్నవారికి ఓ వెకేషన్ స్పాట్ అని చెప్పవచ్చు.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  పాజిటివ్ పాయింట్స్

  రామ్, శ్రీ విష్ణు, అనుపమ యాక్టింగ్

  ప్రియదర్శి కామెడీ

  స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్

  నెగిటివ్ పాయింట్స్

  సెకండాఫ్

   తెర వెనుక.. తెర ముందు

  తెర వెనుక.. తెర ముందు

  నటీనటులు: రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి, శ్రీ విష్ణు, ప్రియదర్శి, కీరిటీ దామరాజు, అనీషా అంబ్రోస్ తదితరులు

  కథ, దర్శకత్వం: కిషోర్ తిరుమల

  నిర్మాతలు: కృష్ణ చైతన్య, స్రవంతి రవికిషోర్

  మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్

  సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి

  ఎడిటర్: శ్రీకర్ రెడ్డి

  రిలీజ్ డేట్: 27 అక్టోబర్ 2017

  సినిమా నిడివి: 149 నిమిషాలు

  English summary
  Ram pothineni's latest movie is Unnadi Okate Zindagi. This movie is directed by Kishore Tirumala, Who directed Nenu Sailaja earlier. This movie hit the Screen on October 27th. Unnadi Okate Zindagi movie review is for exclusively for Telugu Filmibeat readers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X