For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎప్పటికీ మీరే మాకు ఆచార్య.. అల్లు అర్జున్, ఉపాసన ఎమోషనల్.. మహేష్, వెంకీ బర్త్ డే విషెస్

  |

  మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేను పురస్కరించుకొని టాలీవుడ్ సినీ తారలందరూ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందిస్తున్నారు. మెగాస్టార్ జన్మదినాన్ని పురస్కరించుకొని #HBDMegatarChiranjeevi ట్రెండ్ అవుతున్నది. లాక్‌డౌన్ కారణంగా చిరంజీవి తన బర్త్ డేను నిరాడంబరంగా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు చేసిన ట్వీట్లు ఇవే..

  నడిరోడ్డుపై జాకెట్ ధరించి

  నడిరోడ్డుపై జాకెట్ ధరించి


  బర్త్ డే సందర్భంగా చిరంజీవిపై అల్లుడు, అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ గుండె నిండా అభిమానాన్ని చాటుకొన్నారు. నడిరోడ్డుపై చిరంజీవి పోస్టర్ ఉన్న జాకెట్ ధరించి... నా ఆల్‌టైమ్ హీరోకు అడ్వాన్స్ బర్త్ డే విషెస్ చిరంజీవి గారు. మీరు ఇచ్చిన జీవితానికి థ్యాంక్స్. మీపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి మాటలు చాలడం లేదు అంటూ అల్లు శిరీష్ ట్వీట్ చేశారు.

  ఉపాసన ఎమోషనల్

  ఉపాసన ఎమోషనల్

  చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకొని కోడలు ఉపాసన కొణిదెల ఎమోషనల్ అయ్యారు. నిత్య కృషీవలుడు, గొప్ప నమ్మకం ఉన్న వ్యక్తి. దాయార్థ హృదయం, ఎలాంటి సమయంలో కూడా మానసిక ధైర్యంతో ఉండే వ్యక్తి అంటూ ప్రపంచం మొత్తం పిలుస్తుంది.. మామయ్యను నేను కూడా అలానే పిలుస్తాను అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. మీరంటే స్ఫూర్తి, ఆరాధనభావం ఎప్పటికి ఉంటుంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

  సంపూర్ణ ఆరోగ్యంతో

  సంపూర్ణ ఆరోగ్యంతో

  చిరంజీవికి గారికి హ్యాపీ బర్త్ డే విషెస్. మా తరం వారందరికీ మీరే స్పూర్తి. అదీ ఎప్పటికీ కొనసాగుతుంటుంది. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో కలకాలం ఉండాలని కోరుకొంటున్నాను అంటూ సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

  ఒకే రోజు రెండు పండుగలు

  ఒకే రోజు రెండు పండుగలు

  మెగాస్టార్ చిరంజీవికి రచయిత పరుచూరి గోపాలకృష్ణ భావోద్వేగంతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మెగా స్టార్ మాత్రమేకాదు మెగామనసున్న మహామనిషి .నేడు మెగాఅభిమానులకు రెండు పండుగలు .ఒకటి వినాయకచవితి పండుగ . రెండు వారుఅభిమానించే దేవుడు చిరంజీవిగారి పుట్టినరోజు పండుగ.సినీ కార్మికులకు తమను ఆదుకుంటున్న ఆపద్భాంధవుడి జన్మదినవేడుక జన్మదినశుభాకాంక్షలు. చిరంజీవి గారు శతమానం భవతు అంటూ ట్వీట్ చేశారు.

  వన్ అండ్ ఓన్టీ మెగాస్టార్

  వన్ అండ్ ఓన్టీ మెగాస్టార్

  వన్ అండ్ ఓన్టీ మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే. నా గుండెలో ఎప్పుడూ మీపైన ప్రేమ, గౌరవం, గ్రాటిట్యూడ్ నిండి ఉంటుంది. నాకెప్పుడూ నిజమైన ఆచార్యుడు మీరే అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

  నాకు అత్యంత ప్రియమైన వ్యక్తికి

  మెగాస్టార్ చిరంజీవికి విక్టరీ వెంకటేష్ సింపులు, సూపర్బ్‌గా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాకు ఇండస్ట్రీలో అత్యంత ప్రియమైన వ్యక్తి చిరంజీవికి గారికి నా బర్త్ డే విషెస్. అంటూ వెంకటేష్ ట్వీట్ చేశారు.

  మీరే ఎప్పటికి నంబర్ వన్

  మీరే ఎప్పటికి నంబర్ వన్

  మామయ్య పుట్టిన రోజున సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు. సినిమాలే ఆయనను పరిశ్రమలో మెగాస్టార్‌గా నిలబెట్టాయి. కేవలం ఫ్యామిలీపైనే కాకుండా సమాజంపై చిరంజీవి గారు కురిపించే ప్రేమ, తీసుకొనే జాగ్రత్తలు నాకు ఎంతో స్పూర్తిని కలిగిస్తాయి. అందుకే ఆయన ఇప్పటికీ, ఎప్పటికీ నెంబర్ వన్‌ అనే చెబుతాను అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

  Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
  నా భుజంపై చేయివేసి.

  నా భుజంపై చేయివేసి.

  తన అభిమాన నటుడు చిరంజీవికి యువ హీరో కార్తీకేయ గుమ్మకొండ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. నా భుజంపై చేయి వేసి మాట్లాడటం నేను ఎప్పుడూ మరిచిపోలేను. ఆ క్షణాలు ఇంకా గుర్తున్నాయి. ఆయనకు ఇచ్చిన మాటకు తగినట్టే నేను చాలా కష్టపడి పనిచేస్తాను. బాస్ పుట్టిన రోజున ఊరికే ఉండలేం అంటూ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి అంటూ శుభాకాంక్షలు అందించారు.

  English summary
  Megastar Chiranjeevi celebrating his birthday on August 22nd. Chiranjeevi decided to celebrate his birthday low key affair due to Coronavirus lockdown. He suggested his fan to not to celebrate his birthday celebration in grand manner. In this occassion, Mahesh Babu, Venkatesh, Allu arjun wishes thru Twitter.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X