Just In
- 3 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 3 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 4 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 5 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2020లో విడుదలవుతున్న ఆఖరి సినిమా SBSB.. సంక్రాంతి గేమ్ చెంజర్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత 8 నెలల నుంచి సందడి లేదు. ఓటీటీలో కూడా పెద్ద సినిమలేవి పెద్దగా హిట్ టాక్ అందుకోలేదు. దీంతో అక్కడ డైరెక్ట్ రిలీజ్ పై కొంత ఎఫెక్ట్ పడింది. ఇక ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో మొదట రిలీజ్ కాబోయే సినిమాపైనే అందరి చూపు పడింది. ఆ సినిమానే సోలో బ్రతుకే సో బెటర్. ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చిన్నా పెద్దా తేడా లేకుండా స్టార్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు.

ఓటీటీలో రిలీజ్ చేస్తారని అనుకుంటే..
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను BVSN ప్రసాద్ నిర్మించగా కొత్త దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేశాడు. ఎప్పుడో సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక ఓటీటీలో మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు నిర్మాత చివరి క్షణంలో ఒప్పుకున్నాడు. కానీ థియేటర్స్ ఓపెన్ అవ్వడంతో జీ సంస్థతోనే ఒప్పందం కుదుర్చుకొని థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమయ్యారు.

ఆ క్లారిటీ కోసమే.. అందరి ఎదురుచూపులు
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా ప్లాప్ అయితే పండగ చేసుకునే వారు కూడా ఉంటారని కొందరు ప్రముఖులే చెప్పారు. అయితే ఇప్పుడు మాత్రం సోలో బ్రతుకే సో బెటర్ లాక్ డౌన్ తరువాత విడుదల కానున్న మొదటి సినిమా కాబట్టి ఈ సినిమా సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకంటే జనాలు థియేటర్స్ కు ఎంతవరనే విషయంలో ఈ సినిమాతో కొంత వరకు క్లారిటీ వస్తుంది.

ఇండస్ట్రీ మొత్తం.. సినిమాకు సపోర్ట్ గా
దీంతో సోలో బ్రతుకే సో బెటర్ కు వచ్చే రెస్పాన్స్ ను బట్టి చాలా మంది వారి భవిష్యత్తును డిసైడ్ చేసుకొనున్నట్లు తెలుస్తోంది. దాదాపు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా వెనకాల నిలబడినట్లేనని అర్ధమవుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్క స్టార్ వారి తరహాలో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

గేమ్ చెంజర్ కానుందా?
ఇక సోలో బ్రతుకు హిట్టవ్వలని ఎక్కువగా కోరుకుంటున్నది మాత్రం సంక్రాంతికి రానున్న హీరోలనే చెప్పాలి. ఈ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ కు ఒక గేమ్ చెంజర్ కాబోతోందనే చెప్పాలి. సినిమా రిజల్ట్ ను బట్టి రాబోయే సినిమాల నిర్మాతలు వారి స్థాయిలో థియేటర్స్ ను బుక్ చేసుకుంటారు. ఏ ఏరియాలో ఎలాంటి ప్రభావం ఉంది అని విషయంలో కూడా ఒక క్లారిటీ వస్తుంది.

సోలో బ్రతుకే సో బెటర్ హిట్టయితే..
ఇక సంక్రాంతికి రామ్ రెడ్, రవితేజ క్రాక్ అలాగే అల్లరి నరేష్ బంగారు బుల్లోడు, ఇంకా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు రానున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ హిట్టయితే కలెక్షన్స్ బావున్న ఏరియాల్లో ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎక్కువ థియేటర్స్ లో విడుదల అవుతాయి. మరి ఆ సినిమా ఎలాంటి మార్పును తెస్తుందో చూడాలి.