twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటుడిగా ‘ప్రాణం’ పోసుకున్న రోజు.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్

    |

    మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రస్థావించకుండా తెలుగు సినిమా చరిత్రను రాయలేం.. చెప్పలేం. అప్పటి వరకు ఉన్న ట్రెండ్‌ను ఒక్కసారిగా మార్చేశాడు. యాక్షన్, డైలాగ్స్, డ్యాన్సులు, స్టైల్ ఇలా ప్రతీ ఒక్క విషయంతో తెలుగు సినిమా గతిని మార్చేశాడు. డైనమిక్ హీరో, సుప్రీం హీరో అంటూ ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ స్థాయికి చేరుకున్నాడు. చిరంజీవి నటుడిగా ప్రస్థానం మొదలై నేటికి 42 ఏళ్లు అవుతోంది. నేడు (సెప్టెంబర్ 22) చిరంజీవి మొదటి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలైన రోజు.

    ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. నా జీవితంలో ఆగస్ట్ 22కి ఎంత ప్రాముఖ్యత వుందో సెప్టెంబర్ 22కి కూడా అంతే ప్రాముఖ్యత వుంది.. ఆగస్టు 22న నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజైతే.. సెప్టెంబర్ 22న నటుడిగా 'ప్రాణం' (ఖరీదు) పోసుకున్న రోజు. నా తొలి చిత్రం విడుదలైన రోజు. నన్ను యింతగా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన నా అభిమానులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను' అని పోస్ట్ చేశాడు.

    Chiranjeevi As An Actor Completes 42 years

    ఇక సోషల్ మీడియాలో ఈ మేరకు విషెస్ వెల్లువెత్తున్నాయి. నటుడిగా 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నందుకు సినీ ప్రముఖులు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. ఈ మేరకు మెహర్ రమేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. నిరంతరం కష్టపడే తత్త్వం, అంకిత భావం, ఇన్‌స్పిరేషన్, హృదయాలను కొల్లగొట్టిన విజేత.. వెండితెర రారాజు అంటూ మెగాస్టార్ చిరంజీవిని ఆకాశానికిత్తేశాడు. ఇక మెహర్ రమేష్ తదుపరి ప్రాజెక్ట్ చిరంజీవితో ఫిక్స్ అయిందన్న సంగతి తెలిసిందే.

    English summary
    Chiranjeevi As An Actor Completes 42 years, BornAsAnActor ForeverGrateful PranamKhareedu thisdaythatyear.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X