twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంగ్ గోపాల్ వర్మ మూవీ రివ్యూ: ఆర్జీవిపై మరో సినీ విమర్శనాస్త్రం

    |

    కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో సినీ నిర్మాణం ఓ పక్క ఆగిపోతే.. మరో పక్క రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రాలు.. మరో పక్క రాంగోపాల్ వర్మపై రూపొందించిన చిత్రాలు సందడి చేశారు. ఇటీవల కాలంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యవహార తీరుపై సినీ విమర్శనాస్త్రాలు సంధిస్తూ సినిమాలు రూపొంది ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశాయి. తాజాగా ఆర్జీవిని ఉద్దేశించి పరోక్షంగా సంధించిన విమర్శనాస్త్రం రాంగ్ గోపాల్ వర్మ చిత్రం. సీనియర్ జర్నలిస్టు ప్రభు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఈ చిత్రం డిసెంబర్ 4వ తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. రాంగ్ గోపాల్ వర్మ‌ చిత్ర ద్వారా దర్శకుడు ప్రభు ఎలా మెప్పించారనే విషయాన్ని ఓసారి చూద్దాం...

     రాంగ్ గోపాల్ వర్మ మూవీ కథ..

    రాంగ్ గోపాల్ వర్మ మూవీ కథ..

    ప్రముఖ దర్శకుడు రాజ్ గోపాల్ వర్మ (షకలక శంకర్) అంతా నా ఇష్టం అనే విధంగా ఒక రకమైన అహంకార పూరితంగా వ్యవహరిస్తుంటాడు. ఆయన స్పూర్తితో డైరెక్టర్ కావాలనే కోరికతో ఓ ఔత్సాహికుడు (కత్తి మహేష్) శిష్యరికం చేస్తుంటాడు. అయితే తన గురించి వచ్చిన ఓ ప్రతికూల కథనాన్ని తన శిష్యుడు (కత్తి మహేష్) మొబైల్‌లో చూస్తుండగా గమనించిన రాజ్ గోపాల్ వర్మ కోపగించుకొంటాడు. తన వద్ద ఉండటానికి వీలులేదని బయటకు పంపిస్తాడు. ఆ క్రమంలో శిష్యుడు వెళ్తూ.. శాపనార్థాలు పెడతారు. ఆ సమయంలో ఓ వ్యక్తి రాంగోపాల్ వర్మ జీవితంలోకి ప్రవేశిస్తాడు.

     రాంగ్ గోపాల్ వర్మ మూవీ ట్విస్టులు

    రాంగ్ గోపాల్ వర్మ మూవీ ట్విస్టులు

    రాజ్ గోపాల్ వర్మకు శిష్యుడు ఏ రకమైన శాపాలు పెడుతాడు? రాంగోపాల్ వర్మ జీవితంలోకి ప్రవేశించిదెవరు? ఇంతకు రాజ్ గోపాల్ వర్మకు తాను చేసే పనుల గురించి రియలైజ్ అయ్యారా? రాజ్ గోపాల్ వర్మకు ఎలాంటి గుణపాఠాన్ని నేర్పేందుకు కొందరు చేసిన ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్ర కథ.

    రాంగ్ గోపాల్ వర్మ మూవీ విశ్లేషణ

    రాంగ్ గోపాల్ వర్మ మూవీ విశ్లేషణ

    రాజ్ గోపాల్ వర్మ సినిమా టైటిల్ చూసినా.. తెరపైన కథ, కథనాలు చూస్తే ఇది పక్కాగా రాంగోపాల్ వర్మను టార్గెట్ చేస్తూ రూపొందించిన చిత్రమనేది సాధారణ ప్రేక్షకుడికి కూడా బోధపడుతుంది. అయితే రాజ్ గోపాల్ వర్మకు సంబంధించిన విషయాలను పక్కగా పరిశోధన చేసి.. అసభ్యత, అశ్లీలత, వ్యక్తిగత దూషణకు తావు లేకుండా సినిమాను రూపొందించడంలో జర్నలిస్టు ప్రభు పరిణితిని ప్రదర్శించారు. తనకున్న లిమిటెడ్ బడ్జెట్‌లో తెరమీద క్వాలిటీ చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఎక్కువ పాత్రలతో గందరగోళం చేయకుండా తాను చెప్పాల్సిన పాయింట్‌ను సూటిగా సుత్తి లేకుండా స్ట్రెయిట్‌గా చెప్పడంలో సఫలమయ్యారు. ఈ కథలో రాజ్ గోపాల్ వర్మను విమర్శించే పాత్ర విషయంలో ఇచ్చి ట్విస్టు సినిమాకు మరింత బలంగా మారింది. 2024లో ఆస్కార్ సాధించాలంటూ మరో పాయింట్‌ను ముడిపెట్టిన తీరు ఆయన ప్రతిభకు అద్దం పట్టిందని చెప్పవచ్చు.

    నటీనటుల గురించి

    నటీనటుల గురించి

    నటీనటులు ప్రదర్శన విషయానికి వస్తే... షకలక శంకర్, అభి, దర్శకుడు, నిర్మాత జర్నలిస్టు ప్రభు ప్రధానమైన పాత్రల్లో మెరిశారు. ముఖ్యంగా షకలక శంకర్ మరోసారి తనకు నచ్చిన పాత్రలో ఒదిగిపోయారు. పాత్రకు సంబంధించిన హావభావాలను అద్భుతంగా ఆవిష్కరించారు. ఆర్జీవిగా షకలక శంకర్ మరోసారి పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు. అభి, కత్తి మహేష్ పాత్రల నిడివి తక్కువైనా గుర్తుండిపోయే పాత్రలే అనిచెప్పవచ్చు. ఇక జర్నలిస్టు ప్రభు చివర్లలో గెస్ట్ అప్పీయరెన్స్‌తో సినిమాకు బలాన్ని అందించారు.

    Recommended Video

    Disha ఎన్కౌంటర్ సినిమా పై RGV క్లారిటీ
    సాంకేతిక విభాగాల పనితీరు..

    సాంకేతిక విభాగాల పనితీరు..

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు జర్నలిస్టు ప్రభు రాసిన మాటల స్పెషల్ ఎట్రాక్షన్. కథలో ఉండే సారం కారణంగా కథనం కూడా ఒక పరిమితి క్షేత్రంలో సాగుతుంది. ఇది కొంతమేరకు అసంతృప్తి అనిపించినా.. కథలో ఓ వేగంతో సాగే డైలాగ్స్ ఆ లోపాన్ని సరిదిద్దాయనే చెప్పవచ్చు. ఛాయాగ్రాహకుడు బాబు కెమెరా వర్క్ బాగుంది. సంగీత దర్శకుడు షకీల్ రూపొందించి టైటిల్ సాంగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగుంది. రాంగోపాల్ వర్మపై విమర్శనాస్త్రాలను సంధిస్తూ వచ్చిన చిత్రాల్లో రాంగ్ గోపాల్ వర్మ బెస్ట్ అని చెప్పవచ్చు. దర్శక, నిర్మాత ప్రభు ప్రయత్నం అభినందనీయం.

    English summary
    Wrong Gopal Varma movie review: Wrong Gopal Varma movie review is directed and produced by Journalist Prabhu. This is satarical movie on Popular director Ram Gopal Varma. This set to release on December 4th, 2020.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X