Don't Miss!
- News
ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఇంటికి వెళ్లిన జగన్ దంపతులు
- Finance
Twitter Blue: శుభవార్త చెప్పిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ బ్లూ ఖాతాదారులకు కనకవర్షం..
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
BookMyShow Top Movies 2021: పవన్‌ను దాటేసిన అల్లు అర్జున్.. కుర్ర హీరోలకు షాకిచ్చిన బాలయ్య
తెలుగు సినీ ఇండస్ట్రీపై కరోనా వైరస్ చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ మహమ్మారి వల్ల గత సంవత్సరంతో పాటు ఈ ఏడాది కూడా లాక్‌డౌన్లు విధించారు. దీంతో నెలల తరబడి సినిమాల షూటింగులు నిలిపోవడంతో పాటు థియేటర్లు కూడా మూతపడ్డాయి. దీంతో చాలా మంది నిర్మాతలకు నష్టాలు ఎదురవడంతో పాటు ఇండస్ట్రీలను నమ్ముకున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల కూడా సినిమాల కోసం ఎంతగానో వేచి చూశారు. దీంతో ఈ ఏడాది వచ్చిన వాటిని చూసేందుకు పోటీ పడ్డారు. ఇందుకోసం బుక్‌మైషోలో ఎక్కువ టికెట్లను బుక్ చేసుకున్నారు. ఇలా 2021లో ఎక్కువ టికెట్లు బుక్ అయిన చిత్రాల జాబితాపై ఓ లుక్కేద్దాం పదండి!

ఈ జాబితాలో మొదటి స్థానం పుష్పదే
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం 'పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఇటీవలే వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఇక, ఈ ఏడాది బుక్‌మైషోలో ఎక్కువ టికెట్లు బుక్ అయిన తెలుగు చిత్రాల జాబితాలో ఇది మొదటి స్థానంలో నిలిచింది.
హాట్
ఫోజులతో
షాకిచ్చిన
రష్మిక
మందన్నా:
చీరకొంగును
పక్కకు
జరిపి
మరీ..
ఆమెనిలా
చూస్తే
తట్టుకోలేరు!

రెండవ స్థానంలో నిలిచిన వకీల్ సాబ్
సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రమే 'వకీల్ సాబ్'. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఇది కూడా భారీ విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ మూవీ పింక్‌కు ఇది రీమేక్‌గా వచ్చింది. ఇక, ఈ ఏడాది బుక్‌మైషోలో ఎక్కువ టికెట్లు బుక్ అయిన తెలుగు చిత్రాల జాబితాలో ఇది రెండవ స్థానంలో నిలిచి సత్తా చాటింది.

మూడో స్థానానికి చేరుకున్న బాలయ్య
చాలా కాలంగా హిట్ కోసం వేచి చూస్తోన్న బాలకృష్ణ నటించిన తాజా చిత్రమే 'అఖండ'. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక, ఈ ఏడాది బుక్‌మైషోలో ఎక్కువ టికెట్లు బుక్ అయిన తెలుగు చిత్రాల జాబితాలో ఇది మూడవ స్థానాన్ని సొంతం చేసుకుంది.
హాట్ సెల్ఫీ వీడియో వదిలిన శ్రీరెడ్డి: బట్టలన్నీ తీసి పడేసి.. బాగా పెరిగిపోయాయి అంటూ!

నాలుగో స్థానంలో మన జాతి రత్నాలు
నవీన్ పోలిశెట్టి హీరోగా.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'జాతి రత్నాలు'. అనుదీప్ కేవీ తెరకెక్కించిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇది కూడా సూపర్ హిట్ అయింది. ఇక, ఈ ఏడాది బుక్‌మైషోలో ఎక్కువ టికెట్లు బుక్ అయిన తెలుగు చిత్రాల జాబితాలో ఇది నాలుగో స్థానంలో నిలిచింది.

ఉప్పెన సృష్టించి ఐదో స్థానానికి చేరిక
మెగా కాంపౌండ్ నుంచి ఈ ఏడాది 'ఉప్పెన' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు పంజా వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. అంచనాలు లేకుండానే వచ్చి ఈ సినిమా భారీ సక్సెస్‌ను అందుకుంది. ఇక, ఈ ఏడాది బుక్‌మైషోలో ఎక్కువ టికెట్లు బుక్ అయిన తెలుగు చిత్రాల జాబితాలో ఐదో స్థానంలో ఉంది.
ప్రియుడి నగ్న ఫొటోను షేర్ చేసిన శృతి హాసన్: అతడి ముందు అలా కూర్చుని.. పరువు తీసేసిందిగా!

డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయిగా
తెలుగులో నేరుగా విడుదలైన సినిమాలే కాకుండా.. డబ్ అయిన కొన్ని చిత్రాలు కూడా ఈ ఏడాది సత్తా చాటాయి. అందులో ముందుగా విజయ్ నటించిన 'మాస్టర్', శివ కార్తికేయన్ 'డాక్టర్', రజినీకాంత్ 'అన్నత్తే' మూవీలకు సైతం తెలుగులో భారీగానే టికెట్లు బుక్ అయ్యాయి. దీంతో ఇవి కూడా ఈ ఏడాది బుక్‌మైషో బెస్ట్ మూవీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.