Just In
- 8 min ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 2 hrs ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
Don't Miss!
- News
ఇంగితజ్ఞానం ఉన్నవాళ్లు ఆ పనిచేయరు... దమ్ముంటే కేసీఆర్ దానిపై ప్రకటన చేయాలి : సంజయ్ సవాల్
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సీరియల్ నటుడు ప్రభాకర్‌ను చంపేందుకు బయల్దేరాడట.. కొడుకు నిజ స్వరూపం బయటపెట్టిన సుమ
యాంకర్ సుమ తాజాగా కొన్ని విషయాలను వెల్లడించింది. అలీ హోస్ట్‌గా వచ్చే ఓ షోలో పాల్గొన్న సుమ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలను చెప్పుకొచ్చింది. ఈ మూడు నెలల లాక్ డౌన్ కాలంలో ఎలా గడిపింది? ఇంట్లోని పరిస్థితుల గురించి, మహిళల గురించి ఎన్నో విషయాలను తెలిపింది. అందులో భాగంగా గతంలో జరిగిన ఓ సంఘటనను, తన కుమారుడి ప్రవర్తన గురించి ఎవ్వరికీ తెలియన సంగతులను కూడా బయట పెట్టేసింది. ఇంతకీ సుమ చెప్పిన సంగతులేంటో ఓ సారి చూద్దాం.

లాక్ డౌన్‌లో అలా..
లాక్ డౌన్‌లో తన ఇంటి పరిస్థితుల గురించి సుమ వివరించింది. మొదటి నెల ఏం కావాలో అడిగి మరి వండి పెట్టానని, రెండో నెలలో తాను వండింది మాత్రం తినాలని ఆదేశించినట్టుగా తెలిపింది. ఇక మూడో నెలలో అసలు వండను అని చెప్పినట్టుగా తెలిపింది. రోజూ అవే కూరగాయాలు, వాటితో కొత్తగా వండి పెట్టడం మామూలు విషయం కాదని, ఇంట్లో ఉండి రోజు పని చేసే వారు మామూలోళ్లు కాదని చెప్పుకొచ్చింది.

పాటలు, డ్యాన్స్‌లు..
లాక్ డౌన్ సమయంలో సుమ ఎంతగా హల్చలో చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లోని పెంపుడు కుక్క ముందు చేసిన రాములో రాములో డ్యాన్స్ గురించి ఓ సీక్రెట్ చెప్పింది. డ్యాన్స్ చేయడం ప్రారంభించిన వెంటనే కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయిందని.. మళ్లీ తిరిగి వచ్చి అక్కడ కూర్చుందని తెలిపింది. అది ఎడిట్ చేసిన వీడియో అని మళ్లీ చెప్పుకొచ్చింది.

కొడుకు గురించి..
యాంకర్ సుమకు కొడుకు గురించి ఎవ్వరికీ తెలియని నిజాలను తాజాగా బయటకు చెప్పుకొచ్చింది. తన కొడుకు తన గురించి ఎక్కువగా ఆలోచిస్తాడని, తనకు మాత్రం తాను సొంతమని ఫీల్ అవుతాడని, పొసెసివ్ నెస్ ఎక్కువని కొడుకు గురించి చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు తన కొడుకు చేష్టల గురించి కూడా పేర్కొంది.

ప్రభాకర్‌ను చంపేందుకు..
తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో టీవీ సీరియల్స్‌లో నటించేనాటి విషయాలను చెప్పుకొచ్చింది. ఓ సీన్‌లో ప్రభాకర్ తాను నటించామని, అది తన కుమారుడు చూసి ఉండబట్టలేకపోయాడని తెలిపింది. వంటింట్లోకి వచ్చి కత్తి తీసుకుని అతన్ని వేసేయడానికి వెళ్తున్నానని చెప్పాడట. చిన్నప్పుడు అలాగే ఉండేవాడని, సీరియల్స్‌లో, సినిమాల్లో నటించొద్దని అనేవాడట. తానంటే పొసెసివ్ ఎక్కువని తన కొడుకు గురించి చెప్పుకొచ్చింది.