Don't Miss!
- News
ప్రతీ ఇంటా "మా నమ్మకం నువ్వే జగన్"...!!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ప్రతి మగాడు అలా ఆలోచించాలి.. సపరేట్ సెషన్ చేస్తాను.. భర్తపై అనసూయ కామెంట్స్
బుల్లితెరపై యాంకర్‌గా వెండితెరపై అద్బుతమైన నటిగా అందరి అభిమానాన్ని సంపాదించుకుంది. బుల్లితెరపై గ్లామర్ ఒలకబోస్తూనే వెండితెరపై తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఇక డ్యాన్సులు చేయడంలోనూ అనసూయ తనకు తానే సాటి. అనసూయ చేసే స్పెషల్ సాంగ్స్ ఓ రేంజ్‌లో క్లిక్ అవుతుంటాయి. ఇక అనసూయ సోషల్ మీడియాలో చేసే కామెంట్లు ఎంతగా వివాదాన్ని రేకెత్తిస్తుంటాయో అందరికీ తెలిసిందే.

సోషల్ మీడియాలో అలా..
అనసూయ సోషల్ మీడియాలో చేసే కామెంట్లు ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసే అనసూయ తనపై వచ్చే కామెంట్లు, ట్రోల్స్‌కు అంతే స్థాయిలో ఘాటుగా కౌంటర్లు ఇస్తుంటుంది.తాజాగా ఉమెన్స్ డే స్పెషల్‌గా అనసూయ కొన్ని కామెంట్లు చేసింది.

స్పెషల్ వీడియో..
ఉమెన్స్ డే స్పెషల్‌గా కొన్ని ప్రశ్నలకు అనసూయ సమాధానం ఇచ్చింది. యాక్టర్ కాకపోయి ఉంటే ఏం చేస్తుండేది.. సమాజంలో మగవాళ్లు ఎలా ఉండాలి.. ఇలాంటి కొన్ని ప్రశ్నలకు అనసూయ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో అనసూయ తన భర్త గురించి ఎంతో గొప్పగా చెప్పేసింది.

అలా ఆలోచించాలి..
ఒక మహిళగా మగాళ్ల ఆలోచనలు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? అని అడిగిన ప్రశ్నకు.. చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ కావాలి. ప్రతి మగాడు మా ఆయనలా ఆలోచించాలని నేను అనుకుంటాను. నా భర్త అని చెప్పట్లేదు.. ఆయన చాలా బాగా ఆలోచిస్తారు. ఎప్పుడైనా ఆయన్ని కూర్చోబెట్టి నేను సెపరేట్ సెషన్ చేస్తాను అని అనసూయ చెప్పుకొచ్చింది.

ప్రేమ వివాహాం..
ఇక అనసూయ సుశాంక్ భరద్వాజ్ ప్రేమ కథ అందరికీ తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్ల ప్రేమ.. పెళ్లిగా మారిందని చెప్పుకొచ్చింది. అయితే ప్రేమ వివాహానికి ఎన్నో అడ్డంకులు కూడా ఏర్పడ్డాయని ప్రతీ సందర్భంలో ఆయనెంతో సపోర్ట్ చేశారని అనసూయ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్, డిప్రెషన్‌లోకి వెళ్లిన సమయంలో ఎంత అండగా ఉన్నాడో కూడా చెప్పుకొచ్చింది.