Don't Miss!
- Sports
KL Rahul : కేఎల్ రాహుల్ పెళ్లిపై స్పందించిన టీంమేట్స్!
- News
హెచ్‌సీయూలో వివాదాస్పద మోడీ డాక్యుమెంటరీ కలకలం.. ఏబీవీపీ ఫిర్యాదుతో క్యాంపస్ లో టెన్షన్!!
- Finance
pm kisan: రైతులకు మోడీ సర్కారు శుభవార్త.. కోట్లాది మందికి ప్రయోజనం
- Lifestyle
Today Rasi Palalu 24 January 2023: ఈ రోజు మిథున రాశి వారికి శుభవార్తలు, ఆర్థిక పరిస్థి గొప్ప మెరుగుదల
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Akhil Agent నుంచి క్రేజీ అప్డేట్.. యాక్షన్ స్టంట్స్ తో అదరగొట్టిన అఖిల్!
సిసీంద్రి సినిమాతో చిన్నప్పుడే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు అక్కినేని వంశం మరో హీరో అఖిల్. టాలీవుడ్ కింగ్, మన్మథుడు అక్కినేని నాగార్జున- అమల ముద్దుల తనయుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు అఖిల్. మనం సినిమాలో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చి.. అఖిల్ మూవీతో హీరోగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ మూవీ అనుకున్నంతగా హిట్ కాలేదు. హలో, మిస్టర్ మజ్ను ఇవేవి అంత పేరు తీసుకురాలేదు. ఇటీవల మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ మూవీతో హిట్ ట్రాక్‌లో పడ్డాడు అఖిల్. ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు అఖిల్. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు.

2021లో చివరిసారిగా..
అక్కినేని నాగార్జున, శరత్ కుమార్, అమల నటించిన సూపర్ హిట్ మూవీ సిసీంద్రిలో బాబుగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు అఖిల్. అయితే ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అంతగా గుర్తింపు పొందలేకపోయాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు వరుసగా ఫ్లాప్ ల మీద ఫ్లాప్ లు ఇచ్చాయి. కానీ 2021లో చివరిసారిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ మూవీతో ఫస్ట్ టైమ్ హిట్ ట్రాక్‌లో పడ్డాడు. కానీ అఖిల్ కు మాత్రం అంతగా ఒరిగింది ఏం లేకుండా పోయింది. ఇక ఈ చిత్రంలో అఖిల్ సరసన హీరోయిన్గా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించిన విషయం తెలిసిందే.

కీలక పాత్రలో మమ్ముట్టి..
ఎలాగైన తన కెరీర్ లో గుర్తుంచుకునే సూపర్ హిట్ చిత్రం కోసం ప్రయత్నిస్తున్నాడు అక్కినేని అఖిల్. ఈసారి ఎలాగైన తిరుగులేని హిట్ కొట్టాలని తెగ కష్టపడిపోతున్నాడు. అందులో భాగంగానే అఖిల్ ప్రస్తుతం ఏజెంట్‌గా రానున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటించడం విశేషం. ఇదివరకు విడుదల చేసిన టీజర్ లో యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టాడు అఖిల్. ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. న్యూ ఇయర్ సందర్భంగా అఖిల్ ఏజెంట్ మూవీ మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
|
హాలీవుడ్ హిట్ సిరీస్ కు రీమేక్..
యాక్షన్
థ్రిల్లర్
గా
వస్తున్న
అఖిల్
ఏజెంట్
సినిమా
మేకింగ్
వీడియోలో
హై
రేంజ్
యాక్షన్
సన్నివేశాలు
చూపించారు.
అదిరిపోయే
యాక్షన్
సీక్వెన్స్
కోసం
అఖిల్,
సినిమా
బృందం
ఎంతలా
కష్టపడ్డారో
తెలుస్తోంది.
అఖిల్
చేసే
యాక్షన్
స్టంట్స్
ఆకట్టుకునేలా
ఉన్నాయి.
అలాగే
ఇందులో
అఖిల్
లుక్
కొత్తగా
ఉంది.
ఈ
సినిమాను
సమ్మర్
లో
విడుదల
చేసే
అవకాశాలు
ఉన్నట్లు
సమాచారం.
ఇక
ఈ
సినిమాలో
సాక్షి
వైద్య
హీరోయిన్
గా
నటిస్తోంది.
ఏకే
ఎంటర్టైన్
మెంట్స్
బ్యానర్
లో
అనిల్
సుంకర
ఈ
మూవీని
నిర్మిస్తున్నారు.
అఖిల్
స్పైగా
నటిస్తున్న
ఈ
మూవీ
హాలీవుడ్
హిట్
సిరీస్
'ది
బోర్న్
ఐడెంటిటీ'కి
రీమేక్
వెర్షన్
అని
టాక్
నడుస్తోంది.
మరి
అఖిల్
ఈ
సినిమాతో
అయినా
సాలిడ్
హిట్
కొడతాడో
వేచి
చూడాలి.