For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేష్ బాబు కూడా చెప్పుకోలేకపోయాడు.. ఆ గొడవ కృష్ణ వరకు వెళ్లింది: కృష్ణవంశీ

  |

  ఒక సినిమా విజయం వెనుక మిస్టేక్ పెద్దగా కనిపించవు. ఫెయిల్ అయితే మాత్రం ప్రతి ఒక్క కారణం చిత్ర యూనిట్ కి ఒక మచ్చలా ఉండిపోతుంది. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో ప్రతి అనుభవం ఒక పాఠంలా నిలుస్తుంది. ఇక సూపర్ హిట్ మూవీ మురారి సినిమా విజయం వెనుక అలాంటి కనిపించని మినీ యుద్దాలు చర్చలు చాలానే ఉన్నాయట. దర్శకుడు కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

  మహేష్ జీవితాన్ని మార్చేసిన ఆ సినిమా

  మహేష్ జీవితాన్ని మార్చేసిన ఆ సినిమా

  మహేష్ బాబు కెరీర్ ని ఒక్కసారిగా మార్చేసి బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసిన సినిమా మురారి. 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికి టీవీలలో మంచి రేటింగ్ ని అందుకుంటోంది. మహేష్ కి మాస్ ఫాలోయింగ్ ఎంత ఉన్నా కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ దగ్గరైంది మాత్రం ఆ సినిమాతోనే. నటనతోనే కాకుండా అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు.

  మురారి కథ అలా పుట్టింది

  మురారి కథ అలా పుట్టింది

  ఇక ఆ సినిమా కథ గురించి మాట్లాడిన కృష్ణవంశీ.. ప్రతిసారీ ఒక మనిషి విలన్ గా ఉంటున్నాడు. అయితే ఏదైనా ఒక ఫోర్స్ ని ఎదుర్కొనెలా ఉండాలని కథ రాయడం జరిగింది. ఒక దేవత కోపం వల్ల శాపగ్రస్తులైతే పరిస్థితి ఏంటి? చివరికి హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని అలాగే అందులోనే మన సంప్రదాయం కుటుంబ ప్రేమానురాగాలను కలగలిపినట్లు కృష్ణవంశీ చెప్పారు.

  మహేష్ కూడా సైలెంట్ అయ్యాడు

  మహేష్ కూడా సైలెంట్ అయ్యాడు

  అయితే సినిమా క్లైమాక్స్ విషయంలో చర్చలు గట్టిగానే జరిగాయట. సినిమాలో అలనాటి రామ చంద్రుడు పాట ఎంతగా హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రతి పెళ్లిలో ఆ పాట వినిపిస్తుంది. అయితే ఆ సాంగ్ చివరలో వద్దని అందరూ వాదించారని కృష్ణవంశీ చెప్పాడు. కమర్షియల్ గా ఆలోచించి ఏదైనా మాస్ సాంగ్ ఉండాలని అన్నారు. నేను అందుకు ఒప్పుకోలేదు. మహేష్ బాబు కూడా మొహమాటంతో సైలెంట్ అయ్యాడని అన్నారు.

  ఆ పంచాయితీ కృష్ణ వరకు వెళ్లింది

  ఆ పంచాయితీ కృష్ణ వరకు వెళ్లింది

  ఇక ఆ పంచాయితీ కృష్ణ గారి వరకు వెళ్లడంతో వెంటనే కలవమని అన్నారు. ఆయనను అందరూ కలిసి ఒప్పించారని అప్పటికే నాకు అర్ధమయ్యింది. అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు. చివరలో మాస్ సాంగ్ లేకపోతే ఎలా? అబ్బాయ్. అనవసరంగా ప్రయోగం చేయడం అవసరమా? ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగినట్లు కృష్ణవంశీ వివరించారు.

  Keerthy Suresh's Telugu Debut Aina Ishtam Nuvvu Teaser
   సినిమా నుంచి తప్పుకుంటానని చెప్పడంతో

  సినిమా నుంచి తప్పుకుంటానని చెప్పడంతో

  ఇక కృష్ణగారు అలా అనగానే నేను ఒకటే చెప్పాను. సర్ మన దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది సినిమా పాటను నన్ను చేయనివ్వాలి. ఇక రెండోది నేను సినిమా నుంచి తప్పుకోవడం. నేను వెళ్లిపోయిన తరువాత మీకు నచ్చిన పాట పెట్టుకోవచ్చు. నా పేరు కూడా వేయాల్సిన అవసరం లేదని చెప్పడంతో కృష్ణ గారు ఒప్పేసుకున్నారని కృష్ణవంశీ అప్పటి సంగతులను గుర్తుచేసుకున్నారు.

  English summary
  The mistake that can easily get your claim denied is to fail. Failure, however, leaves a scar on the image unit for every single reason. However every experience in the film industry stands as a lesson. There seems to be a lot of talk of such unseen mini wars behind the success of the longer super hit movie Murari. Director Krishnavanshi revealed some interesting things about the film in an interview
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X