For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తమన్నా సింహాద్రి... మస్తాన్‌గా పుట్టి బిగ్‌బాస్‌షో వరకు, చిరంజీవితో ఆ కోరిక తీరేదెప్పుడు?

  |
  Bigg Boss Telugu 3 : Who's Tamanna Simhadri ? Check Out Her Biography || Filmibeat Telugu

  నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 3 రియాల్టీ షో నుంచి నటి హేమ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. హేమ హౌస్ నుంచి బయటకు వచ్నిన వెంటనే ఇంట్లోకి ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.

  గతంలో శ్రీడ్డి కాస్టింగ్ కౌచ్ గొడవ సమయంలో హాట్ టాపిక్ అవ్వడంతో పాటు, ఆ తర్వాత ఏపీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేశ్‌పై పోటీ చేసి వార్తల్లో నిలిచిన తమన్నా సింహాద్రి... బిగ్ బాస్ షోలో అవకాశం దక్కించుకోవడం చర్చనీయాంశం అయింది. ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? కుటుంబ నేపథ్యం ఏమిటనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

  తమన్నా సింహాద్రి ఎక్కడ పుట్టారు?

  తమన్నా సింహాద్రి ఎక్కడ పుట్టారు?

  తమన్నా సింహాద్రి కృష్ణ జిల్లా అవని గడ్డ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆమె పెదనాన్న సింహాద్రి సత్యనారాయణ టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు. తమన్నా తండ్రి సింహాద్రి నాగేశ్వరరావు వ్యవసాయం చేస్తారు. చిన్నప్పటి నుంచి స్క్రీన్ మీద తనను తాను చూసుకోవాలి ఆశపడే తమన్నాకు బ్యూటీ, డాన్స్, యాక్టింగ్ అంటే చాలా పిచ్చి.

  ఇంట్లో కూర్చొని సాధారణంగా బ్రతకడం ఇష్టం లేక

  ఇంట్లో కూర్చొని సాధారణంగా బ్రతకడం ఇష్టం లేక

  గతంలో ఓ ఇంటర్వ్యూలో తమన్నా సింహాద్రి మాట్లాడుతూ... ‘‘ఇంట్లో కూర్చొని సాధారణంగా బ్రతక కూడదు అని బయటకు వచ్చాను. హైదరాబాద్ వచ్చి సినిమాల్లో ట్రై చేశాను. అవకాశాలు రాక పోవడంతో ముంబై వెళ్లిపోయాను. అక్కడ జాబ్ చేసుకుంటూ వి కేర్ కంపెనీ వారు ఫ్యాషన్ షో పెడితే వెళ్లాను. అక్కడ ఫస్ట్ ప్లేస్ నాకే వచ్చింది. 2010లో టైమ్స్ ఆఫ్ ఇండియాతో పాటు అన్ని పత్రికల్లో ఆ న్యూస్ కవర్ అయింది'' అని తెలిపారు.

  అందుకే మళ్లీ హైదరాబాద్ బాట..

  అందుకే మళ్లీ హైదరాబాద్ బాట..

  ఎన్ని రోజులు ఇతర రాష్ట్రంలో ఉండటం.. మన సొంతం రాష్ట్రంలో ఏదైనా చేయాలని డిసైడ్ అయ్యాను. అలా హైదరాబాద్ తిరిగి వచ్చాను. ఆ సమయంలోనే శ్రీరెడ్డి పరిచయం అవ్వడం, తన ఉద్యమంలో నేనూ చేరడం జరిగింది. తెలుగు అమ్మాయికి అండగా ఉండాలని ఆమెకు సపోర్ట్ చేశాను. అయితే అది అబద్దమైన పోరాటం అని తెలిసి, డబ్బుకు అమ్ముడైపోతున్న వ్యక్తి అని తెలియడంతో అందులో నుంచి బయటకు వచ్చినట్లు తమన్నా వెల్లడించారు.

  తమన్నా సింహాద్రి అసలు పేరు సింహాద్రి మస్తాన్

  తమన్నా సింహాద్రి అసలు పేరు సింహాద్రి మస్తాన్

  నా అసలు సింహాద్రి మస్తాన్... ఇంటి పేరు సింహాద్రి, అమ్మానాన్నలు పెట్టిన పేరు మస్తాన్. మేము హిందూస్, కాపు సామాజిక వర్గం. గుంటూరులో మస్తాన్ బాబా దర్గా ఉంది. నాన్నకు అబ్బాయి కావాలని ఉండేది, అమ్మకు అమ్మాయి పుట్టాలని ఉండేది. ఇద్దరూ దర్గా వద్ద మొక్కుకున్నారు. దేవుడు కన్ ఫ్యూజ్ అయ్యాడో ఏమో నేను పుట్టాను. నాకు తెలిసి నేను మా మమ్మీ కోరిక తీర్చినట్లు వెల్లడించారు.

  హీరోయిన్ తమన్నాను చూసి పేరు పెట్టుకోలేదు

  హీరోయిన్ తమన్నాను చూసి పేరు పెట్టుకోలేదు

  ముంబై వెళ్లి తర్వాత లింగ మార్పిడి చేయించుకున్నాను. హీరోయిన్ తమన్నా ఇండస్ట్రీకి రాక ముందే నేను ఆ పేరు పెట్టుకున్నాను. ఆమెను చూసి పెట్టుకున్నా పేరు కాదు, ఆపరేషన్ తర్వాత నా పేరు మస్తాన్ నుంచి తమన్నాగా మార్చుకుని ఇంటి పేరు సింహాద్రిని కలుపుకున్నట్లు తెలిపారు.

  చిరంజీవితో స్టెప్ వేయాలని కోరిక

  చిరంజీవితో స్టెప్ వేయాలని కోరిక

  చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. నువ్వు రంభలా ఉన్నావు అంటే ఆనంద పడిపోయేదాన్ని. చిరంజీవిగారితో కలిసి స్టెప్స్ వేయాలనే కోరిక నా జీవితంలో మిగిలిపోయింది. మలయాళంలో మమ్ముట్టి గారితో చేసే అవకాశం వచ్చింది. తెలుగులో కూడా అలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు తమన్నా తెలిపారు.

  English summary
  Transgender woman, Tamanna Simhadri has made a historic entry into the Bigg Boss Telugu 3 show. Check out Tamanna biography. Her real name is Mastan. A native of Krishna district.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X