2020లోనూ మోక్షం కలగలేదు.. భారీ బడ్జెట్ చిత్రాలకు నిరాశ

కరోనా వల్ల ఈ 2020 మొత్తం అతలాకుతలమైంది. సినీ పరిశ్రమ మాత్రం కోలుకోని విధంగా దెబ్బతింది. ఈ ఏడాది ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు రావాల్సి ఉంది. మామూలుగా అయితే ఈ ఏడాది బాక్సాఫీస్ మోత మోగిపోయేది. కానీ కరోనా రావడం, లాక్డౌన్ పెట్టడంతో అంతా తారుమారైంది. మామూలుగానే పెద్ద సినిమాలన్నీ ఆలస్యమవుతూ, షెడ్యూల్స్ క్యాన్సిల్స్ అవుతుంటాయి. అలాంటి వాటిపై లాక్డౌన్ పెద్ద దెబ్బ కొట్టింది.

ఆర్ఆర్ఆర్, ఆచార్యలు చిత్రాలు అలా వాయిదా పడుతూనే వచ్చాయి. లాక్డౌన్ వల్ల మొత్తానికే మూలన పడ్డాయి. ఆరేడు నెలలు అన్నీ బంద్ కావడంతో ముందు వేసుకున్న లెక్కలన్నీ మారిపోయాయి. లేదంటే దసరా పోటీల్లో భారీ బడ్జెట్ చిత్రాలు దిగేవి. ఆచార్య ఈ పాటికే బాక్సాఫీస్‌పై యుద్దం చేసేది. మరో వైపు కేజీయఫ్ చాప్టర్ 2 కూడా రెడీ అయ్యేది. కానీ ఇవేవీ షూటింగ్‌లను పూర్తి చేసుకోలేకపోయింది.

Bad Phase For RRR acharya And KGF Chapter 2 In 2020 Year

ఒక్క కేజీయఫ్ మాత్రమే రీసెంట్‌గా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇక ఆచార్య, ఆర్ఆర్ఆర్‌లు ఇంకా చిత్రీకరణలోనే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఆచార్యను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ అది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి. మొత్తానికి ఈ ఏడాది మాత్రం భారీ చిత్రాలకు నిరాశనే మిగిల్చింది. చిన్న చిత్రాల్లో కొన్ని ఓటీటీ బాట పట్టి మంచి హిట్లుగా నిలిచాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X