Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu : ఈరోజు ఏఏ రాశుల వారి జీవితాల్లో గ్రహాల శుభ స్థానం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది
- Sports
IND vs SA: రెండో ఇన్నింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ విఫలం.. భారీ ఆధిక్యం దిశగా భారత్!
- News
ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్ని గ్రామస్తులు: ఒకరు మాజీ బీజేపీ మైనార్టీ నేత, రూ. 5 లక్షల రివార్డ్
- Finance
Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..?
- Technology
BSNL కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జోడించింది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
Salaar: వీడియోతో సహా లీక్ చేసిన శృతి హాసన్.. మరీ ఇంత ఘాటుగానా?
రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మూడవ పాన్ ఇండియా సినిమా సలార్ కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అగుతుందని ప్రభాస్ అభిమానులు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. అయితే సలార్ సినిమాకు సంబంధించిన ఏదో ఒక ఫోటో లేదా వీడియో సోషల్ మీడియాలో లీక్ అవుతూనే ఉంది. ఇక రీసెంట్ గా శృతి హాసన్ కూడా ఒక ఆసక్తికరమైన అంశాన్ని లీక్ చేసింది. ఆ వీడియో వివరాల్లోకి వెళితే..

షూటింగ్ ఎంతవరకు వచ్చిందంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో బిగ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో సలార్ సినిమా కూడా టాప్ లిస్టులో ఉంది అని చెప్పాలి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాను అంచనాలకు తగ్గట్టుగానే ప్రశాంత్ తెరపైకి తీసుకు రాబోతున్నాడు. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ కూడా పూర్తయింది మిగిలిన షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.

సలార్ లీక్స్..
సలార్ సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయాలను ఇప్పటికే సోషల్ మీడియాలో లీకయ్యాయి. ప్రభాస్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తండ్రి గానే కాకుండా కొడుకు పాత్రలో కూడా ప్రభాస్ కనిపిస్తాడు అని అలాగే దర్శకుడు ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా ఆ మధ్య కథనాలు వెలువడ్డాయి. ఆ వార్తలపై ఇప్పటివరకు దర్శకుడు అయితే ఎలాంటి క్లారిటీ ఇచ్చింది లేదు.

శృతిహాసన్ గ్లామర్ రోల్
ఇక సలార్ సినిమాలో శ్రుతిహాసన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ పాత్ర కూడా ఈ సినిమాలో చాలా భిన్నంగా ఉంటుంది అని సమాచారం. ఆమెది ఒక జర్నలిస్టు పాత్ర అని కూడా చిత్ర యూనిట్ ముందుగానే క్లారిటీ ఇచ్చింది. ఇక గ్లామర్ విషయంలో కూడా శ్రుతిహాసన్ ఈ సినిమాలో అంతకుమించి అనేలా షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

వీడియోతో లీక్
అయితే ఈ సినిమాలో శృతిహాసన్ ఒక యాంగిల్ లో ట్రెడిషినల్ గా కనిపిస్తూనే మరొక యాంగిల్ లో చాలా గ్లామరస్ గా కనిపిస్తుందట. అయితే అందుకు సంబంధించిన లుక్ ను శృతి హాసన్ వీడియో తో సహా సోషల్ మీడియాలో లీక్ చేసింది. ఆమె చాలా రఫ్ లుక్ తో కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా గ్లామరస్ అందాలతో కూడా నెటిజన్లకు షాక్ ఇచ్చింది.
|
సోషల్ మీడియాలో వైరల్
తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో శృతి హాసన్ పోస్ట్ చేసిన ఆ వీడియో నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయింది. షూటింగ్ లో ఉన్నాను అంటూ సలార్ టైటిల్ ను కూడా ప్రస్తావించింది. తడిసిన జుట్టుతో ఆమె రఫ్ లుక్ ఆశ్చర్యపరిచింది అనే చెప్పాలి. చూస్తుంటే శృతి హాసన్ కూడా ఈ సినిమాలో హైలెట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలి అని అనుకుంటున్నారు.