twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జగదేకవీరుడు’ అద్బుతాన్ని ప్లాన్ చేయలేం.. ‘అతిలోక సుందరి’ అలా జరిగిందంతే.. చిరు కామెంట్

    |

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఖలేజాలో చెప్పిన ఓ డైలాగ్ గుర్తుండే ఉంటుంది. అద్భుతం జరగకముందు ఎవ్వరూ గుర్తించలేరు.. జరిగిన తరువాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు. అదే వరుసలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ మాటను చెప్పాడు. మ్యాజిక్ అనే దాన్ని ప్లాన్ చేయలేం.. అలా జరుగుతుంది అంతే అంటూ నాటి క్లాసిక్ జగదేక వీరుడు అతిలోక సుందరి గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. మే 9నాటికి ఈ చిత్రం విడుదలై ముప్పై ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది.

    విశాఖ దుర్ఘటనపై టాలీవుడ్ సంతాపం.. మనసును కలిచివేసింది.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్విశాఖ దుర్ఘటనపై టాలీవుడ్ సంతాపం.. మనసును కలిచివేసింది.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్

    సెలెబ్రేషన్స్ మొదలు..

    సెలెబ్రేషన్స్ మొదలు..

    క్లాసిక్ జగదేక వీరుడు అతిలోక సుందరికి ముప్పై యేళ్లు నిండుతున్న సందర్భంగా ఇప్పటికే సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ చిత్రం గురించి ఎవ్వరికీ తెలియని మూడు నిజాలు చెబుతామని వైజయంతీ మూవీస్ ప్రకటించింది. అందులో భాగంగా మొదటి విషయాన్ని మే 5న విడుదల చేసింది.

    Recommended Video

    30 Years Of Classic Jagadekaveerudu Athiloka Sundari, Here’s The 1 St Story Behind Film
    కథ అలా మొదలైంది..

    కథ అలా మొదలైంది..

    జగదేకవీరుడు కథను రచయిత అయిన శ్రీనివాస్ చక్రవర్తి రాఘవేంద్రరావుతో చెప్పాడట. ఆ లైన్ నచ్చడంతో ఈ చిత్రాన్ని అక్కడ భీజం పడిందట. అలా ఈ కథలోకి జంధ్యాల, విజయేంద్ర ప్రసాద్, యండమూరి వీరేంద్రనాథ్ వంటి వారు వచ్చి చేరారట. ఇక నేడు మరో విషయాన్ని తెలుపనున్నారు. అంతుకు మునుపే చిరు స్పందించి.. నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.

    సమష్టి కృషికి నిదర్శనం..

    జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా రిలీజై మే 7తో 30 ఏళ్లు పూర్తి చేసుకోబోతోన్న సందర్భంగా చిరు మాట్లాడుతూ.. ఈ చిత్రంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేసాడు. సినిమా అనేది సమిష్ఠి కృషి ఫలితం అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ చిత్ర విజయంలో ప్రతి ఒక్కరి కృషి దాగుంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్, నటీనటులు తమ ప్రతిభను కనబరిచినందుకే జగదేకవీరుడు అతిలోకసుందరి తెలుగు సినిమా క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిపోయిందన్నాడు.

    టైమ్ లెస్ సినిమా..

    టైమ్ లెస్ సినిమా..

    తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ 25 చిత్రాల్లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు తప్పక స్థానం ఉంటుందన్నాడు. ఇది పాత తరం సినిమా.. కొత్త తరం సినిమా అనే తేడా లేకుండా అన్ని తరాలను అలరించే టైమ్ లెస్ క్లాసిక్ అని ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టమని చెప్పుకొచ్చాడు.

    English summary
    Chiranjeevi About 30 Years Of Jagadeka Veerudu Athiloka Sundari. Magic can not be planned. It just happens! When Magic happens on celluloid, it leaves lasting memories and ever lasting happiness!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X