»   » వేర్ ఈజ్ విద్యాబాలన్?.... (మూవీ రివ్యూ)

వేర్ ఈజ్ విద్యాబాలన్?.... (మూవీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.5/5

హైదరాబాద్: ప్రిన్స్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వేర్ ఈజ్ విద్యాబాలన్'. హీరోగా ప్రిన్స్ ఇప్పుడు అసలు క్రేజ్ లేదనే చెప్పాలి. ఈ నేపధ్యంలో సంపూర్ణేష్ బాబు, సప్తగిరి వంటివారిని ప్యాడింగ్ పెట్టుకుని కామెడీ కాన్సెప్టుతో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కామెడీ బిరియానీలా ఉంటుందని ప్రమోషన్స్ నిర్వహించారు. సినిమాకు సంబంధించిన పూర్తి విశేషాలు రివ్యూలో...

పిజ్జా సెంటర్ లో పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ సరదాగా జీవితాన్ని గడుపుతూంటాడు కిరణ్( ప్రిన్స్). డాక్టర్ స్వాతి(జ్యోతి సేథ్)తో ప్రేమలో పడతాడు. స్వాతి బంధువు వాల్తేర్ వాసు(మధునందన్) వీరిని విడగొట్టాలని చూస్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు వెనక మినిస్టర్ పులి నాయుడు(జయప్రకాష్ రెడ్డి), డాన్ గంటా (సంపూర్ణేష్ బాబు) ఉంటారు. విద్యాబాలన్ ఫోన్ కోసం ఈ మర్డర్ జరుగుతుంది. అసలు ఆ ఫోన్లో ఏ ముంది? ఆ కేసు నుంచి కిరణ్, వాల్తేర్ వాసు ఎలా బయిటపడ్డారు. కిరణ్ కు పోలీస్ అధికారి నీలకంఠ(ఆశిష్ విద్యార్ది) ఎలా సహాయపడ్డాడు, చివరకు ఏమంది అనేది తెరపై చూడాల్సిందే.


లవర్ బాయ్ పాత్రలో ప్రిన్స్ ఆకట్టుకున్నాడు. అయితే ఇంకా అతని నటనలో పరిణితి రావాల్సి ఉంది. హీరోయిన్ జ్యోతి సేథ్ ఫర్వాలేదు. ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేసింది. పులి నాయుడు పాత్రలో జయప్రకాష్ రెడ్డి నవ్వించాడు. డాన్ గంటా పాత్రలో సంపూర్ణష్ బాబు మెప్పించాడు. మధు నందన్, సప్తగిరి, తాగుబోతు రమేష్ బాగా ఎంటర్ టైన్ చేశారు. విలన్ పాత్రలో రావు రమేష్ తనదైన మార్కు చూపించారు. ఆశిష్ విద్యార్థి ఎప్పటిలాగే తన సహజ నటన ప్రదర్శించాడు.


Where is Vidya Balan Review

టెక్నికల్..
కమ్రాన్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. అయితే మధు ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. చిట్టిబాబు సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు ఫర్వా లేదు.


సినిమాలో జయప్రకాష్ రెడ్డి, సంపూర్ణేష్ బాబు, సంప్తగిరి, తాగుబోతు రమేష్ దితరుల కామెడీ ట్రాక్ ఫర్వా లేదు. అయితే ప్రిన్స్, మదునందన్ మధ్య వచ్చేసీన్లు ఓకే. జెన్నిఫర్ ఐటం సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.


అయితే కథలో కొత్తదనం లేదు. ఇలాంటి కాన్సెప్టులు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. కనీసం స్క్రీప్లే అయినా ఆసక్తి కరంగా ఉందంటే పూర్తి స్థాయిలో లేదనే చెప్పాలి. ఫస్టాఫ్ లో చాలా సీన్లు సాగదీసినట్లు ఉన్నాయి. దర్శకుడు శ్రీనివాస్ రాగ స్క్రిప్టు పక్కాగా ఉండేట్లు చూసుకోవడంలో విఫలం అయ్యాడు. కామెడీతో ఎంటర్టెన్ చేయాలని నిర్ణయించుకున్న దర్శకుడు క్రేజీ టైటిల్, సర్ ప్రైజ్ ఎలిమెంట్లు, మంచి ప్లాట్ తో వచ్చినా....వాటిని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో విఫలం అయ్యాడు.


ఓవరాల్‌గా చెప్పాలంటే....జస్ట్ యావరేజ్ కామెడీ ఫిల్మ్.


నటీనటులు - ప్రిన్స్, జ్యోతిసేథ్, సంపూర్నేష్ బాబు, రావు రమేష్, జయప్రకాష్ రెడ్డి, ఆశిష్ విద్యార్ధి, సప్తగిరి, తాగుబోతు రమేష్, మధునందన్, రవిప్రకాష్, రవివర్మ, ప్రభాస్ శ్రీను, జెన్నిఫర్ (ఐటెం సాంగ్)...
కెమెరా - చిట్టిబాబు
ఎడిటింగ్ - మధు
సంగీతం - కమ్రాన్
మాటలు - సాయి, వెంకీ డీ పాటి
సమర్పణ - కృష్ణ బద్రి, శ్రీధర్ రెడ్డి
సహ నిర్మాత - హేమ వెంకట్
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు - అక్కినేని శ్రీనివాస రావు, బాలాజీ శ్రీను
బ్యానర్ - శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్
నిర్మాతలు - వేణు గోపాల్ రెడ్డి, లక్ష్మి నరసింహ రెడ్డి, ఆలూరి చిరంజీవి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - శ్రీనివాస్ రాగ

English summary
Check out Where is Vidya Balan Review and rating.
Please Wait while comments are loading...