twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతడు 15: పవన్, శోభన్ బాబు రిజెక్ట్.. మహేష్ కోసం 3ఏళ్ళు ఎదురుచూసిన త్రివిక్రమ్!

    |

    త్రివిక్రమ్ శ్రీనివాస్ యొక్క అసలైన బలాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా అతడు. కాపీ క్యాట్ అనే ఆరోపనలు ఎన్ని వచ్చినా కూడా త్రివిక్రమ్ మేకింగ్ లో మాత్రం ఎలాంటి తేడా కనిపించలేదు. నిజానికి అలాంటి సినిమా ఈ రోజుల్లో వచ్చి ఉంటే ఇండస్ట్రీలో ఒక సంచలన విజయాన్ని అందుకునేది. అతడు సినిమా విడుదలయ్యి నేటితో 15 ఏళ్లవుతోంది. సోషల్ మీడియాలో అభిమానులు సినిమాకి సంబంధించిన స్పెషల్ లుక్స్ ని వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ఆ సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలపై ఒక లుక్కేస్తే..

    Recommended Video

    Sarkaru Vaari Paata : Reason Behind Mahesh Babu Tattoo
    పవన్ కళ్యాణ్ తో చేయాలని..

    పవన్ కళ్యాణ్ తో చేయాలని..

    రచయితగా బిజీగా ఉన్న సమయంలో ఎలాగైనా డైరెక్షన్ చేయాలని అనుకున్న త్రివిక్రమ్ మొదట నువ్వే నువ్వే అనే సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం మాస్ డైరెక్టర్ గా మారాలని 2002లోనే అతడు కథను రెడీ చేసుకున్నాడు. కథ పూర్తవగానే మొదట త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి వినిపించాడు. కానీ పవన్ కళ్యాణ్ అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు.

    మహేష్ కోసం మూడేళ్లు..

    మహేష్ కోసం మూడేళ్లు..

    పైగా అతడు కథ చెబుతుండగా పవన్ కళ్యాణ్ నిద్రపోయాడు అని ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ చెప్పాడు. అనంతరం మహేష్ బాబుకి వినిపించడంతో వెంటనే చేద్దామని ఒప్పేసుకున్నాడు. కానీ అప్పుడు ఎస్ జె.సూర్య నాని సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఆలస్యం అవుతుందని అన్నాడు. అయినప్పటికీ త్రివిక్రమ్ పట్టు వడాలకుండా మూడేళ్ళ వరకు వెయిట్ చేశాడు.

    రిజెక్ట్ చేసిన శోభన్ బాబు

    రిజెక్ట్ చేసిన శోభన్ బాబు

    ఇక ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా త్రిష సెలక్ట్ కాగా సోనూ సూద్ ముఖ్య పాత్రలో నటించారు. అనంతరం నాజర్ చేసిన గ్రాండ్ ఫాదర్ పాత్ర కోసం మొదట శోభన్ బాబును అనుకున్నారు. కానీ ఆయన అప్పుడే సినిమాలకు చాలా దూరంగా ఉన్నారు. నిర్మాత మురళి మోహన్ చెక్ పంపినా కూడా మళ్లీ ఆయన వెనక్కి పంపించేశారు.

    క్యారెక్టర్ సినిమాలో హైలెట్

    క్యారెక్టర్ సినిమాలో హైలెట్

    రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో అప్పుడు బిజీగా ఉండడం వలన శోభన్ బాబు ఆ పాత్ర చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అనంతరం నాజర్ ని ఫైనల్ చేసి sp.బాలసుబ్రహ్మణ్యం చేత వాయిస్ ఓవర్ ఇప్పించారు. ఆ క్యారెక్టర్ సినిమాలో హైలెట్ గా నిలిచింది.

    అభినందించిన పవన్

    అభినందించిన పవన్

    మొత్తంగా సినిమా 2005 ఆగస్ట్ 10న భారీ స్థాయిలో విడుదల అయ్యింది. కొన్ని చోట్ల మిక్సీడ్ టాక్ వచ్చినప్పుటికీ కలెక్షన్స్ డోస్ తగ్గలేదు. అతడు నెవర్ బిఫోర్ అనేలా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ మహేష్స్ త్రివిక్రమ్ ని ప్రత్యేకంగా కలుసుకొని విశేస్ అందించారు. అతడు సినిమా ఇప్పటికి టీవీలలో వచ్చినా మంచి రేటింగ్ అనుకుంటోంది.

    English summary
    Athadu film that introduced the real strength of Trivikram Srinivas to the industry. No matter how many allegations of copycat were made, there was no difference in the making of Trivikram. In fact if such a film had come out these days it would have received a sensational success in the industry. It has been 15 years since the movie was released. Fans on social media are going viral with special looks related to the movie. If you take a look at some of the interesting things related to the movie..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X