For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Samantha: ఇన్‌స్టాగ్రామ్‌‌తో సమంత లక్షల సంపాదన.. ఒక్క పోస్టుకు ఎంత తీసుకుంటుందో తెలిస్తే!

  |

  టాలీవుడ్‌లోకి ఎంతో మంది సుందరీమణులు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని హవాను చూపించారు. అలాంటి వారిలో గ్లామరస్ నటి సమంత రూత్ ప్రభు ఒకరు. 'ఏమాయ చేశావే' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అందరినీ మాయ చేస్తూనే ఉంది. ఇలా దాదాపు దశాబ్ద కాలంగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది.

  తద్వారా స్టార్‌డమ్‌ను దక్కించుకోవడంతో పాటు ఫాలోయింగ్‌ను కూడా భారీగా పెంచుకుంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్ ద్వారానూ సమంత సంపాదిస్తోంది. మరి ఆమె ఒక్కో పోస్టుకు ఎంత తీసుకుంటుందో చూద్దామా!

  సమంత అప్పుడలా ఇప్పుడిలా

  సమంత అప్పుడలా ఇప్పుడిలా

  కెరీర్ ఆరంభంలో సమంత రూత్ ప్రభు ఎక్కువగా గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇచ్చేది. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఆమె తన పంథాను పూర్తిగా మార్చుకుంది. ఇందులో భాగంగానే ఎక్కువగా పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఒప్పుకుంటోంది. అందులో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ఉంటున్నాయి. విడాకుల తర్వాత మరింత స్పీడుగా ప్రాజెక్టులు చేస్తోంది.

  Bigg Boss Non Stop: ఆమెకు బిగ్ బాస్ మరో ఛాన్స్.. షోలోకి ఫైర్ బ్రాండ్ రీఎంట్రీ.. ఎప్పుడు వస్తుందంటే!

  నేషనల్ రేంజ్.. మరొకటి సిద్ధం

  నేషనల్ రేంజ్.. మరొకటి సిద్ధం

  దాదాపు పదేళ్ల నుంచి సినిమాల్లో సత్తా చాటుతోన్న సమంత.. ఆహా కోసం ‘సామ్ జామ్' షోను హోస్టు చేసి డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దీనితో సమంత తన ఫాలోయింగ్‌ను నేషనల్ రేంజ్‌కు విస్తృత పరచుకుంది.

  అవన్నీ కంప్లీట్ చేసేసిన సామ్

  అవన్నీ కంప్లీట్ చేసేసిన సామ్

  సమంత ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శాకుంతలం' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. దీనితో పాటు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న ‘కాతు వాకుల్ రెండు కాదల్' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు మూవీ షూట్‌లు కంప్లీట్ చేసుకుంది.

  అందాల ఆరబోతతో షాకిచ్చిన ఈషా రెబ్బా: తెలుగు పిల్లను ఇలా చూస్తూ తట్టుకోలేరు!

  ఇంగ్లీష్ సినిమాలోనూ సమంత

  ఇంగ్లీష్ సినిమాలోనూ సమంత

  మొదటి నుంచి సమంత రూత్ ప్రభు దక్షిణాది సినిమాలకే పరిమితమైంది. అయితే, ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్‌లోనే నటించనుంది. BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ తెరకెక్కించే ఈ వెబ్ ఫిల్మ్ ‘The arrangements of love' నవల ఆధారంగా రూపొందనుంది. అలాగే, ‘యశోద' అనే పాన్ ఇండియా మూవీలోనూ ప్రధాన పాత్ర చేస్తోన్న సంగతి విధితమే.

  అందులో మాత్రం ఫుల్ బిజీగా

  అందులో మాత్రం ఫుల్ బిజీగా

  వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌తో ఉన్న సమంత సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ మజాను పంచుతోంది. ఫలితంగా తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను భారీ స్థాయిలో పెంచుకుంటోంది.

  బీచ్‌లో బికినీతో శ్రీయ శరణ్ అందాల విందు: తల్లైన తర్వాత తొలిసారి ఇంత దారుణంగా!

  ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంపాదన

  ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంపాదన

  కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సమంత అప్పుడప్పుడూ వ్యాపార ప్రకటనలు కూడా చేస్తుంటుంది. ఇప్పటికే బుల్లితెరపై ఎన్నో యాడ్లను కూడా చేసింది. అలాగే, చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. ఇక, ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోనూ ఈ అమ్మడు కొన్ని బ్రాండ్లకు ప్రచారం చేస్తూ ఫొటోలు, వీడియోలను వదులుతూ బాగానే సంపాదిస్తోంది.

  Recommended Video

  RRR Movie పై Alia Bhatt హర్ట్.. అలియా ని మించిన Olivia Morris క్రేజ్| Filmibeat Telugu
  ఒక్కో పోస్టుకు ఎంత వస్తుంది?

  ఒక్కో పోస్టుకు ఎంత వస్తుంది?

  తాజా సమాచారం ప్రకారం.. సమంత ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో చేసే వ్యాపార ప్రకటనలకు సంబంధించిన ఒక్కో పోస్టుకు ఏకంగా రూ. 15 - 20 లక్షలు డిమాండ్ చేస్తుందట. వాటి బ్రాండ్ వ్యాల్యూను బట్టి ఈ రేటును ఇంకాస్త పెంచుతుందని తెలుస్తోంది. టాలీవుడ్‌లో ఈ విభాగంలోనూ సమంతనే టాప్‌లో ఉందని తెలుస్తోంది. దీంతో ఈ అమ్మడు మరోసారి హైలైట్ అవుతోంది.

  English summary
  Samantha Ruth Prabhu Very Active in Social Media. Lets Know How Much She Charges For One Instagram Post
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X