For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBD Nani: టాలీవుడ్‌లోనే ఆ రికార్డు కొట్టిన ఏకైక హీరో.. ఆ ఒక్క తప్పుతో నానిపై విమర్శలు

  |

  ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ అండ్ స్టార్ హీరోల్లో నాని ఒకడు. ఏమాత్రం సపోర్టు లేకుండానే పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. దాదాపు దశాబ్ధ కాలంగా తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. తన సహజ సిద్ధమైన నటనతో ఎన్నో సినిమాలను వన్ మ్యాన్ షోగా మార్చుకున్నాడు. తద్వారా మరెవరికీ సాధ్యం కాని రీతిలో విజయాలను అందుకున్నాడు. అంతేకాదు, చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాల్లో నటించి హవా చూపించాడు.

  ఈ క్రమంలోనే ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక, గురువారం నాని తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడి జీవితంలోని అత్యంత ముఖ్య ఘట్టాలు, రికార్డులు, వివాదాల గురించి తెలుసుకుందాం పదండి!

  అలా మొదలు... ఇలా పరిచయం

  అలా మొదలు... ఇలా పరిచయం

  సినిమాల మీద ఉన్న ఇష్టంతో నాని చదువుకు మధ్యలోనే పుల్‌స్టాప్ పెట్టేశాడు. ఈ క్రమంలోనే ‘రాధా గోపాలం' అనే సినిమాకు బాపు దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. ఆ తర్వాత బడా డైరెక్టర్లు రాఘవేంద్రరావు, శ్రీనువైట్ల సహా పలువురి దగ్గరా వర్క్ చేశాడు. ఈ క్రమంలోనే ఇంద్రగంటి మోమన్‌కృష్ణ తెరకెక్కించిన ‘అష్టాచమ్మా' అనే సినిమాతో నాని హీరోగా ప్రయాణాన్ని మొదలెట్టాడు.

  వెట్ బాడీ సెల్ఫీతో ఇలియానా రచ్చ: పై నుంచి అందాలను చూపిస్తూ ఘాటుగా!

  అక్కడి నుంచి వెనక్కి చూడలేదు

  అక్కడి నుంచి వెనక్కి చూడలేదు

  ‘అష్టాచమ్మా' హిట్ అయినా నానికి మాత్రం అంతగా గుర్తింపు దక్కలేదు. ఈ క్రమంలోనే ‘రైడ్‌', ‘స్నేహితుడా', ‘భీమిలీ కబడ్డీ జట్టు' వంటి సినిమాలు చేసి నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. సరిగ్గా అప్పుడే నందినీ రెడ్డి తెరకెక్కించిన ‘అలా మొదలైంది'తో మొదటి బ్రేక్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత ‘పిల్ల జమిందార్'తో నేచురల్ స్టార్‌గా గుర్తింపు పొందాడు.

  నాని ప్రత్యేకత అదే.. పోటాపోటీగా

  నాని ప్రత్యేకత అదే.. పోటాపోటీగా

  కంటెంట్ ఎలా ఉన్నా.. కథ ఏదైనా.. యాక్టింగ్‌లో మాత్రం అదరగొడుతుంటాడు నాని. నేచురల్ స్టార్ అనే బిరుదుకు సార్థకం చేస్తూ ఎన్నో సినిమాల్లో సహజసిద్ధమైన పాత్రలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రతి సినిమాను వన్ మ్యాన్ షోగా మారుస్తూ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ విషయంలో మాత్రం తనకు తానే పోటీ అనేటట్లుగా నటిస్తున్నాడు.

  బట్టలున్నా లేనట్టే దీపికా పదుకొనే రచ్చ: వామ్మో శృతి మించిన హీరోయిన్ హాట్ ట్రీట్!

  టాలీవుడ్‌లోనే ఏకైక హీరోగా నాని

  టాలీవుడ్‌లోనే ఏకైక హీరోగా నాని

  నాని కెరీర్‌లో ‘ఈగ' ప్రత్యేకమైన సినిమా అని చెప్పొచ్చు. దీనికి కారణం దీన్ని రాజమౌళి తెరకెక్కించడమే. ఈ మూవీతో అతడి స్టార్ ఇమేజ్‌కు కూడా బాగా పెరిగింది. అయితే, దీని తర్వాత అతడు చేసిన పలు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘భలే భలే మగాడివోయ్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి వరుసగా ఎనిమిది హిట్లతో రికార్డు కొట్టేశాడు.

  నానిపై విమర్శలు తెచ్చిన బాస్

  నానిపై విమర్శలు తెచ్చిన బాస్

  వరుస హిట్లతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న సమయంలోనే నేచురల్ స్టార్ నాని.. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో వివాదాల నడుమ ప్రసారం అయిన రెండో సీజన్‌ను అద్భుతంగా నడిపించాడు. అయినప్పటికీ నానిపై ఓ వర్గం విమర్శనాస్త్రాలు సంధించింది. దీంతో మరోసారి ఈ తరహా షోలు చేయకూడదని ఈ స్టార్ హీరో నిర్ణయం తీసుకున్నాడు.

  బ్రా కూడా లేకుండా రెచ్చిపోయిన హీరోయిన్: ఆ నటుడితో డేటింగ్.. ఇప్పుడు మరీ ఘోరంగా!

  బిగ్గెస్ట్ హిట్‌తో.. తర్వాత పరిస్థితి

  బిగ్గెస్ట్ హిట్‌తో.. తర్వాత పరిస్థితి

  ఇక, ఆ మధ్య ‘జెర్సీ'తో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న నాని.. ఆ తర్వాత ‘గ్యాంగ్ లీడర్'తో నిరాశనే ఎదుర్కొన్నాడు. దీని తర్వాత అతడు ‘వీ', ‘టక్ జగదీష్' వంటి సినిమాలు చేసినా.. అవి ఓటీటీలో విడుదలయ్యాయి. ఇక, ఇటీవలే ‘శ్యామ్ సింగ రాయ్'గా వచ్చిన నాని.. దీనితో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు.

  Actor Nani About His Learning Experience As Assistant Director | Filmibeat Telugu
  హీరోగా రెండు.. నిర్మాతగా అలా

  హీరోగా రెండు.. నిర్మాతగా అలా

  హీరోగా సత్తా చాటుతోన్న నాని.. నిర్మాతగానూ మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే అతడు ‘డీ ఫర్ దోపిడీ', ‘ఆ!', ‘హిట్' అనే సినిమాలు నిర్మించాడు. ఇప్పుడు ‘హిట్ 2' మూవీని నిర్మిస్తున్నాడు. ఇక, హీరోగా ప్రస్తుతం ‘అంటే.. సుందరానికీ' అనే సినిమాను పూర్తి చేసిన నాని.. ఇప్పుడు ‘దసరా' అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా మారిపోయాడు.భవిష్యత్‌లోనూ సినీ హీరోగా, నిర్మాతగా నాని మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున నేచురల్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

  English summary
  Tollywood Star Hero Nani Birthday Today. On The Occasion of His Birthday.. Let we Know Best Moments of his Career.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion