For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Yashoda Movie Review ఎమోషనల్, యాక్షన్ థ్రిల్లర్ యశోద.. సమంత కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్!

  |

  Rating: 3/5

  నటీనటులు: సమంత రుత్ ప్రభు, ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, సంపత్ రాజ్, శత్రు, దివ్య శ్రీపాద, కల్పిక గణేష్, ప్రియాంక శర్మ తదితరులు
  రచన, దర్శకత్వం: హరీ, హరీష్
  డైలాగ్స్: పులగం చిన్నారాయణ, డాక్టర్ భాగ్యలక్ష్మి
  నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్
  ఎడిటింగ్: మర్తాండ్ కే వెంకటేష్
  మ్యూజిక్: మణిశర్మ
  బ్యానర్: శ్రీదేవీ మ్యూవీస్
  రిలీజ్ డేట్: 2022-11-11

  యశోద కథేమిటంటే?

  యశోద కథేమిటంటే?

  తల్లిదండ్రులు లేని యశోద (సమంత రుత్ ప్రభు) తన సోదరి బృంద (ప్రీతి అస్రానీ)ను సొంత బిడ్డలా పెంచుతుంది. అయితే ప్రాణానికి ప్రాణంగా చూసుకొనే ప్రియకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఆపరేషన్‌కు చాలా డబ్బు అవసరం ఏర్పడుతుంది. చెల్లెల్ని రక్షించుకోవడానికి అవసరమయ్యే డబ్బు కోసం అద్దె గర్భం (సరోగసి) ద్వారా బిడ్డను కనేందుకు సిద్దమవుతుంది. ఈ క్రమంలోనే మిస్ ఇండియా అనుమానాస్పదంగా మరణిస్తుంది.

  యశోద మూవీలో ట్విస్టులు

  యశోద మూవీలో ట్విస్టులు

  సరోగసికి సిద్దమైన యశోదకు హాస్పిటల్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? యశోదతోపాటు ఫెసిలిటిలో ఉన్న లీలా (దివ్య శ్రీపాద), తేజు (కల్పిక) ఇతర మహిళలకు ఎదురైన సమస్యలు ఏమిటి? లీలాకు జరిగిన అన్యాయాన్ని యశోద ఎలా స్పందించింది? యశోదకు ఫిసిలిటీ నిర్వాహకురాలు మధుబాల (వరలక్ష్మీ శరత్ కుమార్), డాక్టర్ గౌతమ్ (ఉన్ని కృష్ణన్) ఎందుకు ఎదురు తిరిగారు? సరోగసి ఫెసిలిటీకి కేంద్ర మంత్రి (రావు రమేష్)కు సంబంధమేమిటి? మిస్ ఇండియా మరణం కేసును పోలీసుల ఆఫీసర్లు (శత్రు, సంపత్ రాజ్) ఎలా దర్యాప్తు చేశారు. యశోదకు, పోలీసుల దర్యాప్తుకు ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్నకు సమాధానమే యశోద సినిమా కథ.

  యశోద ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

  యశోద ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

  యశోద కథ అందాల పోటీలు, విదేశీ యువతి అనునమానాస్పద రీతిలో మరణించడమనే అంశంతో ఇంట్రెస్టింగ్ మొదలవుతుంది. వెంటనే మిస్ ఇండియా మరణించడం కథలో ఆసక్తిని రేపుతుంది. అయితే తొలి భాగంలో కథను, క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత దర్శకులు హరి, హరీష్ ఎక్కువగానే సమయం తీసుకొన్నారనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఆ తర్వాత సన్నివేశాలను పేర్చుకొంటూ వెళ్లిన తీరు సినిమాపై దర్శకులకు ఉన్న కమాండ్ తెలియజేసింది. ఇంటర్వెల్‌కు ముందు యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుంది. ఫస్టాఫ్‌లో కొంత స్లో నేరేషన్ ఉన్నప్పటికీ.. సమంత తన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాను క్రేజీగా మార్చింది.

  సెకండాఫ్‌లో సమంత విశ్వరూపం

  సెకండాఫ్‌లో సమంత విశ్వరూపం

  సెకండాఫ్‌లో కథ, సన్నివేశాలు చకచకా దూసుకుపోతాయి. సమంత యాక్షన్ సీన్స్, ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టాయి. ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, సత్యరాజ్, శత్రు ఫెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా మారాయి. చివర్లో సరోగ్రసి, సిస్టర్ సెంటిమెంట్ అంశాలు మూవీని చాలా ఎమోషనల్‌గా మారుస్తాయి. దాంతో యశోద ఫీల్ గుడ్ నోట్‌తో ముగుస్తుంది.

  సమంత కెరీర్ బెస్ట్

  సమంత కెరీర్ బెస్ట్

  నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. సమంత వన్ ఉమన్ షో. యాక్షన్, ఎమోషనల్ సీన్లలో కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో సమంతకు సంబంధించిన ట్విస్టు... ప్రేక్షకుల చేత విజిల్ కొట్టించేలా చేస్తుంది. క్లైమాక్స్ సమంత పెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుంది. ఇక ఈ సినిమాకు వరలక్ష్మీ శరత్ కుమార్ స్పెషల్ ఎట్రాక్షన్. రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టింది. సెకండాఫ్‌లో సమంత, వరలక్ష్మీ నువ్వా? నేనా అన్నట్టు నటించారు.

  అదరగొట్టిన ఉన్ని ముకుందన్, రావు రమేష్

  అదరగొట్టిన ఉన్ని ముకుందన్, రావు రమేష్

  మిగితా నటీనటులు విషయానికి వస్తే.. ఉన్ని ముకుందన్ సాఫ్ట్ అండ్ నెగిటివ్ షేడ్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. గౌతమ్ పాత్రలో ఆయన పలు వేరియేషన్స్ చూపించాడు. ఇక కేంద్ర మంత్రిగా రావు రమేష్ ఫెర్ఫార్మెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్. సంపత్ రాజ్ సినిమాను ఫర్‌ఫెక్ట్‌గా ముందుకు తీసుకెళ్లే పాత్రతో జస్టిఫై చేశారు. పోలీస్ ఆఫీసర్‌గా శత్రు చెలరేగిపోయాడు. మరోసారి మంచి పాత్రలో మెరిసాడు. ఇంకా చాలా మంది నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారని చెప్పవచ్చు.

   సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఆర్ట్ డైరెక్టర్ అశోక్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పలు రకాలు సెట్స్‌తో సినిమాను కలర్‌ఫుల్‌గా మార్చారు. ఆర్ట్ విభాగం పనితీరును సినిమాటోగ్రాఫర్ సుకుమారన్ అందంగా తెరపైన ఆవిష్కరించారు. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం బలంగా మారిందని చెప్పవచ్చు. పలు సన్నివేశాలను తన బీజీఎంతో టాప్ లేపాడు. ఎడిటింగ్, ఇతర విభాగాల పనీతీరు బాగున్నాయి. యానిక్ బెన్ ఫైట్స్ కంపోజిషన్ సినిమాకు హైలెట్.పులగం చిన్నారాయణ, భాగ్యలక్ష్మి అంలదించిన డైలాగ్స్ ఫస్టాఫ్‌లో ఎమోషనల్‌గా, సెకండాఫ్‌లో పవర్ ప్యాక్డ్‌తో బుల్లెట్స్‌లా పేలాయి.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  యశోద సినిమా టాప్ ఫెర్ఫార్మింగ్ ఆర్టిస్టులతో నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మంచి ఫీల్‌గుడ్ చిత్రాన్ని అందించారు. ఇప్పటి వరకు ఉన్నత ప్రమాణాలతో రూపొందించిన శ్రీదేవి మూవీస్.. మరోసారి తన బ్రాండ్‌ను కొనసాగించేలా యశోదను ప్రేక్షకులకు అందించారు. ఉన్నత సాంకేతిక అంశాలు, నటీనటుల ఎంపిక ఈ బ్యానర్‌కు సినిమాపై ఉన్న అభిరుచికి అద్దం పెట్టింది.

  యశోద ఫైనల్‌గా ఎలా ఉందంటే..

  యశోద ఫైనల్‌గా ఎలా ఉందంటే..

  సిస్టర్ సెంటిమెంట్, ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు కలబోసిన సినిమా యశోద. ఫస్టాఫ్‌లో కొంత స్లో నేరేషన్ తప్పితే.. సినిమా అంతా చకచకా సాగిపోతుంది. సమంత ఫెర్ఫార్మెన్స్, ఇతర నటీనటులు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సమంత కెరీర్‌లోనే బెస్ట్ సినిమాలో యశోద ఒకటిగా నిలుస్తుంది. అన్ని వర్గాలను ఆకట్టుకొనే అంశాలు పుష్కలంగా ఉంటాయి. థ్రిల్లింగ్, ఎమోషన్స్ కొత్త అనుభూతిని యశోద అందిస్తుంది.

  English summary
  Yashoda Movie Review: Check out samantha Ruth prabhus latest movie yashoda review in telugu which released on Nov 11th 2022. Here is the Telugu filmibeat Exclusive Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X