For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందంతో అదరగొడుతున్న హీరోయిన్ ఆసిన్.. పెళ్లి తర్వాత ఫోటోలు చూస్తే షాకే..

|

సినీ పరిశ్రమలో కెరీర్ తారాస్థాయిలో ఉండగానే పెళ్లి చేసుకొని సంసార బాధ్యతలను తలకెత్తుకొన్న హీరోయిన్లలో ఆసిన్ ఒకరు. మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అక్కడ నుంచి తెలుగు, తమిళ భాషల్లో పేరు తెచ్చుకొని హిందీ భాషలో తన సత్తాను చాటుకొన్నారు. అయితే భారీ చిత్రాలు, అగ్ర హీరోలతో ఆఫర్లను సొంతం చేసుకొంటున్న సమయంలో హఠాత్తుగా సినీ పరిశ్రమకు గుడ్‌బై చెప్పడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశారు. మళ్లీ చాలా రోజుల తర్వాత కేరళలోని ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకొనే ఓనమ్ పండుగ సందర్భంగా ఆసిన్ మళ్లీ మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. ఇంతకు ఎలా మళ్లీ మీడియాలోకి వచ్చారంటే..

గతేడాది కూతురి ఫోటోతో

గతేడాది కూతురి ఫోటోతో

గతేడాది ఓనం పండుగ సందర్భంగా తీసిన తన కూతురు అరిన్ ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయడంతో మళ్లీ మీడియాలోకి ఎక్కారు. గతేడాది ఓనం సందర్భంగా తన కూతురుకు 10 నెలలు. ఈ ఏడాది అక్టోబర్ 24 తేదీకి రెండు సంవత్సరాల వయసును పూర్తి చేసుకొంటుంది అని ఆసిన్ పేర్కొన్నారు.

భర్తతో ఓనం పండుగ సందర్భంగా

భర్తతో ఓనం పండుగ సందర్భంగా

ఆసిన్ మరో ఆసక్తికరమైన పోస్టు కూడా చేశారు. తన భర్త రాహుల్ శర్మతో కలిసిన ఫోటోను షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకొన్నారు. మిలమిల మెరుస్తున్న శ్వేతవర్ణ దుస్తుల్లో కనిపించిన ఆసిన్ దంపతులు ఫోటోకు ఫోజిచ్చారు. ఆసిన్ ఆ ఫోటోలో ఇంకా అందంగా కనిపించడం గమనార్హం.

ఆసిన్, రాహల్ పెళ్లి విచిత్రంగా

ఆసిన్, రాహల్ పెళ్లి విచిత్రంగా

ఇక రాహుల్‌ శర్మతో పెళ్లి చాలా చిత్రంగా జరిగిందని ఓ సందర్భంలో ఆసిన్ చెప్పారు. అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన హౌస్‌ఫుల్ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో రాహుల్, అసిన్ కలుసుకొన్నారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింది. 2016 జనవరి 19న వారిద్దరూ పెళ్లి చేసుకొన్నారు.

రాహుల్ శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే

రాహుల్ శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే

రాహుల్ శర్మ విషయానికి వస్తే.. మైక్రోమ్యాక్స్ మొబైల్ కంపెనీకి అధినేతగా ఉండేవారు. ప్రస్తుతం రివోల్డ్ ఇంటెలీ కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఎలక్ట్రానిక్ బైక్స్ కంపెనీకి సీఈవోగా ఉన్నారు. ఎలక్ట్రానిక్ బైక్స్‌ బిజినెస్‌ను విస్తరించే పనిలో ఉన్నాడు.

టాలీవుడ్‌లో ఆసిన్

టాలీవుడ్‌లో ఆసిన్

ఇక ఆసిన్ విషయానికి వస్తే.. తెలుగులో అమ్మ, నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, లక్ష్మీ నర్సింహా, ఘర్షణ, చక్రం చిత్రాల్లో నటించారు. తమిళంలో అమ్మ, నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి తదితర చిత్రాల్లో నటించింది.

బాలీవుడ్‌లో

బాలీవుడ్‌లో

హిందీలో కొన్ని చిత్రాల్లో నటించినా సక్సెస్ రేట్‌ను ఎక్కువగానే సంపాదించుకొన్నారు. గజని రీమేక్, లండన్ డ్రీమ్స్, రెడీ రీమేక్, హౌస్‌పుల్ 2, బోల్ బచ్చన్, ఖిలాడీ 786, ఆల్ ఈజ్ వెల్ చిత్రాల్లో నటించింది.

ఏడు భాషల్లో ఆసిన్ ప్రావీణ్యం

ఏడు భాషల్లో ఆసిన్ ప్రావీణ్యం

ఆసిన్ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయం ఒకటుంది. ఆమె మంచి నటియే కాకుండా ఇతర విషయాల్లో ప్రతిభావంతురాలు. ఆసిన్ ఏడు భాషల్లో ప్రావీణ్యం ఉంది. మలయాళం, తమిళం, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్ భాషలను అనర్గళంగా మాట్లాడుతుంది. అంతేకాకుండా ఇటలీ భాషలో కూడా తెలుసు.

English summary
Asin Thotukmal-Rahul Sharma Couple are celebrating Onam festival. Asin shared a throwback photo of Arin from last year’s Onam celebration, when she was just 10 months old. #throwback to last year- Arin’s 1st Onam, 10months old #ourlilprincess, Asin captioned the photo. Arin, who turns two on October 24, 2019, is dressed in lehenga-style traditional Mundu, flashing the most adorable smile.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more