twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy Birthday RAPO: రామ్ ఖాతాలో ఐదు సెంచరీలు.. టాలీవుడ్‌లో ఏకైక హీరో.. అతడి ఆస్తులు, రెమ్యూనరేషన్

    |

    టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ రవి కిశోర్ ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొతినేని. కెరీర్ ఆరంభంలోనే భారీ హిట్లను అందుకున్న అతడు.. స్టార్ స్టేటస్‌తో పాటు మంచి మార్కెట్‌ను సైతం ఏర్పరచుకున్నాడు. ఇలా దాదాపు పదిహేనేళ్లుగా టాలీవుడ్‌లో తనదైన ముద్రను వేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఆ మధ్య వరుస పరాజయాలతో సతమతం అయిన అతడు.. ఇప్పుడు మాత్రం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు రామ్ పోతినేని పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడి రికార్డులు, రెమ్యూనరేషన్, నికర విలువ గురించి తెలుసుకుందాం!

    Recommended Video

    Ram Pothineni : 15 ఏళ్ల ప్రస్థానం.. Cult Fan Base | Happy Birthday RAPO || Filmibeat Telugu
    కోలీవుడ్ ఎంట్రీ.. తెలుగులో హీరోగా

    కోలీవుడ్ ఎంట్రీ.. తెలుగులో హీరోగా

    ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిశోర్ సోదరుడి కుమారుడిగా సినిమాల్లోకి పరిచయమయ్యాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. అయితే, ముందుగా అతడు తమిళంలో 'అడయాలమ్' అనే షార్ట్ ఫిల్మ్ చేశాడు. దానికి గానూ ఉత్తమ నటుడిగా అవార్డులు సైతం అందుకున్నాడు. ఆ తర్వాతనే 'దేవదాసు' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు. ఇది సూపర్ హిట్ అయింది.

    అరాచకమైన వీడియో షేర్ చేసిన శ్రీరెడ్డి: వాళ్ల కోసమే అంటూ మొత్తం చూపిస్తూ!అరాచకమైన వీడియో షేర్ చేసిన శ్రీరెడ్డి: వాళ్ల కోసమే అంటూ మొత్తం చూపిస్తూ!

    సక్సెస్‌లతో సత్తా చాటుకుని స్టార్‌గా

    సక్సెస్‌లతో సత్తా చాటుకుని స్టార్‌గా


    తన ఎంట్రీని 'దేవదాసు'తో గ్రాండ్‌గా చూపించాడు రామ్. దీని తర్వాత వచ్చిన 'జగడం' ఫ్లాప్ అయిన ఆ తర్వాత చేసిన 'రెడీ'తో భారీ హిట్‌ను దక్కించుకున్నాడు. ఆ వెంటనే 'మస్కా', 'కందిరీగ' వంటి హిట్లను తన ఖాతాలో వేసుకుని ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు. యాక్టర్‌గా సత్తా చాటిన అతడు.. బెస్ట్ డ్యాన్సర్‌గానూ పేరు తెచ్చుకుని సత్తాను చాటాడు.

    వరుస ఫ్లాపులతో కెరీర్ ప్రశ్నార్థకం

    వరుస ఫ్లాపులతో కెరీర్ ప్రశ్నార్థకం

    రామ్ చేసిన సినిమాల్లో చాలా వరకూ ఫ్లాపులు ఉన్నాయి. కెరీర్ ఆరంభంలో వచ్చిన 'జగడం' మొదలుకొని.. 'రామరామ కృష్ణకృష్ణ', 'ఎందుకంటే ప్రేమంట', 'ఒంగోలు గిత్త', 'మసాలా', 'శివమ్' చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక, 'హైపర్', 'ఉన్నది ఒకటే జిందగీ' ఏవరేజ్‌గా నిలిచాయి. వీటి మధ్యలో 'నేను శైలజ', 'పండగ చేస్కో' వంటి హిట్లూ వచ్చాయి.

    F3 హీరోయిన్ ఎద అందాల విందు: ఈ డ్రెస్‌లో ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరు!F3 హీరోయిన్ ఎద అందాల విందు: ఈ డ్రెస్‌లో ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరు!

    ఆ మూవీతో రామ్ కెరీర్ టర్నింగ్

    ఆ మూవీతో రామ్ కెరీర్ టర్నింగ్


    పరాజయాలతో సతమతం అవుతోన్న రామ్‌కు సరైన బ్రేక్ రావాలని ఫ్యాన్స్ ఆశించారు. అలాంటి సమయంలోనే పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' వచ్చింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దుమ్ముదులిపేసి రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీని తర్వాత అతడు 'రెడ్' కూడా మంచి విజయాన్ని అందుకుంది.

    ఐదు సెంచరీలతో ఏకైక హీరోగా

    ఐదు సెంచరీలతో ఏకైక హీరోగా

    రామ్ సినిమాలకు హిందీలోనూ మంచి డిమాండ్ ఉంది. అందుకే అతడు నటించిన ఐదు సినిమాలు ఏకంగా వంద మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి. 'హలో గురూ ప్రేమ కోసమే', 'నేను శైలజ', 'ఉన్నది ఒకటి జిందగీ', 'హైపర్', 'ఇసార్ట్ శంకర్' మూవీలకు వంద అంతకంటే ఎక్కువ మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ ఘనత అందుకున్న ఏకైక హీరోగా నిలిచాడు.

    ప్రియుడితో ఒకే రూంలో పాయల్ రాజ్‌పుత్: ఏకంగా అలాంటి పని చేస్తూ షాకిచ్చిందిగా!ప్రియుడితో ఒకే రూంలో పాయల్ రాజ్‌పుత్: ఏకంగా అలాంటి పని చేస్తూ షాకిచ్చిందిగా!

     ఉస్తాద్ ఆస్తులు.. రెమ్యూనరేషన్

    ఉస్తాద్ ఆస్తులు.. రెమ్యూనరేషన్


    రామ్ పోతినేని తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి ఎదిగాడు. దీంతో అతడి నికర విలువ దాదాపు రూ. 110 - 120 కోట్లు ఉంటుందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే, అతడు ఒక్కో సినిమాకు రూ. 10 - 15 కోట్లు చార్జ్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇలా మొత్తంగా రామ్ యాడ్స్, సినిమాల ద్వారా ఏడాదికి రూ. 20 కోట్ల వరకూ ఆదాయాన్ని అందుకుంటున్నాడని తెలుస్తోంది.

    వారియర్‌గా మారిపోయిన రామ్

    వారియర్‌గా మారిపోయిన రామ్


    వరుస విజయాలతో దూసుకుపోతోన్న రామ్ పోతినేని ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామితో 'ద వారియర్' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో రామ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి దీన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు.

    యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్‌తో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తోన్న రామ్ పోతినేని.. ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ.. అతడికి తెలుగు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

    English summary
    Tollywood Star Hero Ram Pothineni Birthday Today. On The Occasion of His Birthday.. Let we Know His Assets and Remuneration Details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X