For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాజల్ లవ్ ట్రాక్.. ఎప్పుడు మొదలైంది.. ఎన్నేళ్ల నుంచి నడుస్తోందంటే?

  |

  టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు 13 ఏళ్ళవుతోంది. ఆమె మొదటి సినిమా నుంచి కూడా కెరీర్ లో ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా జాగ్రత్తగా అడుగులు వేసింది. ఇక లవ్ రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా కాజల్ మాత్రం ఎప్పటికప్పుడు తాను సింగిల్ అంటూ బాగానే కవర్ చేసింది గాని ఇటీవల పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తరువాత ఒక విషయం మాత్రం చాలా క్లియర్ గా అర్ధమవుతోంది. కాజల్ పెళ్లి ఈ మధ్య కాలంలో ఫిక్స్ అయ్యింది కాదు. ఈ ప్రేమ బంధం ఎప్పుడో స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.

  Kajal Aggarwal : Do You Know Kajal Aggarwal's Love Story, And When It Is Started ?
   ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో..

  ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో..

  కాజల్ తన పెళ్లి విషయంలో కుటుంబ సభ్యుల మాటకు చాలా విలువ ఇచ్చినట్లు అర్ధమవుతోంది. గౌతమ్ కిచ్లు ఒక ప్రొఫెషనల్ ఇంటీరియర్ బిజినెస్ మెన్ గా కెరీర్ మొదలు పేట్టిన ప్రారంభ దశలోనే అతని గురించి లోతుగా తెలుసుకున్నారట. ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో మొదటి నుంచి క్లోజ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా సార్లు గౌతమ్, కాజల్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి.

  రెగ్యులర్ గా టచ్ లో ఉండేవారట..

  రెగ్యులర్ గా టచ్ లో ఉండేవారట..

  ఫొటోలలో కాజల్ అతనితో చాలా క్లోజ్ గా ఉండడం చూసి నాలుగేళ్ళ క్రితమే అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఇక గౌతమ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ లలో కూడా చందమామ రెగ్యులర్ గా పాల్గొంటు ఉండేదని తెలిసింది. గౌతమ్ కూడా నిత్యం కాజల్ ఫ్యామిలిక్ దగ్గరగా ఉండేవాడు. ముఖ్యంగా కాజల్ సోదరి నిషా వివాహ వేడుకలో కూడా అతను అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నాడట.

  గత ఏడేళ్ల నుంచి ప్రేమలో..

  గత ఏడేళ్ల నుంచి ప్రేమలో..

  దీన్ని బట్టి చూస్తుంటే కాజల్ అగర్వాల్ గౌతమ్ తో గత ఏడేళ్ల నుంచి రిలేషన్షిప్ లో ఉన్నట్లు క్లియర్ గా అర్ధమవుతోంది. ఇక ఆమె పెళ్లిపై చాలా సార్లు రూమర్స్ వచ్చాయి. ఇంటర్వ్యూలలో అందుకేజ్ సంబంధించిన ప్రశ్నలు ఎదురైనప్పుడు అమ్మడు ఆ విషయాన్ని స్కిప్ చేసేది. చాలా సందర్భాల్లో నేను సింగిల్ అని కూడా వివరణ ఇచ్చింది. ఏదేమైనా కాజల్ వయసు ఎక్కువవ్వకముందే మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేసింది.

  గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ..

  గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ..

  ఇటీవల కాజల్ తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి బ్యాచిలర్ పార్టీని గ్రాండ్ గా చేసుకుంది. ఈ పార్టీలో కొందరు సినీ ప్రముఖులు కూడా హాజరయినట్లు తెలుస్తోంది. ఇక అక్టోబర్ 20న పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇక ముంబైలోనే అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో చిన్నగా వివాహా వేడుకను జరుపుకోబోతున్నట్లు చెప్పిన కాజల్.. ఈ పాండమిక్ సమయంలో వీలైనంత వరకు జాగ్రత్తగా మా ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నామని సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది.

  English summary
  Kajal Aggarwal Latest Love symbol post create row, Buzz Is That Kajal Aggarwal Getting Married Gautam Kitchlu, Kajal’s beau’s correct name is Gautam Kitchlu, and he’s a design enthusiast and entrepreneur who runs Discern Living – an ecommerce venture for interior design and home decor solutions.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X