»   » ఆకాశం లో ఫైటింగా?? దానికోసం 10 నిమిషాలకే 30 కోట్లట.. ప్రభాస్ మీద నమ్మకం మామూలుగా లేదు

ఆకాశం లో ఫైటింగా?? దానికోసం 10 నిమిషాలకే 30 కోట్లట.. ప్రభాస్ మీద నమ్మకం మామూలుగా లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రెండేళ్లుగా సాగుతున్న 'బాహుబలి' షూటింగ్ పూర్తిచేసుకున్న ప్రభాస్ తదుపరి చిత్రం కోసం తయారవుతున్నాడు. 'రన్ రాజా రన్' చిత్ర దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభంకానుంది. ఈ యువ దర్శకుడు ప్రభాస్ ని ఒక కొత్త అవతారంలో చూపించడానికి తగ్గ కధని ఎంచుకున్నాడు. ఈ కధకి ప్రభాస్ కొన్ని నెలల క్రితం ఓకే చెప్పినట్టు సమాచారం.,,ప్రస్తుతం బాహుబలి పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ సినిమా పూర్తి కాగానే ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాడు. ఇప్పటికే రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రభాస్ హోం ప్రొడక్షన్స్ యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

ఇప్పటికే కథాకథనాలు రెడీ అయిన ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. తొలిసారిగా ప్రభాస్ సరసన బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రతినాయక పాత్రకు బాలీవుడ్ హ్యాండ్సమ్ విలన్ ను ఎంపిక చేశారు. విజయ్ హీరోగా తెరకెక్కిన కత్తి సినిమాతో సౌత్ ప్రేక్షకులకు పరిచయం అయిన నీల్ నితిన్ ముఖేష్ ఈ సినిమాలో విలన్ గా నటించనున్నాడు. సుజిత్ గత సినిమా తరహాలోనే ప్రభాస్ సినిమా కూడా థ్రిల్లర్ జానర్ లో రూపొందుతోంది.

తాజా సమాచారం ప్రకారం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావస్తున్న ఈ చిత్రానికి సంభందించిన అధికారిక ప్రకటన త్వరలో నిర్మాతలు ఇవ్వనున్నారు. రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలో ప్రారంభంకానుంది. యు వి ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అయితే ఈ సినిమా గురించి వినిపిస్తున్న న్యూస్ మాత్రం టాలివుడ్ లోనే కల కలం రేపుతోంది.అదేమిటో తెలుసా ..??

 Rs 30 crore Budget for Sky Fight in Prabhas next movie

ప్రభాస్ 'బాహుబలి 2' తరువాత నటించే సినిమాలు ఈ స్టార్ స్థాయిని ఆకాశంలోకి తీసుకు వెళ్ళిపోయేలా ఆ సినిమాల నిర్మాతలు ఎత్తుగడలు వేస్తున్నారు. దీనికోసం నిజంగానే ఆకాశంలోకి తీసుకుపోయే విధంగా ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో నటిస్త్తున్న 150 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలో ఒక ఫైట్ ని ఆకాశంలో చిత్రీకరించాలనుకుంటున్నారట.అంతేకాదు ఆ ఫైట్ మొత్తం ఆకాశంలోనే జరుగుతుందని టాక్. ఈ భారీ ఫైట్ కోసం దాదాపు ముప్పయ్ కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసారని వార్తలు వస్తున్నాయి. దీని కోసం హాలీవుడ్ చిత్రాలకి పనిచేసిన స్టంట్ మాస్టర్ ని ఇప్పటికే హైర్ చేసుకున్నారని టాక్.

దీనికి సంబంధించిన ప్రాధమిక చర్చలు ఇప్పుడు జరుగు తున్నాయని తెలుస్తోంది. మొదట్లో ఈ సినిమాని యాభై కోట్ల పెట్టుబడిలో చేద్దామని అనుకున్నా ప్రభాస్ ప్రస్తుత రేంజ్ రీత్యా ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు నూట యాభై కోట్లకు చేరిన విషయం తెలిసిందే. బాహుబలి తో ప్రభాస్‌ ఎలాగు నేషనల్‌ స్టార్‌ అయిపోయాడు కాబట్టి ఈ సినిమాను హిందీలో, తమిళంలో, మలయాళంలో విడుదలచేసే విధంగా భారీ ప్లాన్స్ వేస్తూ ఈ సినిమా పై ఈ రేంజ్ లో ఖర్చు పెడుతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ కొత్త సినిమాకోసం ఒక్క ఫైట్ సీన్ కోసం 30 కోట్లు ఖర్చు పెడుతున్న వార్తలు బయటకు పొక్కతం తో టాలీవుడ్ మొత్తం షాక్ కి గురయ్యింది... వందల కోట్ల తో నిర్మించే సినిమాల దెబ్బకి చిన్న సినిమాల పరిస్థితి ఏం అవనుందో అన్న మాటలు కూడా వినపడుతున్నాయి...

English summary
30 crores budget for only one fight in Prabhas movie? Film Nagar sources say yes for the above question. After Bahubali 2 Prabhas is going to act under the direction of Sujeeth Singh. UV creations banner is producing this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X