W/o రామ్ మూవీ: పవర్‌ఫుల్‌గా మంచు లక్ష్మి

By Rajababu

Recommended Video

Wife Of Ram Movie Review వైఫ్ ఆఫ్ రామ్ సినిమా రివ్యూ

Rating:
2.5/5
Star Cast: మంచు లక్ష్మి, సామ్రాట్, ఆదర్శ్, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్
Director: విజయ్ ఏలకంటి

అనగనగా ఓ ధీరుడు, ఊ కొడుతారా ఉలిక్కిపడుతారా? గుండెల్లో గోదారి లాంటి విభిన్న కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మంచు లక్ష్మీ దగ్గరవుతూనే ఉన్నారు. ఆమె నటించిన చిత్రాలు విమర్శకుల ప్రశంసలకు నోచుకొన్నా, కమర్షియల్‌గా మంచి హిట్ సాధించలేకపోయాయి. అయినా తనదైన మార్కుతో టాలీవుడ్‌లో ఆమె దూసుకెళ్తున్నారు. తాజాగా నూతన దర్శకుడు విజయ్ ఏలకంటి దర్శకత్వంలో వైఫ్ ఆఫ్ రామ్ అనే సస్పెన్స్, థ్రిల్లర్‌తో ముందుకొచ్చారు. ఈ చిత్రం మంచు లక్ష్మికి కమర్షియల్‌గా మంచి పేరు తెస్తుందా? విమర్శకుల ప్రశంసలకు చేరువయ్యేలా ఉందా అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

వైఫ్ ఆఫ్ రామ్ మూవీ స్టోరి

వైఫ్ ఆఫ్ రామ్ మూవీ స్టోరి

దీక్ష(మంచు లక్ష్మీ) స్వచ్ఛంద సంస్థలో పనిచేసే ఉద్యోగి. ఊహించని పరిస్థితుల్లో తన భర్త (సామ్రాట్) ప్రమాదవశాత్తూ మరణిస్తాడు. తన భర్త మరణానికి కారణం ఎవరనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసుల సహకారం కోరుతుంది. కానీ తాను ఆశించినట్టు వారి నుంచి ఎలాంటి స్పందన ఉండదు. ఈ క్రమంలో తనదైన శైలిలో ఆధారాలు సేకరించే పనిలో పడుతుంది. ఈ క్రమంలో రాకీ (ఆదర్శ్) కారణం అని తెలుస్తుంది.

వైఫ్ ఆఫ్ రామ్ మూవీ ట్విస్టులు

వైఫ్ ఆఫ్ రామ్ మూవీ ట్విస్టులు

తన భర్త ఎందుకు హత్యకు గురయ్యాడు? ఎవరు హత్య చేశారు? తన భర్త మరణం వెనుక అసలు కారణం ఏమిటి? దీక్ష‌ పోరాటానికి న్యాయం జరిగిందా? తన ప్రయాణంలో దీక్ష ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? పోలీసులుఎందుకు సహకరించరు? రాకీపై ఎలా ప్రతీకారం తీర్చుకొన్నది? ఇలాంటి ప్రశ్నలకు సస్పెన్స్ వీడాలంటే వైఫ్ ఆఫ్ రామ్ సినిమా చూడాల్సిందే.

ఫస్టాఫ్ అనాలిసిస్

ఫస్టాఫ్ అనాలిసిస్

ప్రమాదంలో చిక్కుకున్న దీక్ష, తన భర్త సన్నివేశాలతో ప్రారంభమవుతుంది. కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా ఆ ప్రమాదంలో కోల్పోవడం అనే విషయం సినిమా ఆరంభంలోనే ఆసక్తిని కలిగిస్తుంది. భర్త మరణం ఆమెను వేదనకు గురిచేస్తుంది. ఇలా మంచి స్క్రీన్‌ప్లేతో కథ ముందుకు సాగుతుంటుంది. తన భర్త మరణానికి కారణం రాకీ అనే విషయాన్ని రివీల్ చేయడంతో తొలిభాగం ముగుస్తుంది.

 సెకండాఫ్ అనాలిసిస్

సెకండాఫ్ అనాలిసిస్

విదేశాల్లో ఉన్న ధనుష్‌ను రప్పించడానికి రెండో భాగంలో డ్రామా మొదలవుతుంది. ఎస్‌ఐ చారి (ప్రియదర్శి) దీక్ష పాత్ర వేసే ఎత్తులు పైఎత్తులు ఆకట్టుకొనేలా ఉంటాయి. తనకు సహకరించని పోలీసులను, పలుకుబడి ఉన్న ధనుష్ కుటుంబాన్ని ఎదుర్కొనే తీరు ఆసక్తికరంగా ఉంటుంది. చక్కటి ముగింపు, ప్రేక్షకులను ఆలోచించే పాయింట్‌తో సినిమా ముగుస్తుంది.

దర్శకుడిగా ప్రతిభ

దర్శకుడిగా ప్రతిభ

ఆడపిల్లలపై లైంగిక దాడులు అనే పాయింట్‌ను నేపథ్యంగా చేసుకొని దర్శకుడు విజయ్ కథను ఆసక్తికరమైన కథనంతో రాసుకోవడంలోనే విజయం సాధించాడని చెప్పవచ్చు. తాత్కాలిక సుఖం కోసం క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొంటే ఫలితం ఎలా ఉంటుందో అనే పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. దానికి తోడు సాంకేతిక నిపుణుల పనితీరుతో మరో మెట్టు ఎక్కాడని చెప్పవచ్చు. ఆయన ప్రతిభకు తోడుగా మంచు లక్ష్మి చేరడం మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. పాత్రలను మలిచిన విధానం, కథలో ట్విస్టులు రాసుకొన్న తీరు విజయ్ ప్రతిభకు అద్దం పట్టింది.

 మంచు లక్ష్మీ ఫెర్ఫార్మెన్స్

మంచు లక్ష్మీ ఫెర్ఫార్మెన్స్

దీక్షగా మంచు లక్ష్మీ తన మార్కును చాటుకొన్నది. ఎమోషనల్ పాత్రలో తనదైన శైలిలో రాణించింది. వైఫ్ ఆఫ్‌ రామ్ చిత్రాన్ని తన భుజాలపైనే మోసి ఆకట్టుకొన్నారు. ఎమోషనల్ సీన్లలో ఆమె నటన బాగుంది. గెటప్‌పరంగా మరికొంత శ్రద్ధ పెడితే ప్రేక్షకులకు మరింత చేరువయ్యేది. దీక్ష పాత్ర మంచు లక్ష్మిని నటిగా మరో మెట్టు ఎక్కిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత చేరువ అవ్వడం ఖాయం.

సామ్రాట్, ఆదర్శ్ పాత్రలు

సామ్రాట్, ఆదర్శ్ పాత్రలు

వైఫ్ ఆఫ్ రామ్ చిత్రంలో సామ్రాట్, ఆదర్శ్ పాత్రల పరిధి చిన్నవైనప్పటికీ కథలో కీలకంగా ఉంటాయి. ఆ పాత్రల బ్యాక్‌డ్రాప్‌తోనే స్టోరి ముందుకెళ్తుంది. సామ్రాట్ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. ఆదర్శ్ మరోసారి నెగిటివ్ షేడ్స్ కారెక్టర్‌లో ఒదిగిపోయాడు. ముగింపులో మంచు లక్ష్మితో పోటీపడి నటించాడు.

ప్రియదర్శి, శ్రీకాంత్ ఎలా చేశారంటే

ప్రియదర్శి, శ్రీకాంత్ ఎలా చేశారంటే

ఈ చిత్రంలో పోలీసు ఆఫీసర్ల పాత్రలు ప్రధానమని చెప్పుకోవాలి. అవినితీ ఆఫీసర్‌గా శ్రీకాంత్ అయ్యంగార్ మెరుగైన ప్రతిభను కనిబరిచారు. తొలి భాగంలో విలనీ మార్కు నటనను కనబరిచారు. డైలాగ్ డెలివరీ, హావభావాల ప్రదర్శన భాగుంది. ఇక చారిగా ఎస్‌ఐ పాత్రలో ప్రియదర్శి కనిపించాడు. కమెడియన్‌గా ముద్ర వేసుకొన్న ప్రియదర్శికి ఇది కొత్త రోల్. పాత్రలో మంచి వేరియేషన్ కనబరిచాడు.

రఘు మ్యూజిక్

రఘు మ్యూజిక్

వైఫ్ ఆఫ్ రామ్ చిత్రానికి రఘు దీక్షిత్ అందించిన మ్యూజిక్ ప్రాణం అని చెప్పవచ్చు. తొలి సీన్ నుంచే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంగేజింగ్‌గా ఉంటుంది. కీలక సన్నివేశాలకు నేపథ్య సంగీతం బలాన్ని ఇస్తుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కావాల్సిన మ్యూజిక్‌ను అందించడంలో రఘు సఫలమయ్యాడు.

సినిమాటోగ్రఫీ గురించి

సినిమాటోగ్రఫీ గురించి

సామల భాస్కర్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. నైట్ ఎఫెక్ట్ సీన్లు, వ్యాలీ సీన్, కెమెరా యాంగిల్స్ బాగున్నాయి. తమ్మిరాజు ఎడిటింగ్ కథా వేగాన్ని పెంచింది.

 ప్రొడక్షన్ వ్యాల్యూస్

ప్రొడక్షన్ వ్యాల్యూస్

మంచు లక్ష్మి, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. టెక్నిషియన్ల ఎంపిక, ప్రతీ సీన్‌ను రిచ్‌గా తెరకెక్కించిన విధానం వారి నిర్మాణ విలువలకు అద్దం పట్టింది. కమర్షియల్ విలువలకు జోలికి వెళ్లకుండా కథను కథగా చెప్పిన తీరు సినిమాపై వారికి ఉన్న అభిరుచిని తెలియజెప్పింది.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

ప్రస్తుత సమాజంలో జరుగుతున్న లైంగిక దాడులు అంశాన్ని కథ ఎన్నుకోవడం సినిమాకు బలమైన పాయింట్. ఈ అంశమే సినిమాకు బలంగా మారింది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఎంజాయ్ చేసేవారికి ఈ చిత్రం మంచి అనుభూతిని పంచుతుంది. ఇప్పటికే ఈ తరహా సినిమాలు వచ్చినా ప్రేక్షకుడిని రెండు గంటలపాటు సీట్లో కూర్చొపెట్టడంతోనే దర్శకుడు పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాడు. అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తే కమర్షియల్‌గా మంచి విజయం చేజిక్కడం ఖాయం.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్లస్ పాయింట్స్
కథ, విజయ్ డైరెక్షన్
మంచు లక్ష్మి ఫెర్ఫార్మెన్స్
సినిమాటోగ్రఫి
మ్యూజిక్

తెర ముందు, తెర వెనుక

తెర ముందు, తెర వెనుక

మంచు లక్ష్మి, సామ్రాట్, ఆదర్శ్, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
దర్శకత్వం: విజయ్ ఏలకంటి
సంగీతం: రఘు దీక్షిత్
సినిమాటోగ్రఫీ: సామల భాస్కర్
ఎడిటింగ్: తమ్మిరాజు
రిలీజ్ డేట్: 2018-07-20

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X