For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Akhanda ఈవెంట్‌కు బన్నీతో పాటు మరో స్పెషల్ గెస్ట్: ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా హిట్టే

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీపై కరోనా మహమ్మారి చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమకు అపారమైన నష్టం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో చిత్రసీమకు భారీ హిట్ కావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ మధ్య వచ్చిన 'వకీల్ సాబ్' బాక్సాఫీస్‌కు ఊపిరిపోసింది. మళ్లీ దాని తర్వాత ఆ రేంజ్ చిత్రాలు రాలేదు. ఈ నేపథ్యంలో సెకెండ్ వేవ్ తర్వాత భారీ స్థాయిలో విడుదల కాబోతున్న చిత్రమే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జరగనుంది. దీనికి అల్లు అర్జున్‌తో పాటు మరో స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ లెజెండ్ సెంటిమెంట్‌ను గుర్తు చేస్తున్నారు. ఆ వివరాలు మీకోసం!

   సింహా.. లెజెండ్ తర్వాత అఖండగా

  సింహా.. లెజెండ్ తర్వాత అఖండగా

  'సింహా', 'లెజెండ్' వంటి భారీ హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న చిత్రమే 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. పూర్ణ, శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఇది డిసెంబర్ 2న విడుదల కాబోతుంది.

  బైసెక్సువల్‌గా మారబోతున్న సమంత: విడాకులు తర్వాత సంచలన ప్రకటన.. తెలుగులో ఎవరూ చేయని విధంగా!

  వాటి వల్ల బాగా పెరిగిన అంచనాలు

  వాటి వల్ల బాగా పెరిగిన అంచనాలు

  క్రేజీ కాంబోలో వస్తున్న 'అఖండ' మూవీ నుంచి ఇప్పటి వరకూ ఎన్నో రకాల అప్‌డేట్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ వీడియో ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కూడా భారీ స్పందనను దక్కించుకుంది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

   బిజినెస్ భారీగా... గ్రాండ్‌గా రిలీజ్

  బిజినెస్ భారీగా... గ్రాండ్‌గా రిలీజ్

  'అఖండ' మూవీపై ఆరంభంలో పెద్దగా అంచనాలు లేవు. కానీ, రెండు టీజర్లు విడుదలైన తర్వాత అవి అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమాను కొనేందుకు చాలా మంది బయ్యర్లు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. మొత్తంగా బాలయ్య కెరీర్‌లోనే ఇది భారీ బిజినెస్‌ను జరుపుకుంది.

  మళ్లీ రెచ్చిపోయిన అషు రెడ్డి: ఎద అందాలు మొత్తం కనిపించేలా.. వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకుంటారా!

   ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్

  ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతోన్న 'అఖండ' మూవీని డిసెంబర్ 2న ప్రేక్షకులు ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు ఇక, ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఓ రేంజ్‌లో ప్లాన్ చేశారు. ఇది నవంబర్ 27 అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో జరగబోతుంది.

  ఎన్టీఆర్ రావట్లేదు... ఐకాన్ స్టార్‌తో

  ఎన్టీఆర్ రావట్లేదు... ఐకాన్ స్టార్‌తో

  అంగరంగ వైభవంగా జరగనున్న 'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. అలాగే, అతడితో పాటు నాని కూడా వస్తాడని అన్నారు. కానీ, ఈ వార్తల్లో నిజం లేదని చిత్ర యూనిట్ తేల్చేసింది. అంతేకాదు, దీనికి చీఫ్ గెస్టుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నట్లు కూడా ప్రకటించి షాకిచ్చింది.

  Bigg Boss Elimination: లీకైన 12వ వారం అఫీషియల్ ఓటింగ్.. మారిన టాప్ పొజిషన్.. ఆ ఇద్దరిలో ఒకరు బయటకు!

  బన్నీతో పాటు మరో స్పెషల్ గెస్ట్

  బన్నీతో పాటు మరో స్పెషల్ గెస్ట్

  పండుగలా జరగబోతున్న 'అఖండ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్‌తో పాటు మరో స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆయన మరెవరో కాదు.. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన టాలీవుడ్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి. అవును.. ఆయన కూడా ఈ వేడుకకు రాబోతున్నారు. దీంతో ఈ ఈవెంట్ మరింత స్పెషల్‌గా మారిపోయింది.

  ఆ సెంటిమెంట్ ప్రకారం ఇదీ హిట్టే

  ఆ సెంటిమెంట్ ప్రకారం ఇదీ హిట్టే

  'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి గెస్టుగా వస్తుండడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అదేమిటంటే.. బోయపాటి, బాలయ్య కాంబోలో వచ్చిన 'లెజెండ్' మూవీ ఈవెంట్‌కు కూడా జక్కన్న గెస్టుగా వచ్చారు. అది సూపర్ హిట్ అయింది. దీంతో ఇది కూడా సక్సెస్ అవుతుందని అంటున్నారు.

  English summary
  Nandamuri Balakrishna Now Doing Akhanda Movie Under Boyapati Srinu Direction. Allu Arjun and S. S. Rajamouli to Attend This Movie Pre Release Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X