గోవిందుడు అందరివాడేలే.. ఆ స్టార్ హీరో ఫ్యామిలీ చేయాల్సింది.. ఎందుకు రిజెక్ట్ చేశారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాల నడుమ విడుదలై ఆ తరువాత ఊహించని రిజల్ట్ ను అందుకున్న సినిమాల్లో గోవిందుడు అందరివాడేలే. ఈ సినిమా కమర్షియల్ కలెక్షన్స్ ను చాలా విబిన్నంగా అందుకుంది. మొత్తానికి నిర్మాత సేఫ్ అయినప్పటికీ ఓపెనింగ్స్ వచ్చాకా సినిమా ఒక రికార్డ్ క్రియేట్ చేయడం కాయమని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇక ఈ సినిమాను మొదట ఒక స్టార్ హీరో ఫ్యామిలీతో అనుకున్నారట.

రామ్ చరణ్ కంటే ముందే..

రామ్ చరణ్ కంటే ముందే..

కొన్ని సినిమాల కథలు సెట్స్ పైకి వచ్చే ముందు చాలా మంది హీరోలను దాటి వస్తుంటాయి. అలాగే గోవిందుడు అందరివాడేలే కథ కూడా ఒక స్టార్ హీరో ఫ్యామిలీని దాటి వచ్చిందట. రామ్ చరణ్ కంటే ముందు కృష్ణవంశీ ఆ కథను ఒక స్టార్ ఫ్యామిలీ కోసం రాసుకున్నట్లు ఇంటర్వ్యూలో చెప్పారు. అది వాళ్ళతో చేయకపోవడానికి కారణం కూడా చెప్పాడు.

 శ్రీకాంత్ పాత్ర కోసం వెంకటేష్..

శ్రీకాంత్ పాత్ర కోసం వెంకటేష్..

గోవిందుడు అందరివాడేలే సినిమా కథను చిరంజీవికి వినిపించినప్పుడు వెంటనే ఒప్పేసుకొని రామ్ చరణ్ ను ఫిక్స్ చేశారు. ఇక అందులో శ్రీకాంత్ పాత్ర చేయడానికి వెంకటేష్ కూడా ఒప్పేసుకున్నాడుట. కానీ చివరి నిమిషంలో ఆయన ఆ పాత్రకు అంతగా సెట్టవ్వడని వద్దనుకున్నారట.

నాగార్జున ఫ్యామిలీ కోసం అనుకున్న కథ

నాగార్జున ఫ్యామిలీ కోసం అనుకున్న కథ

అసలు గోవిందుడు అందరివాడేలే కథ సినిమాగా రావడానికి మొదటి బీజం అక్కినేని వారి వల్లే జరిగిందట. మనం సినిమా కంటే ముందే అక్కినేని మూడు తరాల కోసం ఒక సినిమా చేయాలని నాగార్జున చెప్పగానే కృష్ణవంశీ ఆ కథను సెలెక్ట్ చేసుకున్నడు. అయితే కథ ఫస్ట్ బాగునప్పటికి సెకండ్ హాఫ్ పై నాగ్ అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఎంతంటే..

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఎంతంటే..

ఇక కృష్ణవంశీని ఆ విషయంపై ప్రశ్నించినప్పుడు నిర్మాత సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వలన వెనక్కి తగ్గినట్లు చెప్పారు. ఏదేమైనా గోవిందుడు అందరివాడేలే సినిమా అలా రామ్ చరణ్ వైపు తిరిగింది. ఇక 30కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫైనల్ గా 41.65కోట్ల షేర్ ను రాబట్టింది. దాదాపు మొదటి వారంలోనే 35కోట్లకు పైగా షేర్ దక్కింది. అప్పట్లో టాప్ ఓపెనింగ్స్ లో కూడా గోవిందుడు అందరివాడేలే స్థానం సంపాదించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X