Don't Miss!
- Sports
INDvsAUS : నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న బుమ్రా.. ఆసీస్ టెస్టులకు రెడీనా?
- Lifestyle
Garuda Purana: ఈ చోట్ల భోజనం చేస్తే లేని పాపాలు అంటుకుంటాయి, అవేంటో తెలుసుకోండి
- News
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికపై వైఎస్ షర్మిల క్లారిటీ
- Technology
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- Finance
ghmc tax fraud: అలా పన్ను చెల్లించిన వారిపై GHMC ఆగ్రహం.. FIR నమోదుకు రంగం సిద్ధం
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Prabhas Project K మేకింగ్ వీడియో.. ఒక్క టైర్ కోసం కష్టపడుతున్న చిత్ర బృందం!
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో ఇంటర్నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్.. అప్పటి నుంచి భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటున్నాడు. ఇలా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఇప్పటికే ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రాజెక్ట్ కె విభిన్నంగా తెరకెక్కనుందని ఇదివరకే బజ్ క్రేయేట్ అయింది. ఇప్పుడు తాజాగా దానికి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

భారీ బడ్జెట్ చిత్రంగా..
జక్కన్న చెక్కిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. అందులో ఒకటే ప్రాజెక్ట్ కె. ఈ సినిమాకు ఎవడే సుబ్రమణ్యం, మహానటి సినిమాల దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ లో పెద్ద సంస్థల్లో ఒకటైన వైజయంతీ మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. సి. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె.. ప్రభాస్ సరసన జోడి కట్టనుంది. సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కెలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

స్క్రాచ్ నుంచి తయారు చేయాలి..
ఇక ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23న ఓ పోస్టర్ విడుదల చేసి సినిమాపై మరింత క్యూరియాసిటీ కలిగించారు. ప్రభాస్ ఒకకవచంతో గాలిలోకి దూసుకెళ్తున్నట్లు ఉంది ఆ పోస్టర్. ఇంకా ఆ పోస్టర్ పై హీరోలు పుట్టరు.. వాళ్లు ఎదుగుతారు అనే పదాలు ప్రభాస్ రోల్ ను ఎలివేట్ చేసేవిధంగా ఉన్నాయి. అలాగే ఈ సినిమాపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రాజెక్ట్ కె కోసం అన్నీ తామే (స్క్రాచ్) తయారు చేసుకోవాలి అని నాగ్ అశ్విన్ మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ స్క్రాచ్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

ఒక్క టైర్ కోసం..
ఈ వీడియోకు రీ ఇన్వెంటింగ్ ది వీల్ అని పేరు పెట్టారు. వీడియో ప్రారంభంలో సినిమా గురించి ఇదివరకు నాగ్ అశ్విన్ మాట్లాడిన మాటలను వినిపించారు. స్క్రాచ్ నుంచి తయారు చేయాలి అన్నాక స్క్రాచ్ అనే పదాన్ని రిపీట్ చేశారు. అప్పుడు 'ఫ్రమ్ స్క్రాచ్ ఎపిసోడ్ 1 రీ ఇన్వెంటింగ్ ది వీల్' అని చూపించారు. ఒక్క టైర్ కోసం ఇంత ఓవర్ చేస్తున్నారు. టైరు టైరు అంటారు షో రూమ్ కి వెళితే దండిగా దొరుకుతాయి అని టెక్నిషియన్స్ అనడం చూపించారు. ఈ వీడియో అంతా ఒక టైర్ ను ఎలా తయారు చేశారో చూపించారు. వీడియో చూస్తుంటే కేవలం ఒకే ఒక్క టైర్ కోసం సినిమా బృందం ఎంత కష్టపడిందో తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే సినిమాను ఎలా వర్కౌట్ చేయాలనే దానిపై ఎక్కువ వర్కౌట్ చేయాలని నాగ్ అశ్విన్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Starting our making series at the end of the year...
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 31, 2022
Here's the sneak peek into our world. #ProjectK
'𝐅𝐫𝐨𝐦 𝐒𝐤𝐫𝐚𝐭𝐜𝐡 𝐄𝐩 𝟏: 𝐑𝐞-𝐈𝐧𝐯𝐞𝐧𝐭𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐖𝐡𝐞𝐞𝐥': https://t.co/SjZmt5mPpD#Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/oCupUpc5Am