twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Writer Padmabhushan Review గుండెను పిండేసే మదర్ సెంటిమెంట్.. సుహాస్ హిట్ కొట్టాడా?

    |

    Rating: 3/5

    నటీనటులు: సుహాస్, ఆశీష్ విద్యార్థి, రోహిణి, టినా శిల్పరాజ్, శ్రీ గౌరీ ప్రియరెడ్డి, గోపరాజు రమణ, ప్రవీణ్ కటారియా తదితరులు
    దర్శకత్వం: షణ్ముఖ ప్రశాంత్
    నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రూ మనోహరన్
    మ్యూజిక్: శేఖర్ చంద్ర, కల్యాణ్ నాయక్
    సినిమాటోగ్రఫి: వెంకట్ ఆర్ శాఖమూరి
    ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
    రిలీజ్ డేట్: 2023-02-03

    ఎప్పటికైనా గొప్ప రైటర్ కావాలని కలలుకనే పద్మభూషణ్ లైబ్రరీలో అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా పనిచేస్తుంటాడు. చివరకు కష్టపడి తొలి అడుగు అనే పుస్తకాన్ని రాసి.. నాలుగు లక్షలు అప్పు చేసి ప్రింట్ చేయిస్తాడు. అయితే ఆ పుస్తకానికి ఎలాంటి స్పందన లభించదు. దాంతో కష్టపడి ఆ పుస్తకాన్ని అమ్మించాలని, చదివించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. అలంటి సమయంలోనే మార్కెట్‌లోకి తన పేరు (Writer Padmabhushan)తో ఓ పుస్తకం రావడం, పాపులారిటీ లభించడం జరిగిపోతుంటుంది. ఆ క్రమంలో తన పేరుతో ప్రింట్ అయిన పుస్తకాన్ని చదివిన మామ (గోపరాజు రమణ) తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకొంటారు. వేరే వ్యక్తి రాసిన పుస్తకాన్ని తాను రాసినట్టు ఫీలయ్యే పద్మభూషణ్.. తన కాబోయే భార్యకు, మామకు అసలు విషయం చెప్పాలని అనుకొంటాడు.

    Writer Padmabhushan Review and Rating

    ఓ పుస్తకాన్ని రాయడానికి పద్మభూషణ్ ఎలాంటి కష్టాలు పడ్డాడు? తొలి అడుగు పుస్తకాన్ని మార్కెట్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అప్పు చేసిన పాపానికి ఎలాంటి సమస్యలు అనుభవించాడు. రైటర్ పద్మభూషణ్ పేరుతో పుస్తకం రాసిన వ్యక్తి ఎవరు? తన పేరుతో పుస్తకం రాసిన వ్యక్తిని పద్మభూషణ్ కనుకొన్నాడా? తాను రచయితను కాదని కాబోయే భార్య సారిక (టీనా)కు చెప్పాడా? కన్నాంబ (శ్రీ గౌరీ ప్రియ) ఎవరు? పద్మభూషణ్‌కు కన్నాంబకు ఎలాంటి సంబంధం ఉంది అనే ప్రశ్నలకు సమాధానమే రైటర్ పద్మభూషణ్ సినిమా కథ.

    నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ ఎంచుకొన్న పాయింట్, కథగా దానిని విస్తరించిన తీరు బాగుంది. అయితే రైటర్ పద్మభూషణ్ కథను, మొదటి నుంచి ఎమోషనల్‌గా చెప్పడంలో తడబాటు కనిపిస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్‌పై మరింతగా ఎలివేట్ చేయాల్సి ఉందనిపిస్తుంది. తొలిభాగం బాగా సాగదీసినట్టు అనిపించినా.. సుహాస్, ఆశీష్ విద్యార్థి, రోహిణి, టీనా లాంటి పాత్రలు ఆ లోపాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నించారు. సెకండాఫ్‌ కూడా రొటీన్ సన్నివేశాలతో సాగడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ చివరి 30 నిమిషాల్లో దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ చూపించిన ప్రతిభ, కథపై పట్టు సాధించి ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేయడంలో సక్సెస్ అయ్యాడు.

    Writer Padmabhushan Review and Rating

    పద్మభూషణ్‌గా పలు వేరియేషన్స్ ఉన్న పాత్రలో సుహాస్ ఒదిగిపోయాడు. కథ, కథనాలు రొటీన్‌గా ఉన్నా సుహాస్ తన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాను తన భుజాలపై మోసిన తీరు బాగుంది. నటనపరంగా ప్రతీ సినిమాకు తన ప్రతిభను మెరుగుపరుచుకొంటూ వెళ్లడం బాగుంది. నటుడిగా మరో మెట్టు ఎక్కరాని చెప్పవచ్చు. గోపరాజు ఆశిష్ విద్యార్థి, రోహిణి, టీనా, శ్రీగౌరి ప్రియ, ప్రవీణ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

    సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. శేఖర్ చంద్ర, కల్యాణ్ నాయక్ మ్యూజిక్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫి సినిమాకు హైలెట్. మిగితా సాంకేతిక అంశాలు సినిమాకు బలంగా నిలిచాయి. చాయ్ బిస్కెట్, లహరి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

    Writer Padmabhushan Review and Rating

    ఉన్నత స్థాయికి ఎదుగాలనుకొనే మిడిల్ క్లాస్ కుర్రాడి జీవితం, లవ్, ఎమోషన్స్ కూడిన చిత్రం రైటర్ పద్మభూషణ్. ఈ సినిమాకు మదర్ సెంటిమెంట్ ప్రాణంగా నిలిచింది. మధ్య తరగతి కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాలు సినిమాకు బలంగా నిలిచాయి. దర్శకుడు రాసుకొన్న స్క్రిప్టు, నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సిన్ వరకు గుండెను పిండేసే అంశాలు, సెంటిమెంట్ ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విభిన్నమైన సినిమాలను ఆదరించే వారికి, ఇష్టపడే వారికి రైటర్ పద్మభూషణ్ తప్పకుండా నచ్చుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. మంచి అనుభూతిని పొందుతారు. వారాంతంలో మంచి సినిమాను చూడాలనే వారికి ఈ చిత్రం కేరాఫ్ అడ్రస్.

    English summary
    Writer Padmabhushan is hits the theatres on February 3rd. Suhas, Tina, Gouri priya are in the lead role. Here is the Telugu filmibeat exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X