For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rishab Shetty:తెలుగులోనూ నటించిన 'కాంతార' హీరో.. అసలు పేరు వేరే.. రిషబ్ శెట్టి గురించి తెలియని నిజాలు!

  |

  కాంతార.. ఇప్పుడు అన్ని సినీ ఇండస్ట్రీలను ఊపేస్తున్న సినిమా పేరు. ఒక చిన్న సినిమాగా కన్నడ నాట విడుదలై వారం రోజుల్లోనే దేశం మొత్తం చర్చించుకునేలా చేసింది ఈ మూవీ. ముఖ్యంగా ఈ సినిమా టేకింగ్, డైరెక్షన్, యాక్షన్, మ్యూజిక్, కథ ఇలా ఒక్కటేంటి.. ప్రతి అంశం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ సినిమా గురించి మాట్లావడాలంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు రిషిబ్ శెట్టి. హీరోగా చేస్తూ దర్శకత్వం చేయడం అంటే మాములు విషయం కాదు. అలా కొద్దిమంది మాత్రమే సక్సెస్ అవుతారు. కానీ, రిషబ్ శెట్టి సక్సెస్ అవడం కాదు ఒక డైరెక్టర్, హీరో ఎలా ఉండాలో చూపించాడు. ఇప్పుడు అందరి దృష్టి రిషబ్ శెట్టిపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర నిజాలు మీకోసం.

  కర్ణాటకలోని కుందాపూర్ లో..

  కర్ణాటకలోని కుందాపూర్ లో..


  దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న కాంతార సినిమాకు హీరోగా, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి. కర్ణాటకలోని కుందాపూర్ లో 1983 జులై 7న రిషబ్ షెట్టి జన్మించారు. హిందూ కుటుంబంలో జన్మించిన రిషబ్ తండ్రి పేరు భాస్కర్ శెట్టి. తల్లిపేరు లక్ష్మి షెట్టి. ఆయనకు ప్రవీణ్ శెట్టి అనే సోదరుడు కూడా ఉన్నాడు. ఫిలీం డైరెక్షన్ లో డిప్లోమా చేసిన రిషబ్.. కన్నడ డైరెక్టర్ ఏఎంఆర్ రమేష్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. రమేష్ తెరకెక్కించిన 'సైనైడ్' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు రిషబ్ శెట్టి. ఈ సినిమాతో సినీ కెరీర్ ను స్టార్ట్ చేశారు రిషబ్. సినిమాపై ఫ్యాషన్ తో పలు టీవీ సిరీస్ ల్లోనూ పనిచేశారు రిషబ్ శెట్టి. అయితే ఆ సమయంలో ఆర్థికంగా పలు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు.

  నామమాత్రంగా అవకాశాలు..

  నామమాత్రంగా అవకాశాలు..

  ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ పని మానేసి ఏదైనా మంచి ఉద్యోగం చేసుకోమ్మని ఇంట్లో వాళ్లు సలహా ఇచ్చారు. అయినా అవేమి పట్టించుకోని రిషబ్ శెట్టి.. సినిమాపై ఉన్న ప్రేమతో అదే రంగంలో కొనసాగారు. ఇక 2010లో నటుడిగా కెరీర్ ప్రారంభించారు రిషబ్ శెట్టి. 'నామ్ ఓరీలి ఒండినా' అనే సినిమాలో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలో నటించారు. ఆ తర్వాత కన్నడ హీరో రక్షిత్ శెట్టి తుగ్లక్ సినిమాలో కనిపించారు రిషబ్ శెట్టి. ఇలా చిన్న పాత్రలతో నామమాత్రంగా అవకాశాలు వచ్చినా ఎక్కడా వెనుకంజ వేయలేదు. నిజానికి రిషబ్ శెట్టికి యాక్టింగ్ కంటే డైరెక్షన్ పైనే ఎక్కువ ఆసక్తి. ఇలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూనే మరోవైపు దర్శకత్వానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు రిషబ్ శెట్టి.

  తొలి ఛాన్స్ ఇచ్చిన రక్షిత్ శెట్టి..

  తొలి ఛాన్స్ ఇచ్చిన రక్షిత్ శెట్టి..


  ఈ క్రమంలోనే 2017లో రిషబ్ శెట్టికి రక్షిత్ శెట్టి ఒక అవకాశం కల్పించాడు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం 'రిక్కీ'. 2016లో విడుదలైన ఈ సినిమాలో హరిప్రియ (పిల్ల జమీందార్ ఫేమ్) హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఆ తర్వాత మళ్లీ రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన 'కిరిక్ పార్టీ' మూవీ బ్లాక్ బస్టర్ గా హిట్టు కొట్టింది. ఈ సినిమాతో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక రిషబ్ షెట్టికి నటుడిగా గుర్తింపు తీసుకొచ్చింది 'బెల్ బాటమ్' సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నారని టాక్. ఈ చిత్రంలో హీరోయిన్ గా హరిప్రియనే నటించింది.

  సినిమాకు జాతీయ అవార్డు..

  సినిమాకు జాతీయ అవార్డు..

  ఇక రిషబ్ శెట్టి తెరకెక్కించిన మూడో సినిమా 'సర్కారీ హిరియా ప్రాథమిక షాలే కాసరగడ్'. 2018 సంవత్సరంలో వచ్చిన ఈ మూవీ ఉత్తమ బాలల చిత్రం కేటగిరీలో రిషబ్ శెట్టికి జాతీయ అవార్డు తీసుకొచ్చింది. ఈ సినిమాతో నిర్మాతగా మారాడు రిషబ్ శెట్టి. నేషనల్ అవార్డే కాకుండా ఫిలీం ఫేర్, ఐఫా, సైమా అవార్డులను కూడా కైవసం చేసుకుంది ఈ సినిమా. అయితే రిషబ్ శెట్టి తెలుగు సినిమాలోనూ నటించారు. ఈ ఏడాది బ్యూటిఫుల్ హీరోయిన్ తాప్సీ ప్రధాన పాత్రలో వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో ఖలీల్ అనే పాత్రలో నటించారు రిషబ్ శెట్టి. ఈ మూవీలో వారి పేర్లు చెబుతూ RRR అని అంటే రిషబ్ శెట్టి వాళ్ల గ్యాంగ్ తో KGF వస్తుందని చెబుతాడు.

   రూ. 18 కోట్ల బడ్జెట్ తో..

  రూ. 18 కోట్ల బడ్జెట్ తో..


  ఇక రిషబ్ శెట్టి 2107లో ప్రగతిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి నిర్మాతగా ఓ మూవీ, డైరెక్టర్ గా మరో చిత్రం చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ లను అధికారికంగా ప్రకటించారు రిషబ్ శెట్టి. ఇక కాంతార చిత్రం విషయానికొస్తే కేజీఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలీంస్ ఈ సినిమాను రూపొందించింది. కేవలం రూ. 18 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం రూ. 200 కోట్లకు క్రాస్ అయింది.

  English summary
  Kannada Movie Kantara Hero And Director Rishab Shetty Acted In Telugu Movie. And Unknown Facts Of Rishab Shetty
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X