For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నగరం మూవీ రివ్యూ

  By Rajababu
  |

  Rating:
  2.5/5
  Star Cast: సందీప్ కిషన్, శ్రీ, రెజీనా కసాండ్రా, మధుసూదన్, చార్లే
  Director: లోకేశ్ కనకరాజ్

  నగరం అంటే అన్ని వర్గాలను అక్కున చేర్చుకొనే అమ్మ లాంటింది. ఎన్నో ఆశలతో మంచి భవిష్యత్ కోసం నగరానికి వచ్చే వారికి నగరం కొందరికి మంచి అనుభూతులను పంచితే, మరికొందరికి ఎన్నో చేదు అనుభవాలను పంచుతుంది. నగరంలో నిత్యం ఎన్నో ఘటనలు చోటుచేసుకొంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో 48 గంటల్లో వివిధ ప్రాంతాల్లో కొందరికి జీవితాల్లో జరిగిన సంఘటనల తుది రూపమే నగరం చిత్రం. తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన లోకేశ్ కనకరాజ్ రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతులను పంచిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సింది.

  కొందరి జీవితాల్లో 48 గంటల్లో జరిగిన కథ

  కొందరి జీవితాల్లో 48 గంటల్లో జరిగిన కథ

  సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్ఆర్‌గా పనిచేసే రెజీనా, సందీప్ కిషన్ లవర్స్. పనిపాట లేకుండా తిరిగే సందీప్ కిషన్ రెజీనా ప్రేమ కోసం తపిస్తుంటాడు. ఏదైనా ఉద్యోగం చేస్తేనే తాను ప్రేమను అంగీకరించలేదని స్పష్టం చేస్తుంది. తన ప్రేమను కాపాడుకోవడానికి పల్లెటూరు నుంచి నగరానికి వచ్చిన ఓ నిరుద్యోగి (శ్రీ) మంచి ఉద్యోగాన్ని సంపాదించాలనుకొంటాడు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి ఓ వ్యక్తి డ్రైవర్ (చార్లే) గా అవతారం ఎత్తుతాడు. ఇక నగరంలోనే పీకేపీ (మధుసూదన్) అనే పేరు మోసిన మాఫియా డాన్ ఉంటాడు. అలాగే చిన్న చితకా సెటిల్మెంట్ల దందా సాగించే ఓ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ అనుకోని పరిస్థితుల్లో మాఫియా డాన్ కుమారుడిని కిడ్నాప్ చేస్తారు. కథలో భాగంగా నగరంలోని వేర్వేరు ప్రదేశాల్లో జరిగే ఐదు ప్రధాన కథాంశాలు.

   క్లైమాక్స్‌లో పరిష్కారం లభించిందా?

  క్లైమాక్స్‌లో పరిష్కారం లభించిందా?

  అయితే సందీప్, శ్రీ ఇద్దరు మంచి ఉద్యోగాలు సంపాదించి ప్రేమను దక్కించుకొన్నారా? డ్రైవర్ తన కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి బయటపడ్డాడా? మాఫియా డాన్ తన కుమారుడిని సురక్షితంగా రక్షించుకొన్నాడా? రౌడీ మూక ఎందుకు మాఫియా డాన్ కొడుకును కిడ్నాప్ చేశారు? ఈ క్రమంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని వారు ఎలా ఎదుర్కొన్నారనే ప్రశ్నలకు సమాధానం నగరం చిత్రం.

  దర్శకుడు లోకేశ్ అద్భుత ప్రతిభ

  దర్శకుడు లోకేశ్ అద్భుత ప్రతిభ

  ఐదు విభిన్న కోణాలున్న కథాంశాలను దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించడంలో మంచి పరిణతిని చూపించాడు. తొలి చిత్ర దర్శకుడిగా కాకుండా మంచి అనుభవం ఉన్న డైరెక్టర్‌ అనే భావన కల్పించడంలో సఫలమయ్యాడు. ఐదు కథలలో విభిన్న పాత్రలను హ్యాండిల్ చేయడంలోనూ, కథ చెప్పడంలోనూ ప్రత్యేక శైలిని కనబరిచాడు.

  డైరెక్టర్‌కు నూటికి నూరు మార్కులు

  డైరెక్టర్‌కు నూటికి నూరు మార్కులు

  అద్భుతమైన కథనాన్ని మేలవించి ప్రేక్షకుడికి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ కలిగించేందుకు ప్రయత్నించాడు. క్లిష్టమైన కథను ప్రభావవంతంగా చెప్పడానికి మంచి సాంకేతిక నిపుణులను ఎంచుకొన్నారు. అనేక ట్విస్టులు, సస్పెన్స్‌, హ్యూమర్, ఎమోషన్స్, థ్రిల్స్‌ను తెరకెక్కించడంలో దర్శకుడిగా లోకేశ్ నూటికి నూరు మార్కులు సంపాదించుకొన్నారని చెప్పవచ్చు.

  టెక్నికల్ టీమ్ పనితీరు భేష్

  టెక్నికల్ టీమ్ పనితీరు భేష్

  దర్శకుడి లక్ష్యాన్ని నెరవేర్చడంలో సంగీత దర్శకుడు జావెద్ రియాజ్, సినిమాటోగ్రాఫర్ సెల్వకుమార్ ఎస్కే, ఎడిటర్ ఫిలోమిన్ ప్రధాన పాత్రను పోషించారు. ప్రేక్షకుడిని ఆకట్టుకొనే విధంగా కథను తెరకెక్కించడంలో సినిమాటోగ్రాఫర్ సెల్వకుమార్ ఎస్కే అద్భుతమైన పనితీరును కనిపించారు. నైట్ ఎఫెక్ట్ సీన్లను బ్రహ్మండంగా చిత్రీకరించాడు. ఎమోషన్స్ ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.

  ఎడిటర్ కత్తెరకు పదును ఎక్కువే

  ఎడిటర్ కత్తెరకు పదును ఎక్కువే

  విభిన్నమైన స్క్రీన్ ప్లే‌ను ప్రేక్షకుడిని ఎక్కడ కన్‌ఫ్యూజ్ చేయకుండా ఎడిటర్ ఫిలోమిన్ తన కత్తెర పెట్టిన పదను తెరపైన చూడాల్సిందే. కథలో భావోద్వేగాలు, ఆర్టిస్టుల ఎమోషన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ చేయడానికి జావెద్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.

  మెయిన్ టార్గెట్ యాక్షన్, స్క్రీన్ ప్లే

  మెయిన్ టార్గెట్ యాక్షన్, స్క్రీన్ ప్లే

  దర్శకుడు కేవలం యాక్షన్‌పైనే దృష్టిపెట్టడం వల్ల రొమాంటిక్, ఎంటర్‌టైన్‌మెంట్ తదితర అంశాలను పట్టించుకోకపోవడం ప్రధాన లోపం. వినోదాన్ని ఎక్కువ ఆశించే తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం మింగుడు పడుతుందా అనేది అనుమానమే. రెజీనా, సందీప్ కిషన్, శ్రీ, లవ్ ట్రాక్ లేకపోవడం యూత్‌కు కనెక్ట్ కాకపోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే యాక్షన్, స్క్రీన్ ప్లే అత్యున్నత స్థాయిలో ఉండటం వల్ల ఈ లోపాలు పెద్దగా బయటకు కనిపించవు.

  దర్శకుడి మంచి సందేశం

  దర్శకుడి మంచి సందేశం

  అనేక సమస్యలో కూరుకుపోయిన నగరం నుంచి వెళ్లి పోవాలనుకున్న సందీప్ కిషన్ మళ్లీ మనసు మార్చుకోవడం, అలాగే పల్లెటూరు నుంచి ఉద్యోగం కోసం వచ్చిన శ్రీ నగరం వల్ల ఒరిగేది ఏమిలేదు. ఊరే మంచిది అనే భావన నుంచి బయటపడి నగరమే మంచిది అనే ఫీలింగ్ కల్పించిన సన్నివేశాలు దర్శకుడి పనితీరుకు అద్దం పట్టాయి. ఉన్న ఊరిలోనే ఉండటం మానసికంగా స్థైర్యమని సందీప్ చేత, ఎవరో నలుగురి వల్ల కలిగిన ఇబ్బందులతో నగరంపై చెడు అభిప్రాయాన్ని కలిగించుకోవడం అని చెప్పిన అంశాలు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతాయి.

  ఎత్తులు పై ఎత్తులు.. డ్రామా

  ఎత్తులు పై ఎత్తులు.. డ్రామా

  పిల్లాడి కిడ్నాప్ డ్రామాలో మాఫియా డాన్, రౌడీ మూకల మధ్య జరిగే ఎత్తులు పైఎత్తులు యాక్షన్ ప్రేమించే ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయి. కుమారుడి కోసం డాన్ పడే తపన‌తో మంచి సెంటిమెంట్ వర్కవుట్ అయింది.

  ఫీల్ గుడ్ మూవీ.. పైసా వసూల్

  ఫీల్ గుడ్ మూవీ.. పైసా వసూల్

  ఇలాంటి అనేక ప్రత్యేకతలతో రొటీన్‌కు భిన్నంగా ఉన్న చిత్రమనే అభిప్రాయం ప్రేక్షకుడికి ఈ చిత్రం కల్పిస్తుంది. మూస చిత్రాలను కాకుండా డిఫరెంట్ చిత్రాలను ఆశించే ఆడియెన్స్‌కు నగరం చిత్రం ఫుల్ మీల్స్ లాంటింది. అంతేకాకుండా పైసా వసూల్ సినిమా అని బల్ల గుద్ది చెప్పవచ్చు.

  తారాగణం

  తారాగణం

  సందీప్ కిషన్, రెజీనా, శ్రీ, మధూసుదన్, చార్లే, ఇంకా అనేకమంది ఆర్టిస్టులు ఉన్నా తెరమీద పాత్రలే కనిపిస్తాయి. హీరో, హీరోయిన్లు ఎక్కడా ఎలివేట్ కాదు. కథ ఈ చిత్రంలో హీరో. కథనం ఈ చిత్రానికి బలం. సాంకేతిక నిపుణుల ప్రతిభ అదనపు ఆకర్షణ. సందీప్, రెజీనా కెరీర్‌లో మంచి సినిమాగా గుర్తింపు.

  షేక్ స్పియర్ నాటకం ఈ చిత్రానికి ఆధారం

  షేక్ స్పియర్ నాటకం ఈ చిత్రానికి ఆధారం

  ఈ చిత్ర కథ షేక్ స్పియర్ రచించిన కామేడి ఆఫ్ ఎర్రర్స్, ట్వెల్త్ నైట్ నాటకాల్లో మాదిరిగా ఒకరిని బదులు మరొకరిని టార్గెట్‌గా చేసుకొనే అంశాన్ని (మిస్టేకెన్ ఐడెంటీటీస్) పోలి ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఓ ప్రదేశంలో ఎదురైన సమస్యలను ఓ వ్యక్తులు ఎలా ఎదురించారనేది కథాంశం.

  ప్లస్ పాయింట్స్
  కథ, కథనం, యాక్షన్
  డైరెక్టర్, సాంకేతిక అంశాలు

  మైనస్ పాయింట్స్
  ఎంటర్‌టైన్‌మెంట్ లోపించడం
  రొమాన్స్ లేకపోవడం

  ప్రధాన పాత్రధారులు

  చిత్రం పేరు: నగరం
  నటీనటులు: సందీప్ కిషన్, శ్రీ, రెజీనా కసాండ్రా, మధుసూదన్, చార్లే
  దర్శకత్వం: లోకేశ్ కనకరాజ్
  సంగీత దర్శకుడు: జావెద్ రియాజ్,
  సినిమాటోగ్రాఫర్: సెల్వకుమార్ ఎస్కే,
  ఎడిటర్: ఫిలోమిన్
  రిలీజ్: మార్చి 10

  English summary
  Lokesh Kanagaraj’s debut work Nagaram movie gearing up to release on 10 March. Sandeep Kishan, Regina, Shri are lead roles in this movie. Before release this movie grabs.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X