Don't Miss!
- News
"ఆర్ఆర్ఆర్" కు అవార్డుల పంట.. అరుదైన అకాడమీ అవార్డు దక్కించుకున్న రాజమౌళి సినిమా!!
- Finance
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కళ్లు చెదిరే లాభాలు.. కానీ పడిపోయిన స్టాక్ ధర.. ఏం చేయాలి..?
- Lifestyle
స్త్రీ, పురుషులు ఇద్దరూ తమ సంతానోత్పత్తని మెరుగుపరుచుకోవడానికి ఇవి తినాలి!
- Technology
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- Sports
INDvsNZ : మూడో వన్డేలో టాప్ స్కోర్ చేసే బ్యాటర్ ఎవరు?.. ఈ ముగ్గురి మధ్య పోటీ!
- Automobiles
మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్' మనసు దోచిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
హీరోతో ఎఫైర్‌పై ప్రముఖ క్రీడాకారిణీ క్లారిటీ.. అందుకే రొమాన్స్ చేస్తున్నామంటూ చెప్పేసింది.!
సినిమా స్టార్లకు, స్పోర్ట్స్ పర్సన్లకు ప్రేమ వ్యవహారాలు కొత్తేం కాదు. ఈ రెండు రంగాలకు చెందిన వాళ్లే అందరికంటే ఎక్కువగా ప్రేమాయణాలు సాగిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇండియాలో క్రికెటర్లు.. సినిమా హీరోయిన్లతో పెట్టుకున్న ఎఫైర్లు అన్నీ ఇన్నీ కాదు. అయితే, తొలిసారి ఓ ప్రముఖ క్రీడాకారిణి, సినిమా హీరోతో ప్రేమలో పడడం హాట్ టాపిక్ అవుతోంది. అది కూడా పెళ్లైన తర్వాత ఆమె డేటింగ్ చేయడం సంచలనం అయింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ వ్యవహారం తెలిసిపోయింది. ఈ నేపథ్యంతో ఆమె హీరోతో ఎఫైర్‌పై తొలిసారి స్పందించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఆటలో తిరుగులేదు.. అందుకే ఫుల్ ఫేమస్
భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాని తర్వాత చాలా మంది ఇష్టపడే ఆటల్లో బాడ్మింటన్ ఒకటి. మేటి క్రీడాకారులు ఇందులో సత్తా చాటుతుండడమే దీనికి కారణం. ఈ ఆట ద్వారానే వెలుగులోకి వచ్చింది గుత్తా జ్వాల. డబుల్స్ స్పెషలిస్టుగా పేరొందిన ఈమె అసాధారణ ఆటతో ఆకట్టుకుంది. ఫలితంగా బాగా ఫేమస్ అయిపోయింది.

వివాదాలతో స్నేహం.. ఆమెపై ఆగ్రహ జ్వాలలు
ఆటలో ఎంతగా ఆకట్టుకుందో.. వ్యక్తిగతంగా అంతగా వివాదాస్పదమవుతోంది గుత్తా జ్వాల. సమాజంలో జరుగుతున్న ఏదో ఒక అంశంపై స్పందిస్తోన్న ఆమె.. తన వ్యవహార శైలితో విమర్శలు ఎదుర్కొంటోంది. అలాగే, తన ఆటకు సంబంధించి అధికారులపై ఆరోపణలు చేసి వార్తల్లోకి ఎక్కింది. అలాగే, ప్రేమ, పెళ్లి విషయాల్లోనూ హాట్ టాపిక్ అయింది.

ప్రేమ వివాహం.. అంతలోనే విడిపోయింది
గుత్తా జ్వాల ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సహచర ఆటగాడు చేతన్ ఆనంద్‌తో ప్రేమలో పడింది. చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆరేళ్ల పాటు మంచిగానే ఉన్న ఈ జంట.. 2011లో ఊహించని రీతిలో విడాకులు తీసుకుని షాకిచ్చింది. ఇక, అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవనం సాగిస్తోంది.

సినిమాల్లోనూ నటించి మెప్పించిన జ్వాల
బాడ్మింటన్ ప్లేయర్‌గానే కాకుండా అందం పరంగా ఎంతో ఫేమస్ అయింది గుత్తా జ్వాల. అందుకే ఆమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే నితిన్ నటించిన ‘గుండె జారి గల్లంతయ్యిందే' అనే సినిమాలో ఆమెతో స్పెషల్ సాంగ్ చేయించారు. ఆ సినిమాలో జ్వాల కనిపించిన తీరుకు, ఆమె వేసిన డ్యాన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి.

స్టార్ హీరో కాపురంలో చిచ్చు పెట్టి.. డేటింగ్ చేస్తోంది
కొన్ని సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును దక్కించుకున్న తమిళ హీరో విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల డేటింగ్ చేస్తోంది. వీళ్లిద్దరూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న తీరు దీనికి బలం చేకూర్చుతోంది. మరోవైపు, విష్ణు తన భార్యకు కొన్నేళ్ల క్రితం విడాకులు ఇచ్చాడు. దీనికి కారణం కూడా గుత్తా జ్వాలనే అనే ప్రచారం జోరుగా సాగింది.
Recommended Video

హీరోతో ఎఫైర్‌పై ప్రముఖ క్రీడాకారిణీ క్లారిటీ
విష్ణు విశాల్‌తో డేటింగ్ చేస్తోందంటూ వస్తున్న వార్తలపై గుత్తా జ్వాల తాజాగా స్పందించింది. ఇటీవల ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. ‘అవును.. నేను అతడితో ప్రేమలో ఉన్నా. ఇద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. అందుకే ఏ భయం లేకుండా ఫొటోలు షేర్ చేస్తున్నాం' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది.