రెండో పెళ్లి చేసుకొన్న దర్శకేంద్రుడి మాజీ కోడలు.. కొత్త ఆరంభం అంటూ ఫోటోలతో రచ్చ

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెల మూడి మాజీ భార్య కనికా థిల్లాన్ గురించి అందరికీ తెలిసిందే. కథా రచయిత్రిగా తెలుగు సినిమాకు పని చేసింది. బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలకు కథను అందించింది. అయితే ఏనాడూ కూడా తన పని వల్ల గుర్తింపు మాత్రం తెచ్చుకోలేదు. వ్యక్తిగత జీవితంలో వివాదాలతో వార్తల్లోకి ఎక్కేది. ప్రకాష్ కోవెలమూడితో విడాకులు, మళ్లీ రెండో పెళ్లి వైపు అడుగులు అంటూ వార్తల్లో వైరల్ అవుతూ వచ్చింది.

 కలిసిరాని బంధం..

కలిసిరాని బంధం..

అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో వంటి చిత్రాలతో ప్రకాష్ కోవెల మూడి తెలుగు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. అయితే సైజ్ జీరో చిత్రానికి ప్రకాష్ కోవెలమూడితో పాటు కనికా థిల్లాన్ కూడా పనిచేసింది. ఆ సమయంలో వారిద్దరూ భార్యాభర్తలుగానే ఉన్నారు. కానీ వీరిద్దరి మధ్య బంధం ఎక్కువగా కాలం నిలవలేదు. విడిపోయి ఎవరికి వారే విడిగా జీవిస్తూ వచ్చారు.

 బాలీవుడ్ రచయితో ప్రేమాయణం..

బాలీవుడ్ రచయితో ప్రేమాయణం..

మెంటల్ హై క్యా, కేదార్‌నాథ్ వంటి చిత్రాలకు కనికా కథలను అందించింది. కానీ ఏ ఒక్కటి కూడా విజయం సాధించలేదు. స్వర భాస్కర్ మాజీ ప్రియుడు, రచయిత హిమాన్షు శర్మతో కనికా గత కొన్ని రోజలుగా రిలేషన్ షిప్‌లో ఉంది. మొత్తానికి ఈ ఇద్దరూ వివాహా బంధంతో ఒక్కటయ్యారు.

గత నెలలో నిశ్చితార్థం..

గత నెలలో నిశ్చితార్థం..

డిసెంబర్ నెలలో ఈ ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. మా బంధాన్ని పెళ్లితో ముందుకు తీసుకెళ్లుందుకు సిద్దమయ్యాయమని చెబుతూ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నామంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఆ ఘడియలురానే వచ్చాయి.

 పెళ్లి ఫోటోలు వైరల్..

పెళ్లి ఫోటోలు వైరల్..

కొత్త ఏడాదిలో కొత్త ఆరంబం.. అంటూ కనికా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఇందులో హిమాన్షు శర్మతో పాటు పెళ్లి తంతులు పూర్తి చేస్తోన్న తన ఫోటోలను షేర్ చేసింది. టాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రిటీలందరూ కనికాకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Recommended Video

Amavasya Movie Team Funny Interview | Sachin Joshi | Bhushan Patel |Ali Asgar | Filmibeat Telugu

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X