Don't Miss!
- News
ఒక్క ఛాన్స్ - ఒక్క తప్పిదం : అనుభవిస్తున్నారు - ఆలోచించండి : బాలయ్య..!!
- Technology
WhatsApp లో కొత్త రకం స్కామ్! ఈ నంబర్లు డయల్ చేసారంటే మీ అకౌంట్ హ్యాక్ అవుతుంది. జాగ్రత్త.
- Finance
బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్‌కు క్రెడిట్ కార్డ్‌తో కుచ్చుటోపీ: రూ.లక్షలు దోపిడీ
- Automobiles
భారత్‌లో కీవే వియస్టా 300 మరియు కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్లను విడుదల చేసిన బెనెల్లీ
- Lifestyle
అధ్యయనం ప్రకారం టైప్ 2 డయాబెటిస్ వారు బరువు తగ్గడానికి సహాయపడే ఆహారం మీకు తెలుసా?
- Sports
Jos Buttler Records In Qualifier 2: జోస్ ది బాస్ దెబ్బకు పిట్టల్లా రాలిన రికార్డులు.. డేంజరేస్ ప్లేయర్ మరీ!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
100 కేజీల బరువు తగ్గిన సినీ తారలు.. సన్నజాజిలా మారిన స్టార్ కిడ్స్ చూస్తే షాకే!
స్టార్ వారసులకు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ చాలా సులభం అని అనుకుంటాం. ఎంట్రీ వరకు సులభమే కావచ్చు కానీ.. ఆ తర్వాత వారి కష్టాలు వారు పడాల్సిందే. తన డ్యాన్స్‌లతోనూ, నటనతోనూ, రూపంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సిందే. లేకపోతే ఎంత పెద్ద స్టార్ వారుసుడినైనా ప్రేక్షకులు పట్టించుకోరు. అందుకే సినిమాల్లోకి వచ్చే ముందే స్టార్ వారసులు ఎన్నో అంశాల్లో శిక్షణ తీసుకుంటారు. అప్పటివరకు లావుగా ఉన్నవాళ్లు సన్నగా, నాజూగ్గా మారిపోతారు. ఒకప్పుడు వంద కేజీల కంటే ఎక్కువ బరవు ఉన్న వారు ఆ తర్వాత ఫిట్‌నెస్ ఐకాన్‌లుగా మారిపోతారు. అలాంటి వారి గురించి ఓ లుక్కేద్దాం..

సారా అలీఖాన్
బాలీవుడ్‌లో ప్రస్తుతమున్న యంగ్ హీరోయిన్లలో అత్యంత ఫిట్‌గా ఉండే కథానాయికల్లో సారా అలీఖాన్ ఒకరు. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురైన సారా సినిమాల్లోకి రాకముందు దాదాపు 96 కేజీల బరువు ఉండేదట. హార్మోనల్ కండిషన్ వల్ల అంత భారీగా ఉండేదట. సినిమాల్లోకి రావాలనుకున్నాక ఎంతో కష్టపడి సారా తన బరువు తగ్గించుకుందట. ప్రస్తుతం ఈమె ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారిపోయి జిమ్‌లో చెమటోడ్చుతోంది.

అర్జున్ కపూర్
`ఇష్క్ జాదే` సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేయకముందు అర్జున్ కపూర్ కూడా ఊబకాయంతో బాధపడ్డాడు. సినిమాల్లోకి రాకముందు అర్జున్ దాదాపు 105 కిలోలు ఉండేవాడట. అయితే తన లైఫ్‌స్టైల్‌ను మార్చుకుని, కఠిన వ్యాయామాలు చేసి, డైట్ ఫాలో అయి అరంగేట్ర సమయానికి 85 కిలోలకు వచ్చాడట. ప్రస్తుతం అర్జున్ కండలు తిరిగిన దేహంతో ఫిట్‌నెస్ ఐకాన్‌గా మారిపోయాడు. బాలీవుడ్ ఫిట్‌నెస్ గాళ్ మలైకా అరోరాతో అర్జున్ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సొనాక్షీ సిన్హా
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ `దబాంగ్` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సోనాక్షీ సిన్హా. శత్రుఘన్ సిన్హా వారసురాలైన సొనాక్షి సినిమాల్లోకి రాకుముందు 90 కిలోల బరువుండేదట. సినిమాల్లోకి రావాలనుకున్నాక దాదాపు 30 కిలోల బరువు తగ్గిందట. బరువు తగ్గితే సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని సల్మాన్ చెప్పడంతో దానిని సవాలుగా తీసుకుని సొనాక్షి కష్టపడిందట. ప్రస్తుతం ఆమె అత్యంత నాజూగ్గా తన బాడీని మెయింటైన్ చేస్తోంది.

సోనమ్ కపూర్
అనిల్
కపూర్
వారుసురాలైన
సోనమ్
కపూర్
కూడా
సినిమాల్లోకి
రాకముందు
భారీ
శరీరంతో
ఉండేదట.
స్కూలు
రోజుల
నుంచి
ఆమె
ఊబకాయంతో
బాధపడేదట.
పీసీఓడీ
సమస్య
కారణంగా
ఆమె
చాలా
లావుగా
ఉండేదట.
`సావారియా`తో
బాలీవుడ్
ఎంట్రీ
ఇచ్చే
ముందు
ఆమె
ఏకంగా
35
కిలోల
బరువు
తగ్గిందట.
ప్రస్తుతం
ఆమె
బాలీవుడ్‌లో
అత్యంత
ఫిట్,
స్టైలిష్
హీరోయిన్లలో
ఒకరిగా
ఉంది.

అన్షులా కపూర్
బోనీ
కపూర్
కూతురు,
అర్జున్
కపూర్
సోదరి
అయిన
అన్షులా
కపూర్
తన
తాజా
ఫొటోలతో
అందరికీ
షాకిచ్చింది.
అన్షులా
సోషల్
మీడియాలో
ఇప్పటికి
ఎన్నోసార్లు
బాడీ
షేమింగ్‌కు
గురైంది.
తాజగా
ఆమె
తన
జిమ్
ఫోటోలను
అభిమానులతో
పంచుకుంది.
అన్షలా
షాకింగ్
ట్రాన్స్‌ఫర్మేషన్
చూసి
అందరూ
షాకవుతున్నారు.
అన్షులా
కూడా
త్వరలోనే
కథానాయికగా
తెరంగేట్రం
చేయబోతోందని
వార్తలు
వస్తున్నాయి.