Don't Miss!
- News
YS విజయమ్మతో భేటీ అయిన అవినాష్ రెడ్డి
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Finance
Sebi: 19 సంస్థలకు షాక్ ఇచ్చిన సెబీ.. సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం..
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
ఎన్టీఆర్ కుటుంబానికి ఆగస్టు శాపం... ఇప్పటివరకు ఆయన సంతానంలో ఎంతమంది చనిపోయారంటే?
విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా తెలుగు ప్రజలందరూ భావించే దివంగత నందమూరి తారక రామారావు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన నలుగురు కుమార్తెలలో చిన్న కుమార్తె అయిన కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని హైదరాబాద్ లోని తన నివాసంలో మరణించారు. ఉమామహేశ్వరి ఆత్మహత్య నేపద్యంలో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. అయితే ఈ నేపథ్యంలో గతంలో ఎన్టీఆర్ సంతానంలో ఇప్పటి వరకు ఎంత మంది కన్నుమూశారు? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

ఆగస్టు నెల
నందమూరి తారక రామారావు కుమార్తెలలో చివరి కుమార్తె అయిన కంఠమనేని ఉమామహేశ్వరి కన్ను మూయడంతో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ షాక్కు గురైంది. సుమారు నాలుగేళ్ల క్రితం హరికృష్ణ కార్ యాక్సిడెంట్ లో ఇదే ఆగస్టు నెలలో కన్నుమూసిన ఘటన మరువక ముందే ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో నందమూరి కుటుంబ సభ్యుల సహా వారి అభిమానులైతే ప్రస్తుతం షాక్ లోనే ఉన్నారు. గతంలో నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీ స్థాపించిన సమయంలో ఏర్పడిన ఆగస్టు సంక్షోభం గుర్తుచేసుకొని ఆ కుటుంబానికి ఆగస్టు నెల కలిసి రావడం లేదని అదొక శాపంలా మారిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద ఎత్తున చర్చ
నిజానికి ఎన్టీఆర్ సంతానం ఎంత మంది? అందులో ఎంతమంది మరణించారు? ప్రస్తుతం ఎంతమంది బతికి ఉన్నారు అనే విషయం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నందమూరి తారక రామారావు బసవతారకం దంపతులకు మొత్తం 12 మంది సంతానం. అయితే వారిలో సీనియర్ రామకృష్ణ చాలా చిన్న వయసులోనే ఒక అరుదైన వ్యాధి వచ్చి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. రామకృష్ణ మరణించిన సమయంలో ఎన్టీఆర్ ఒక సినిమా షూటింగ్లో ఉన్నట్లు కూడా చెబుతూ ఉంటారు. ఆయన జ్ఞాపకాలతో చాలా కాలం పాటు ఎన్టీఆర్ మళ్ళీ మనిషి కాలేదని ఆ తర్వాత పుట్టిన కొడుకుకు కూడా జూనియర్ రామకృష్ణ అని పేరు పెట్టుకున్నారని చెబుతూ ఉంటారు.

రోడ్డు ప్రమాదంలో
ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ సంతానంలో ఐదో కుమారుడు సాయి కృష్ణ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. 2004వ సంవత్సరంలో ఆయన అనారోగ్య కారణాలతో కన్నుమూయగా తండ్రి బతికి ఉన్న సమయంలో ఆయన ఆయనకు సంబంధించిన పర్సనల్ విషయాలు చూసుకుంటూ ఉండేవారు. ఇక హరికృష్ణ గురించి ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ కుమారుడిగా సినీరంగ ప్రవేశం చేయడమే కాక అనేక సూపర్ హిట్ సినిమాలు కూడా అందుకున్నారు. చేసింది కొన్ని సినిమాలు అయినా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యారు. తర్వాత రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఆయన అక్కడ కూడా తన మార్క్ చాటుకున్నారు. ఆయన 2018 ఆగస్టు 29వ తేదీన రోడ్డు జరిగిన రోడ్డు ప్రమాదంలో అశువులు బాశారు.

12 మంది సంతానం
ఎన్టీఆర్ కుమార్తెల విషయానికి వస్తే ఆయనకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు గారపాటి లోకేశ్వరి, రెండో కుమార్తె పేరు దగ్గుబాటి పురందేశ్వరి, మూడో కుమార్తె పేరు నారా భువనేశ్వరి ఇక నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి. గత కొన్నాళ్లుగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆమె డిప్రెషన్కు గురవు గురయ్యారని, ఇంట్లో తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కి చున్నీతో ఉరి వేసుకున్నారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రస్తుతం ఈ విషయం మీద పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ కు 12 మంది సంతానం. వారిలో 8 మంది మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు ఇందులో ముగ్గురు కుమారులు అంటే హరికృష్ణ, సాయి కృష్ణ, రామకృష్ణ కన్నుమూయగా ఇప్పుడు తాజాగా ఉమామహేశ్వరి కన్నుమూశారు. అంటే 12 మంది సంతానంలో నలుగురు కన్నుమూశారు అన్నమాట.

బుధవారం నాడు
ఎన్టీఆర్ కుటుంబంలో మరో విషాదం కూడా కొన్నేళ్ల క్రితం జరిగింది. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ కూడా ఒక రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఇక వీరు కాకుండా నందమూరి తారక రామారావు నాన్నగారు లక్ష్మయ్య చౌదరి కూడా ఎన్టీఆర్ బాగా స్థిరపడిన తరువాత ఒక రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. తరువాత ఎన్టీఆర్ వారసులలో ఒకరైన ఎన్టీఆర్ మనవరాలిని ఒక సీనియర్ ప్రొడ్యూసర్ ఇంటికి కోడలిగా పంపిస్తే అక్కడ ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా సంచలనంగా మారింది. అయితే ఉమామహేశ్వరి అంత్యక్రియలు బుధవారం నాడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

బయటకు వెళ్లి
అందులో ఒక కుమార్తె అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఆమె హైదరాబాద్ చేరుకోవడానికి బుధవారం వరకు సమయం పడుతుందని చెబుతున్నారు. ఇక రెండో కుమార్తెకు ఇటీవలే వివాహం జరిపించగా ఆమె తన భర్తతో కలిసి బాచుపల్లిలో నివసిస్తున్నారు. బోనాలు సందర్భంగా ఆమె తల్లినివాసానికి వచ్చారని అప్పుడే ఈ దుర్ఘటన జరిగిందని తెలుస్తోంది. కంఠమనేని శ్రీనివాసరావు అనే అమెరికాలో పనిచేస్తున్న లెక్చరర్ ను ఉమామహేశ్వరి గతంలో రెండో వివాహం చేసుకున్నారు. అయితే గత కొన్నాళ్లుగా వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లిన ఆయన ఉమామహేశ్వరి మరణ వార్త తెలుసుకుని హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. సుమారు మూడు రోజుల నుంచి ఆయన వ్యాపార నిమిత్తం బయట ఉన్నారని తెలుస్తోంది.