Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
బుల్లి సైరా ఎంత బాగున్నాడో.. ఎంతైనా అల్లువారి ట్రైనింగ్ కదా!!
పండుగేదైనా సరే అల్లువారి సందడి ప్రత్యేకంగా ఉండాల్సిందే. అల్లు పిల్లల అల్లరి లేకుంటే సోషల్ మీడియా చిన్నబుచ్చుకుంటుంది. ప్రతీ పండగకు అల్లు చిచ్చర పిడుగులు చేసే అల్లరి ప్రత్యేకంగా ఉంటే.. స్వాతంత్ర్య దినోత్సవం నాడు చేసే రచ్చ ఇంకో లెవెల్‌లో ఉంటుంది. ఇండిపెండెన్స్ డేకు త్యాగాలు చేసిన మహాత్ముల వేషాలను వేసుకుని అలరిస్తారు. ప్రతీసారి ఏదో ఒక గెటప్‌లో అల్లు పిల్లలు సందడి చేస్తారు. ఈసారి మాత్రం రెండు భిన్న గెటప్‌లో దర్శనమిచ్చారు అల్లు పిడుగులు.
నేటి 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ తన కుమారుడిలో దేశ భక్తిని నింపే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా అల్లు అర్హను మదన్ మోహన్ మాలవ్య వేషదారణను వేయించారు. ఆపై తాత చిరును ప్రసన్నం చేసుకునేలా అల్లు అయాన్‌ను తయారు చేశాడు. ఇక బన్నీ తాజాగా వీడియోను రిలీజ్ చేస్తూ ఓ డైలాగ్‌ను ట్వీట్ చేశాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటించిన సైరా చిత్రంలోని చిరు గెటప్‌ను ధరించాడు అయాన్. ఇక సైరా వేషంలో ఉన్న అయాన్.. తాతలాగే డైలాగ్ చెప్పే ప్రయత్నం చేశాడు. గెటవుట్ ఆఫ్ మై మదర్ లాండ్ అంటూ చిరు ఎంతో గంభీరంగా చెప్పిన డైలాగ్.. అల్లు పిల్లోడు తన స్టైల్లో వాయించేశాడు. ఇక ఈ వీడియోను అటు బన్నీ, ఇటు మెగా ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. నా భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకుందాం జై హింద్ అని అల్లు అర్జున్ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.