twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యువ - సమీక్ష

    By Staff
    |

    Yuva
    -జలపతి గూడెల్లి
    చిత్రం: యువ
    నటీనటులు: మాధవన్‌, సూర్య, సిద్దార్థ,
    మీరాజాస్మిన్‌, త్రిషా, ఈషా డియోల్‌, భారతీరాజా, తదితరులు
    సంగీతం: ఏ.ఆర్‌.రెహమాన్‌
    నిర్మాత: మధుమురళి
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మణిరత్నం

    మణిరత్నం. ఆయన సినిమాలు అనగానే అందరికీ ఆసక్తి. ఒక అద్భుతమైన చిత్రం చూస్తామని నమ్మకం ఉంటుంది. లేదా చిన్నపాటి క్లాసిక్‌లాంటి చిత్రాన్ని అందిస్తాడని ప్రధాన భావన. రెండేళ్ళ గ్యాప్‌ తర్వాత ఆయన రూపొందించిన 'యువ' - టేకింగ్‌ ఫార్మట్‌ విషయంలో అద్భుతాన్ని ప్రదర్శించినా, కథ లో బలం లేకపోవడంతో పెద్దగా పండలేదు. అమోరస్‌ పెర్రాస్‌ (Amores Perros) అనే ఓ మెక్సికన్‌( న్యూయర్క్‌ టైమ్స్‌ ఈ చిత్రాన్ని ఈ కొత్త శతాబ్దపు తొలి క్లాసిక్‌ చిత్రంగా అభివర్ణించింది) చిత్రంలోని ప్రధాన కథనాన్ని, ఫార్మట్‌ను తీసుకొని ఈ చిత్రాన్ని మణిరత్నం రూపొందించాడు.

    ఆ ఫార్మట్‌ ప్రథమార్థంలో అద్భుతంగా పనిచేసింది. కానీ ద్వితీయార్థంలో అసలు 'కథ', ఈ ముగ్గురి యువకుల 'మోటివ్స్‌' తెలిసే సమయానికి పేలవంగా మారింది. అదే ఈ సినిమాలో లోపం. క్లైమాక్స్‌ మరీ వీక్‌.

    అయితే, నేరేషన్‌లో కొత్తదనం, నటీనటులు అద్భుతమైన ఫెర్‌ఫెర్మాన్స్‌, రవి చంద్రన్‌ల సినిమాటోగ్రఫీ వల్ల సినిమా చాలా బాగా ఉన్నట్లు అన్పిస్తుంది. కానీ ప్రధానంగా 'రాజకీయాల్లోకి నవతరం రావాలి, యువకులను, విద్యార్థులను రాజకీయాల్లోకి రాకుండా రాజకీయనాయకులు అడ్డుకుంటున్నార'నే పాయింట్‌ పాతబడింది. ఈ పాయింట్‌ సినిమా ద్వితీయార్థంలో ప్రేక్షకుడికి తెలిసేంతవరకు 'యువ' చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఆ పాయింట్‌ అర్థమయిన పిదప, తర్వాతి సీన్లలోని డొల్లతనం వల్ల మణిరత్నం ప్రయాస వృథా అయినట్లే. గొప్ప కథకుడిగా పేరుగాంచిన మణిరత్నం ఈ సారి ఆ మాయాజాలాన్ని కథలో ప్రదర్శించలేకపోయారు.

    సినిమాలో గొప్పగా చెప్పుకునే అంశాలు మాధవన్‌, సూర్యలు పోటాపోటీ నటన. సూర్య స్టూడెంట్‌ పాత్రలో అద్భుతంగా చేశాడు. అతని ఫిజిక్‌, నడిచే విధానం ఆ పాత్రకు బాగా నప్పాయి. ఇంకా ప్రముఖ దర్శకుడు భారతీరాజా నటన హైలెట్‌గా నిలుస్తుంది.

    హీరోల ముగ్గురి ఇంట్రడక్షన్‌ మరీ పెద్దదిగా కాకుండా తక్కువగా కుదిస్తే బాగుండేది. సాంబ (మాధవన్‌) ఒక రౌడీ. అతని భార్య (మీరాజాస్మిన్‌) వద్దని ఎంత మొత్తుకొన్నా, రౌడీ వేషాలు వేస్తూనే ఉంటాడు. మైఖేల్‌ (సూర్య) పి ఎచ్‌డి విద్యార్థి. అమెరికాలో స్కాలర్‌షిప్‌ వచ్చినా వొదులుకొని, చనిపోయిన తన తండ్రి మాదిరిగా దేశాన్ని బాగుచేసే పని చేపడుతాడు. రాజకీయాల్లో చేరి దేశాన్ని మార్చాలనుకుంటాడు.

    అర్జున్‌ (సిద్దార్థ) అమెరికా వెళ్ళి లైఫ్‌ను ఎంజాయి చేయాలనుకుంటాడు. క్లబ్‌లో కలిసిన యువతి(త్రిషా)ని ప్రేమిస్తాడు. మైఖేల్‌ తనకి అడ్డంకిగా మారాడని భావించిన స్థానిక రాజకీయ నాయకుడు (భారతీరాజా) అతని అడ్డు తొలిగించే బాధ్యత సాంబకి అప్పచెపుతాడు. కానీ, మైఖేల్‌, అర్జున్‌, ఇంకొంతమందితో కలిసి ఉప ఎన్నికలలో పోటీకి దిగుతారు. సాంబకు బుద్దిచెప్పి, ఎన్నికలలో గెలుస్తారు. ఇదీ కథ.

    దీన్ని మణిరత్నం అమోరస్‌ పెర్రాస్‌ చిత్రంలోని నేరేషన్‌ను వాడుకొని ప్రథమార్థం చాలా ఆసక్తికరంగా చెప్పాడు. రెహమాన్‌ సంగీతం ఫర్వాలేదు. హీరోయిన్లలో మీరాజాస్మిన్‌ చాలా బాగా చేసింది. త్రిషా పాత్ర చిన్నదైనా క్యూట్‌గా ఉంది. ఈషాడియోల్‌ పాత్ర స్వల్పం. ఒకే ఒక్క డైరక్ట్‌ డ్యూయట్‌ తప్ప సినిమాలో పాటలను బ్యాక్‌గ్రౌండ్‌లోనే వాడుకోవడం విశేషం. మణిరత్నం 'మ్యాజిక్‌' మాత్రం అంతగా లేదు ఈ సినిమాలో.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X