For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR మోషన్ పోస్టర్ వాటి నుంచి కాపీ చేశారా.! తెరపైకి వచ్చిన సరికొత్త అంశం

  By Manoj Kumar P
  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో ఎస్ ఎస్ రాజమౌళి టాప్ ప్లేస్‌లో వెలుగొందుతున్నారు. దీనికి కారణం ఆయన ఇప్పటి వరకు రూపొందించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవడమే. అంతేకాదు, వాటిలో కొన్ని ఇండస్ట్రీ హిట్‌లు కూడా ఉండడమే. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'స్టూడెంట్ నెం 1' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన ప్రస్తుతం RRR అనే భారీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఆ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ఆ పోస్టర్ గురించి సరికొత్త అంశం ఒకటి తెరపైకి వచ్చింది. ఆ వివరాలేంటో మీరూ చూడండి.!

  RRR Movie Motion Poster Is Copied From Those Movies ?
  ఆ ఇద్దరిని కలిపిన జక్కన్న.. రియల్ హీరోల కథతో

  ఆ ఇద్దరిని కలిపిన జక్కన్న.. రియల్ హీరోల కథతో

  ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమే RRR. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో చెర్రీ.. అల్లూరి గానూ, తారక్.. కొమరం భీంగానూ నటిస్తున్నారు. అలాగే, వీరితో పాటు అజయ్ దేవగణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

  రాజమౌళి టీమ్‌కు అస్సలు కలిసి రావడం లేదు

  టాప్ డైరెక్టర్.. ఇద్దరు స్టార్ హీరోలు.. భారీ బడ్జెట్ మూవీ.. వీటన్నింటి కారణంగా RRRపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. వాటన్నింటిని నడుమ ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. అయితే, హీరోలకు గాయాలు కావడం, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం, ప్రతికూల వాతావరణం, ఇప్పుడు కరోనా ప్రభావం కారణంగా షూటింగ్ ఎన్నో సార్లు వాయిదా పడింది.

   ఏడాదిన్నర ఖాళీ.. బ్రేక్‌లో మాత్రం బ్రేకింగ్స్ సిద్ధం

  ఏడాదిన్నర ఖాళీ.. బ్రేక్‌లో మాత్రం బ్రేకింగ్స్ సిద్ధం

  ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాదిన్నర అవుతోంది. అయినప్పటికీ ఈ మూవీ నుంచి ఒక్కటంటే ఒక్క సర్‌ప్రైజ్ రాలేదు. కానీ, ప్రస్తుతం కరోనా కారణంగా వచ్చిన బ్రేక్‌లో మాత్రం బ్రేకింగ్ న్యూస్‌లు చెబుతోంది RRR యూనిట్. ఇందులో భాగంగానే సినిమాకు క్యాప్షన్‌తో కూడిన మోషన్ పోస్టర్ రెండు రోజుల క్రితం విడుదల చేసింది.

  సర్‌ప్రైజ్ వచ్చేసింది... అవి మాత్రం ఊహించలేదు

  సర్‌ప్రైజ్ వచ్చేసింది... అవి మాత్రం ఊహించలేదు

  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న RRR సినిమాకు సంబంధించిన మొదటి సర్‌ప్రైజ్ మోషన్ పోస్టర్ రూపంలో వచ్చేసింది. ఈ పోస్టర్‌లో రివీల్ చేసిన ‘రౌద్రం.. రణం.. రుధిరం' టైటిల్ చాలా కాలంగా పరిశీలనలో ఉన్నదే కావడం విశేషం. అయితే, ఈ మోషన్ పోస్టర్‌లో ఇద్దరు హీరోల లుక్స్ మాత్రం ఊహించని విధంగా ఉండడంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

  పోస్టర్‌కు షాకింగ్ రెస్పాన్స్.. తెరపైకి సరికొత్త అంశం

  పోస్టర్‌కు షాకింగ్ రెస్పాన్స్.. తెరపైకి సరికొత్త అంశం

  రెండు రోజులుగా సోషల్ మీడియాను కుదిపేస్తోంది RRR మోషన్ పోస్టర్. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన పోస్టర్స్ మంచి రెస్పాన్స్‌ వచ్చినప్పటికీ.. కరోనా ప్రభావంతో ఊహించిన స్థాయిలో వ్యూస్ రావడం లేదు. ఈ నేపథ్యంలోనే మోషన్ పోస్టర్ గురించి ఓ సరికొత్త అంశం తెరపైకి వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో దీని గురించే చర్చ జరుగుతోంది.

  RRR మోషన్ పోస్టర్ వాటి నుంచి కాపీ చేశారా.!

  RRR మోషన్ పోస్టర్ వాటి నుంచి కాపీ చేశారా.!

  RRR మోషన్ పోస్టర్‌లో రామ్ చరణ్.. అగ్ని నుంచి, ఎన్టీఆర్.. నీటి నుంచి వస్తున్నట్లు చూపించారు. గతంలో అదే రీతిలో ‘మగధీర'లో చెర్రీ నీటి నుంచి.. ‘యమదొంగ'లో తారక్ మంటల నుంచి ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు వాటినే ప్రస్తావిస్తూ.. రాజమౌళి తన సినిమాలనే కాపీ కొట్టాడని కొందరు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే, మరికొందరు ‘ఫైర్ అండ్ ఐస్' అనే హాలీవుడ్ మూవీ పోస్టర్‌ను సైతం వైరల్ చేస్తున్నారు.

  English summary
  Tollywood Young Hero Jr Ntr Upcoming Movie Is RRR. This Movie Directed By SS Rajamouli. In This Movie mega power Star Ram charan Also Working. In This Movie Will be Released on 8th January 2021. Dvv Danayya Producer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X