For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అభిజిత్‌ పవర్ ఆ స్టారేనా.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ ధీమా అదేనట.. ఎలిమినేషన్ అంటే డోంట్ కేర్!

  |

  బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 ప్రయాణం సగానికి చేరుకొన్నది. 15 వారాలు పాటు సాగే ఈ షోలో ఇప్పటికే 46 రోజులు పూర్తి చేసుకొన్నాయి. ఈ క్రమంలో ఇంటి సభ్యుల మధ్య గట్టి పోటీ వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అభిజిత్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అభిజిత్‌ ధీమాకు పవన్ కల్యాణ్ ఫ్యాన్ అండ అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గతంలో కూడా బిగ్‌బాస్ విజేతల విషయంలో పవర్‌స్టార్ ఫ్యాన్స్ కీలక పాత్ర పోషించారనే విషయాన్ని అభిజిత్ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.. అభిజిత్ బలం, బలాల గురించిన వివరాల్లోకి వెళితే...

   తొలి సీజన్‌లో శివ బాలాజీకి అండగా

  తొలి సీజన్‌లో శివ బాలాజీకి అండగా

  బిగ్‌బాస్ గత సీజన్లను చూసుకొంటే.. ఒకటో సీజన్‌లో శివ బాలాజీ విజేతగా నిలిచారు. ఆయనకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పూర్తిగా సహకారం అందించారనే విషయం బహిరంగంగానే చర్చకు దారి తీసింది. శివబాలాజీ విజేతగా నిలువడం వెనుక పవర్ స్టార్ ఫ్యాన్స్ కారణమని ఓ వాదన బలంగానే వినిపించింది.

  రెండో సీజన్‌లో కౌశల్ మండాకు సపోర్టుగా

  రెండో సీజన్‌లో కౌశల్ మండాకు సపోర్టుగా

  ఇక రెండో సీజన్‌లో కౌశల్ మండాకు కూడా పవన్ ఫ్యాక్టరే కలిసి వచ్చింది. నటుడిగా తన కెరీర్ తొలినాళ్లలో పవన్ కల్యాణ్ తనను ఎంతో ప్రోత్సాహించారనే విషయాన్ని క్లారిటీగా చెప్పేశాడు. పవన్ కల్యాణ్‌ పట్ల కౌశల్ ఆరాధనాభావాన్ని చూపించేవాడు. అయితే తన గెలుపుకు ప్రధాన కారణం కౌశల్ ఆర్మీ అని చెబుతూనే.. పవన్ కల్యాణ్‌పై అభిమానం కూడా తన విజయంలో కీలక అంశంగా మారిందని ఇప్పటికీ చెప్పుకొంటారు.

  నాలుగో సీజన్‌లో అభిజిత్‌కు?

  నాలుగో సీజన్‌లో అభిజిత్‌కు?

  ఇక నాలుగో సీజన్‌కు వస్తే.. ఇంటిలోకి రావడానికి ముందే అభిజిత్‌కు సోషల్ మీడియాలో మంచి బేస్‌ను ఏర్పాటు చేసుకొని వచ్చాడనే విషయంపై చర్చ జరుగుతున్నది. తనకు మద్దతుగా అధిక సంఖ్యలో సోషల్ మీడియాను మేనేజ్ చేస్తున్నారనే వార్తలు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. తన బలం తెలిసినందునే ఎవరూ నామినేట్ చేసిన ధైర్యంగా సరే అంటూ మొండిగా ముందుకెళ్తున్నాడటనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

  బిగ్‌బాస్‌లో వరల్డ్ ఫేమస్ లవర్‌గా

  బిగ్‌బాస్‌లో వరల్డ్ ఫేమస్ లవర్‌గా

  బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో అభిజిత్ మొదటి రోజు నుంచే తన సత్తాను చాటు కొంటున్నాడు. ఇంట్లో వరల్డ్ ఫేమస్ లవర్‌గా ఓ ముద్ర వేసుకొన్నాడు. రొమాంటిక్‌గా కనిపించడంలో, వ్యవహరించడంలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నాడు. అమ్మాయిలతో కెమిస్ట్రీని భారీగానే పండిస్తున్నాడు. అయితే బిగ్‌బాస్ షోలో ప్రతీవారం జరిగే నామినేషన్లకు బెదరకుండా కూల్‌గా కనిపిస్తుంటాడు.

  మోనాల్‌కు దూరంగా.. హరికకు చేరువగా

  మోనాల్‌కు దూరంగా.. హరికకు చేరువగా

  బిగ్‌బాస్ ఆరంభంలో మోనాల్ గజ్జర్‌తో లవ్ ట్రాక్ నడిపేందుకు ప్రయత్నించిన అభిజిత్ ఇప్పుడు పరిస్థితుల కారణంగా దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత హారికతో చనువుగా ఉంటూ గేమ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇక అంతేకాకుండా అప్పుడప్పుడు అరియానా గ్లోరితో కూడా సన్నిహితంగా ఉంటూ తన రొమాంటిక్ జర్నీని కొనసాగిస్తున్నాడు.

  అత్యధికసార్లు ఎలిమినేషన్ నుంచి సేవ్

  అత్యధికసార్లు ఎలిమినేషన్ నుంచి సేవ్

  ఇక అభిజిత్ బలం కూడా పవన్ ఫ్యాన్సే అనే అభిప్రాయం, వాదన వ్యక్తమవుతున్నది. ఇప్పటి వరకు దాదాపు ఎక్కువసార్లు నామినేట్ అయి.. ఎలిమినేషన్ తప్పించుకొన్న వారిలో అభిజిత్ ఉన్నాడు. తనకు సోషల్ మీడియాలో రకరకాల వర్గాల నుంచి ఉన్న సపోర్ట్‌తో ధైర్యంగా తన వ్యూహాన్ని అమలు పరుస్తున్నారనే విషయాన్ని ఆయన సన్నిహితులు కూడా ధృవీకరిస్తున్నారు. రాజకీయంగా, వ్యాపారపరంగా బలమైన నెట్‌వర్క్ ఉండటం అభిజిత్ కలిసి వచ్చే అంశంగా మారింది.

  Bigg Boss Telugu 4: Bigg Boss show was once again criticised for its elimination process
  అవినాష్, అఖిల్‌తో గట్టిపోటీతో

  అవినాష్, అఖిల్‌తో గట్టిపోటీతో

  ఇక బిగ్‌బాస్ ఇంటిలో కంటెస్టెంట్ల పరిస్థితి చూస్తే జబర్దస్త్ అవినాష్ దూసుకెళ్తున్నాడు. తనదైన కామెడీ, డైలాగ్స్‌తో కేకపెట్టిస్తున్నాడు. ఇంటి సభ్యులే కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకొంటూ జోరు కొనసాగిస్తున్నాడు అవినాష్, అభిజిత్, అఖిల్, సయ్యద్ సోహైల్, లాస్య మధ్య గట్టిపోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అభిజిత్ తన బలాలను ఏ విధంగా ఉపయోగించుకొంటాడో వేచి చూడాల్సిందే.

  English summary
  Tollywood Actor and Life is beautiful fame Abijeet Duddala showing his stregnth and struggle in Bigg Boss Telugu 4. He proved one of the strong contestant in the Show. Reports suggest that he has strong fan base in social media and Pawan Kalyan fans too.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X